బిగ్‌ బాస్ సీజన్ 5(BIG Boss season 5) సోమవారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం నామినేషన్ లో మొత్తం ఆరుగురు సిరి, శ్రీరామ్, షన్ను, రవి, లోబో,మానస్ లు నామినేట్ అయ్యారు.

ఎనిమిదోవారం కెప్టెన్సీ(Captency) కంటెండర్‌ టాస్క్‌ హౌస్ మేట్స్(House mates) కు కత్తి మీద సాముల తయారైంది. కెప్టెన్‌ అవ్వడానికి  కంటెస్టెంట్స్‌(Contestants) ఎవరికీ తగ్గట్టు వారు గట్టి పోటీనే ఇస్తున్నారు .

లోబో, షణ్ముఖ్‌ ఆవు పేడలో నుంచి ముత్యాలు తీయ్యగా,  సిరి, రవి స్విమ్మింగ్‌ఫూల్‌లో సీసాలు తీశారు. మరోవైపు మానస్‌, శ్రీరామచంద్రలు చమటలు పట్టేలా రోప్స్ ని  ఊపారు.

మరి ఈ టాస్కు(Task)ల్లో ఎవరుగెలిచారు. హౌస్‌ని లాక్‌డౌన్‌(Lock down) చేస్తున్నట్లు తెలిపిన బిగ్ బాస్(Big boss). ఇంట్లోకి వెళ్లాలంటే టాస్క్ లు  ఆడాల్సిందే మరి హౌస్ మేట్స్ ఎలాంటి టాస్క్ లు ఆడారు.

ఇంట్లో కి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డారో? ఆ వివరాలు52వ ఎపిసోడ్‌లో చదివేద్దాం…..

బెడ్‌రూమ్‌ లో వున్న సిరి, పింకీ, మానస్‌లు ముచ్చట్లు పెట్టారు. ఈ సారి నామినేషన్‌(Nomination)లో ఆరుగురు ఉన్నారు కదా అని మానస్‌ అడగ్గా అవును ఒక గర్ల్‌, ఐదుగురు బాయ్స్‌ ఉన్నారని అంటుంది సిరి.

పింకి ఈ సారి కూడా నామినేషన్‌లో లేదని సిరి అనగా. నేను మానస్‌ టాప్‌ 5 (Top 5)లో ఉంటామని ప్రియాంక చెప్పింది. దానికి సిరి నవ్వుతూ,’మేమేంటి అడుక్కోవాలా..? అని అనగా, మా పక్కన మీ ముగ్గురు కూడా ఉంటారులే అని సెట్టైర్ వేసింది పింకి.

ఇక మానస్‌ మధ్యలో మాట్లాడుతూ అంకుల్స్‌ అంతా బయటకు వెళ్లిపోవాలి. కుర్రాళ్లంతా లోపలే ఉండాలని మాసన్‌ ఆశపడ్డాడు.

ఒకవేళ ఆంటీలను బయటకు పోవాలని చెబితే పింకీ వెళ్తుందని సిరి నవ్వుతూ కౌంటర్‌ వేయగా మొహం పగిలిపోద్దని ప్రియాంక సరదాగా వార్నింగ్ చేసింది.

ఇక రవి ఏమో ఎప్పటి లానే  దొరికినోళ్లను ఇన్‌ఫ్లూయన్స్‌(Influence) చేసే పనిలో పడ్డాడు. షణ్ముఖ్‌ దగ్గరకు వెళ్లి ‘నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను? అంటే, ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ, ఆన్ బెడ్ విత్ త్రీ’ అంటూ షన్ను ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతాడు.

షన్ను కూడా నాగ్ సార్ చూపించిన వీడియో చూసాక రియలైజ్ అయ్యాను అంటూ ఒక్కరిఒక్కరు హాగ్ చేసుకుని, ఏదైనా ఉంటే డైరక్ట్ గా తనకే చెప్పాలని అంటాడు రవి.

ఇక కెప్టెన్సీ(Captency) కంటెండర్ టాస్క్ కోసం ఇంటిని లాక్‏డౌన్ చేసినట్లుగా వెల్లడించిన బిగ్ బాస్(Big Boss). ఇందులో భాగంగా అభయహస్తం టాస్కులో గెలిచి కెప్టెన్సీ కంటెస్టెంట్(Contestant) గా సెలక్ట్ అయిన సభ్యులు మాత్రమే ఇంట్లోకి ప్రవేశం ఉంటుందని షరతు పెట్టాడు .

