అందరికి సమతుల్య ఆహారం(Balanced Food) అవసరం.ఆరోగ్య విషయంలో ఆడ(Woman),మగ(Man) అనే లింగ బేధం ఉండదు కానీ కొన్ని సార్లు ఆహారం తీసుకునే విషయంలో లింగ బేధం అవసరం. ఎందుకంటే తీసుకునే ఆహారం మహిళల పై ఒక రకంగా, పురుషుల పై మరో రకంగా ప్రభావాన్ని చూపిస్తుంది.

పురుషులు దైనంత జీవితం లో చేసే పనులు, ఎదుర్కునే అధిక ఒత్తడి(Stress)లా కారణంగా ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

మరి మగవారు(Gents) తీసుకోవాల్సిన ఆహారాలేంటో తెలుసుకుందామా!

శరీరం ఒకే బరువనున్న స్త్రీ, పురుషులు, ఒకే రకమైన కొవ్వు(Fats) నిల్వలు కలిగి వున్న వారు వ్యాయామం(Exercise) ద్వారా ఖర్చు చేసే క్యాలరీ (Calories)లు  కూడా ఒకటే అయినా క్యాలరీలు అవసరం మాత్రం వేరు వేరు గా ఉంటుంది.

మగవారి(Men)లో దృఢమైన కండరాలు(Strong muscles) ఉండడం వల్ల వారు వ్యాయామమే చేయకపోయిన, కండరాలు ఎదస్థితికి వుండడానికైనా క్యాలరీలు అవసరమవుతాయి. అందుకే మహిళలో కంటే మగవారిలో  ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. సాధారణంగా మహిళల(Women)కు రోజుకు 1200 క్యాలరీలు అవసరమవుతాయి. కానీ పురుషులకు అంతకుమించి అవుతుంది.

పురుషులకు అధికంగా ప్రోటీన్(More protein) అవసరమవుతుంది. ఇందుకోసం మాంసాహారం ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా రెడ్ మీట్(Red meat), చేపలు(Fish), సముద్రపు ఆహారం(Sea Food) తీసుకోవడం అవసరం.

రెడ్ మీట్ లో యుసిన్ ఎమినో యాసిడ్స్(Ucin amino acids), కండరాలు(Muscles) దృడంగా ఉండేందుకు ఉపయోగపడతాయి.

పురుషులకు మాంసాహారం(Non-Vegetarian)తో పాటు శాఖాహారం(Vegetarian) కూడా ముఖ్యమే ఇంకా చెప్పాలంటే అన్ని రకాల పోషకాలు లభించాలంటే కూరగాయలు(Vegetables) మేలు. ఈ కారణంగా  కణాల ఆరోగ్యం బాగుంటుంది.

ఇందుకోసం అన్ని రంగులున్న కూరగాయలు తప్పని సరిగా తీసుకోవాలి.ఆకుపచ్చని ఆకు కూరల నుంచి లభించే యుటిన్(Utin),  జెక్వాంకిన్(Jakavakin)  పోషకాలు  వల్ల ప్రోస్టేట్ గ్రంథి(Prostate Gland)కి వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

ఇక కాషాయ రంగు(Orange color)లో వుండే కూరగాయ(Vegetables)ల్లో బీటా కెరోటిన్(Beta Carotene ), లుటిన్ (Lute in ), విటమిన్ సి(Vitamin C) ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. టొమాటా(Tomatoes)ల నుంచి  లైకోపీన్(Lycopene) అందుతాయి.

టమోటాలను తినడం వల్ల మహిళలకంటే పురుషుల(Men)కే అనేక ప్రయోజనాలు(Benefits) వున్నాయి.లైకోపీన్ శక్తివంతమైన యాంటీ – యాక్సిడెంట్(Anti-Oxidant) గా పనిచేస్తుంది. తక్కువ క్యాలరీలు(Calories) గల టమోటాలు చర్మం(Skin), కళ్ళ(Eyes)కు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఏ (Vitamin A), విటమిన్ సి(Vitamin C), రోగ నిరోధక(Immunity Boost) శక్తిని పెంపొందించి. వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

పురుషుల్లో కండ పుష్టికి గుడ్డు(Egg) చాల అవసరం. రోజు ఒక గుడ్ తినాలని న్యూట్రీషన్లు(Nutrition’s) చూచిస్తున్నారు. దీని వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్(Protein) లభిస్తుంది. కాబట్టి పురుషుల ఆరోగ్యానికి గుడ్డు చాలా ముఖ్యంగా పీచు(Fiber) పదార్థం కోసం బ్రౌన్ రైస్(Brown rice), ఓట్స్(Oats),తృణ ధాన్యాలు(Cereals) తీసుకోవాలి.

వీటిలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. టైపు 2 డయాబెటిస్(Type 2 Diabetes) రాకుండా తృణ ధాన్యాలు రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు పాలు(Milk), పాల ఉత్పత్తులు(Dairy Products) సంవృద్ధిగా తీసుకుంటే పురుషుల(Gents)కు మంచి కాల్షియం(Calcium) అందుతుంది. వీటి తో పాటు సీజనల్(Seasonal) గా దొరికే పండ్ల(Fruits)ను రోజు వారి డైట్(Diet) లో చేర్చుకుంటే మంచిది.

ఇవన్నీ మగవారి కండరాల(Muscles)కు ధృడంగా ఉండడానికి ఉపయోగపడే ఆహారాలు. అయితే ఈ ఆహారాలు తీసుకుంటూనే క్యాలరీలు(Calories) ఖర్చు చేసేందుకు శ్రమపడడము తప్పనిసరి లేని పక్షంలో శరీరంలో కొవ్వు(Fat) పేరుకుపోతుంది.