అవుట్ ఆఫ్ ది బాక్స్ కథ(Out of the Box Stories)లు అభిమానుల(Fans)ను ఆకట్టుకోవడంలో విఫలం కాదు. ఎప్పుడూ ఇలాంటి కథలతో అభిమానులను అలరిస్తున్న సంస్థ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్(Dream Warrior Pictures) సంస్థ యొక్క తదుపరి విడుదల కానున్న సినిమా ‘ఒకే ఒక జీవితం'(Oke Okka Jeevitham). తాజాగా ఈ సినిమాటీజర్‌(Cinema Teaser)ను నటుడు సూర్య తన ట్విట్టర్ పేజీ(Twitter Page)లో విడుదల చేశారు. ఇది సోషల్ మీడియా(Social Media)లో అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్ ని చుసిన పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందాని(Movie Unit)కి శుభాకాంక్షలు(Wishes) తెలిపారు.

ఈ చిత్ర టీజర్‌(Movie Teaser) విడుదల సందర్భంగా దర్శకుడు(Director) శ్రీ కార్తీక్‌ మాట్లాడుతూ,‘ఒకే ఒక జీవితం’ మాతృ ప్రేమ(Mother Love) నేపథ్యంలో సాగే అందమైన సైన్స్‌ ఫిక్షన్‌(Science Fiction) చిత్రం. ఈ చిత్రాన్ని తమిళం(Tamil)తో పాటు తెలుగు(Telugu)లోనూ దర్శకత్వం వహించాను. తెలుగు వెర్షన్‌లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషించగా, తమిళ వెర్షన్‌లో సతీష్, రమేష్ తిలక్ నటించారు. చిన్న బడ్జెట్(Small Budget) చిత్రంగా ప్రారంభించినప్పటికీ, ఇది ఇప్పుడు సైన్స్ ఫిక్షన్, గణనీయమైన బడ్జెట్‌తో ద్విభాషా చిత్రంగా రూపొందింది అని తెలిపారు.

ఇక ఈ చిత్రం లో హీరో శర్వానంద్, అక్కినేని అమల ప్రధానపాత్ర(Main Roles)ల్లో కనిపించనున్నారు. హీరో శర్వానంద్ తన కెరీర్‌(Career)లోనే  మైల్ స్టోన్ లాంటి చిత్రాన్ని చేసారు. హీరో శర్వానంద్ 30వ సినిమాగా ఒకే ఒక జీవితం అంటూ ఆడియన్స్(Audience) ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్(Dream Warrior Pictures Banner) మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా(Family Drama), సైన్స్ ఫిక్షన్(Science Fiction),  సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు. నాజర్, రీతూ వర్మ, సతీష్, రమేష్ తిలక్ మరియు MS భాస్కర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌(cinematographer)గా సుజిత్ సారంగ్, కంపోజర్(Composer): జేక్స్ బిజోయ్, ఎడిటర్(Editor): శ్రీజిత్ సారంగ్, ఆర్ట్ డైరెక్టర్(Art Director) సతీష్ కుమార్. కథలో ముఖ్యమైన పాత్రలను హితేష్, జై మరియు నిత్య అనే ముగ్గురు అబ్బాయిలు పోషించారు.

ఈ సినిమా చివరి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి వీఎఫ్‌ఎక్స్(VFX) సన్నివేశాల కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే, ఈ టీజర్(Teaser) ద్వారా సినిమా ఎలా ఉంటుందో చిన్న ప్రివ్యూ రిలీజ్ చేసాం. ఈ మూవీ కి సంభందించిన  మరెన్నో అద్భుతమైన విషయాలు త్వరలో బయటికి వస్తాయి. ఈ సినిమాలోని తల్లి పాట(Mother Song)ను త్వరలో విడుదల చేస్తాం. ఆ పాటను సింగర్(Singer) సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. ఒకే ఒక జీవితం తమిళం(Tamil)లో కణం(Kanam) పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రం 2022లో తమిళ-తెలుగులో గ్రాండ్ రిలీజ్(Grand Release) కానున్నది