ఉరుకుల పరుగుల జీవన విధానం(Busy Life)లో ప్రతి సారి ఆరోగ్యకరమైన ఆహారం(Healthy Food) తీసుకోవడం కొంచం కష్టమైనదే. మన జీవన శైలి మనం ఏంటో నిర్దారిస్తుంది.

సరైన జీవన శైలి లేకపోవడం కారణంగా మనిషికి అనేక మానసిక(Mentally), శారీరక(Physically) సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటిదే మలబద్దకం(Constipation).

మలబద్దకం సమస్యను చాలా సులువైన  పద్దతిలో వదిలించుకోవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

అనారోగమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్ల మలబద్దకాన్ని దారి తీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి చాల మంది మందులు వాడుతుంటారు. మందులు ఉపశమనం ఇస్తాయి కానీ తరువాత కాలంలో అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తాయి. అలాకాకుండా మన జీవన శైలిని మార్చుకోవడం ద్వారా మలబద్దకాన్ని జీయించవచ్చు. మల విసర్జన కోరికను బలవంతంగా అణుచుకునే అలవాటును మానుకోవాలి.

మలబద్దకం సమస్య నుంచి బయటపడేందుకు మనం ఎక్కువగా ఫైబర్(Fiber) తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. గోధుమ బియ్యం(Wheat Rice) గోధుమ రొట్టె(chapathi),వంటి తృణ ధాన్యాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. బొప్పాయి(Papaya), అరటి(Banana),నారింజ(Orange), అవకాడో(Avocado) వంటి పండ్ల(Fruits)లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. వీటిని పుష్టిగా తినవచ్చు.

మనం ఎక్కడ వున్న సరే మలవిసర్జనకు వెనకాడవద్దు విలువైన పోషకాలు లభించే పండ్లను తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు.

త్రాగునీటిని(Water) క్రమం తప్పకుండా త్రాగడం వల్ల శరీరం డిహైడ్రాట్(Dehydrate) కాకుండా ఉండవచ్చు. కొద్దిగా వెచ్చని నీరు తాగితే జీర్ణ క్రియ సమస్య తొలిగిపోవడమేకాక, మలబద్ధకమ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కొన్ని ఆహారాలు మలబద్దకాన్ని పెంచుతాయి.

పాలు ఉత్పత్తులు(Dairy Products), చెక్కర వంటకాలు(Sweets), అధిక కొవ్వు(Fat) మాంసాలు మలబద్దకం వచ్చేందుకు దోహదపడతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మలబద్దకాన్ని దూరం చేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం లేదా యొగాభ్యసనం, శ్వాస అభ్యసనాలు, విశ్రాంతి తీసుకోవడం వంటివి చేయాలి.

నడక(Walking), జాగింగ్(Jagging), ఫ్రీ హాండ్స్ సైకిల్(Free Hands Cycle) లేదా ఈత(Swimming) వంటి వ్యాయామాలు(Exercise) మలబద్దకం వంటి సమస్యలను దూరం చేయడంలో తోడ్పతాయి.విరేచనాలు తేలికగా అవడం కోసం రెండు వారలా పాటు మించి లక్సటైస్(Laxities) వాడకూడదు. వీటిని వాడడం లో వైద్యుడి సలహా(Doctor Advice) తీసుకోవాలి. శారీరక సమస్య ఎక్కువగా వుండే లో చూడాలి. నిత్యం వ్యాయామం చేయటం వలన విరేచనాలు సక్రమంగా జరుగుతాయి. ప్రతి రోజు ఒకే సమయానికి మలవిసర్జనకు వెళ్లేలా చూసుకోవాలి.

మూడు వారాలకన్నా ఎక్కువ విరేచనాలు జరగకపోతే వెంటనే సంప్రదించి తగు చికిత్స(Treatment) పొందాలి. మల విసర్జన సమస్య అందరిలో ఒకేలా ఉండదు. ఒక్కరిలో ఒక్కోరకంగా ఉంటుంది. కొందరిలో రోజులో మూడు సార్లు వెళ్ళితే మరి కొందరిలో రెండు సార్లు వెళ్తారు.

మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు మల విసర్జన కాకపోతే సమస్యగా భావించాలి.

తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు మంచి  బాక్టీరియా(Bacteria)ను వ్యాప్తించేందుకు పెరుగు(Curd) వంటి ప్రోబైయటిక్ ఆహారం(Probiotic food)  తీసుకోవాలి.