ఈ వారం కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి, అలాగే ఇంట్లోకి వెళ్లడానికి ఐదు చాలెంజ్‌లు ఎదుర్కొవాల్సి ఉంటుందని చెప్పారు బిగ్‌బాస్‌. ఈ చాలెంజ్‌లో భాగంగా ఎవరెవరు పోటీ పడతారనేది ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో చెప్పాలి. అలాగే ఒక చాలెంజ్‌లో ఓడినవారు హౌస్ మేట్స్ ని ఒప్పించి మిగతా చాలెంజ్‌లలో కూడా పాల్గొనవచ్చు.

ఈ చాలెంజ్‌లో భాగంగా గార్డెన్‌ ఏరియాలో బాత్‌టబ్‌లో మట్టి, పేడ, ముత్యాలు కలిపి ఉంటాయి. దాని నుంచి ఎవర ఎక్కువ ముత్యాలు తీస్తారో వారే ఆ ఛాలెంజ్ విన్నర్. ఒక్కోసారి ఒక్కో  ముత్యాన్ని మాత్రమే వేయాలి. ఈ టాస్క్‌(Task) కి హౌస్ మేట్స్ అందరు ఏకాభిప్రాయంతో ఇప్పటివరకూ కెప్టెన్(Captain) పోటీదారులుగా అర్హత సాధించలేకపోయిన షణ్ముఖ్, లోబోలు వెళ్లాలని నిర్ణయిస్తారు.

టాస్క్‌ లో షన్నూ 101 ముత్యాలను ఏరి లోబో ౭౪  పై గెలిచి విజేత(Winner) నిలిచాడు. అయితే షణ్ముఖ్‌ తీసిన ముత్యాలు సరిగా లేవని విశ్వ, శ్రీరామచంద్ర, రవి అనగా నీట్‌గా ఉండటం కాదు  ఎక్కువ తీయాలంతే అంటూ అడ్డంగా వాదించింది సిరి. చివరకు సంచాలకులుగా ఉన్న సన్నీ షణ్ముఖ్‌ని విన్నర్‌గా తెలిపాడు.

రెండో చాలెంజ్‌గా ‘గాలం మార్చే మీ కాలం’టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌ లో భాగంగా స్విమ్మింగ్‌ ఫూల్‌ అడుగున​ ఉన్న బాటిల్స్‌ని ఫిషింగ్‌ రాడ్‌తో బయటకు తీయాలి. ఎండ్‌ బజర్‌(End Buzzer) మోగేలోపు ఎవరు ఎక్కువ బాటిల్స్‌(Bottles) ని బయటకు తీస్తారో వారే విజేత గా నిలుస్తారు.

దీని కోసం రవి, సిరి నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. ఎండ్ బజార్ మోగే సరికి రవి దగ్గర 12 బాటిల్స్, సిరి 15 బాటిల్స్ ఉండగా ఈ టాస్క్ లో సిరి విన్నర్ గా నిలిచింది.

మూడో చాలెంజ్‌గా తాడుల తకదిమి టాస్క్‌ ఇచ్చారు.

ఈ టాస్క్ లో శ్రీరామచంద్ర, మానస్‌ పోటీ పడ్డారు. ఇందులో భాగంగా ఎవరైతే దాడులను వేగంగా కదుపుతూ ఆపకుండా ఉంటారో వారే గెలుస్తారు. ఇద్దరు చెమటలు వచ్చేలా తాడులను ఊపారు.

చివరకు మానస్‌ తాడులను వదిలేయడంతో శ్రీరామ్‌ విన్నర్(Winner) అయ్యాడు. అయితే మిగిలిన టాస్క్‌(Task) లతో పోల్చితే ఈ టాస్క్‌ కోసం శ్రీరామచంద్ర చాలా కష్టపడ్డాడు.

మొత్తంగా ఇప్పటివరకు కెప్టెన్సీ(Captaincy) దారులుగా షణ్ముఖ్‌, సిరి, శ్రీరామచంద్రలు గెలిచి, బిగ్‌బాస్‌(Big Boss) హౌస్‌లోకి వెళ్లారు. మిగిలి సభ్యులంతా బయటే ఉన్నారు.

మరి వారిలో ఏ ఇద్దరు చాలెంజ్‌లు గెలిచి కెప్టెన్సీ పోటీదారులైన షన్నూ, సిరి, శ్రీరామ్‌లతో పోటీ పద్దనున్నారో ?

ఈ వారం కెప్టెన్‌(Captain)గా ఎవరు ఎంపికయ్యారో తెలియాలంటే బుధవారం వచ్చే ఎపిసోడ్  వరకు ఆగాల్సిందే.