బిగ్ బాస్ సీజన్ 5(big boss season 5) రియాలిటీ షో లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్(contestants) ఉండ గా ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్(eliminate) అయ్యారు. మరి మూడో వారం నామినేషన్స్ లో ఐదుగురు ఉండగా ఎవరు హౌస్ లో నుంచి అవుట్ కానున్నారో వీకెండ్ దాక వేచి చూడాల్సిందే. మూడో వారం కెప్టెన్(captain) గా జెస్సీ గెలిచాడు. ఈ వారంలో కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడిన స్కిట్ హైదరాబాద్ అమ్మాయి -అమెరికా అబ్బాయి పెద్దగా ఆకట్టుకోకపోయిన హౌస్ మేట్స్(house mates) బాగానే ఎంజాయ్ చేసారు. ఇటు రవి కూడా బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను విజయవంతం చేసాడు. ఇక సెప్టెంబర్ 24 వ ఎపిసోడ్ లో ఎవరు బెస్ట్, వరస్ట్ పెరఫార్మెర్ గా  ఎంపిక చేయడంలో కాస్త వాదనలు జరిగాయి. అయితే ఎపిసోడ్ మొత్తానికి నటరాజ్ మాస్టర్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇంకా హౌస్ లో ఎలాంటి విశేషాలు జరిగాయో చూసేద్దాం .

అర్దరాత్రి సిరి, షన్ను, జెస్సీ  ముచ్చట్లు పెట్టుకుంటారు. నువ్వు మాట్లాడకపోతే బాధనిపిస్తుంది అని సిరి షన్ను తో అంటుంది.  అయితే బాధపడు అని షన్ను సెట్టైరే వేస్తాడు లేదంటే అక్కడ కూర్చుని షన్ను నాతో మాట్లాడు అని రాసి బెలూన్ గాలిలో వదులు అని కామెడీ చేస్తాడు.

నువ్వు  టైం ఇవ్వడం లేదని, అందుకే, వేరే వాళ్లతో ఫ్రెండ్ షిప్ చేస్తున్నాను అని సిరి చెప్పింది. మంచిదే కదా? అని షన్ను అంటాడు. కానీ అది జెన్యూన్(genuine)  కాదు, అని అంటుంది.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్  టైంలో శ్వేతా వర్మ గొడవ చేసింది. తనను కిచెన్ వర్క్ చేయనివ్వడం లేదని, అందరికీ వంట రావాలని, అందరూ వంట చేయాలని చెప్పుకొచ్చింది.

ఆ తరువాత హమీద, మానస్ లు మాట్లాడుకుంటూ. ఈ మధ్య లహరి అర్థం కావడం లేదు. ఎక్కువగా పొసెసివ్ అయినట్టు కనిపిస్తోంది అని హమీదకు గోరు ముద్దలు తినిపిస్తూ మానస్ చెప్పుకొచ్చాడు.

ఆ రోజు చపాతి తినిపించాను కదా అని  హమీదకు మానస్ గుర్తు చేశాడు. లహరికి చెప్పాను, డైనింగ్ టేబుల్ వద్దకు వస్తే.. నీకు, హమీదకు తినిపిస్తాను అని చెబితే.. రానంది.

ఇంకో చపాతి ఇక్కడే తినిపించాలని మొండికేసింది  అంటూ లహరి ప్రవర్తన  గురించి మానస్ హమీదకు చెప్తాడు.

ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్‌(task)  అతికిందంటే అదృష్టమే అనే టాస్క్‌ లో విశ్వ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. బాల్‌లను విసరాలి.. అవి అతుక్కుంటే దాని మీద ఉన్న ఫుడ్ ఐటంలు పొందచ్చని చెప్తాడు బిగ్ బాస్. తరువాత సన్నీ, యాంకర్ రవి, శ్రీరామ చంద్ర విసిరినా బంతులు అతుక్కున్నాయి.

వరెస్ట్ పెరఫార్మెర్(worst performer) గా  తనని  తాను మానస్ చెప్తాడు. అలాగే హౌస్ లో చాలా మంది మానస్ పేరు చెప్పడంతో మానస్ జైలుకి వెళ్తాడు. జైలు లో వున్నా మానస్ తో ప్రియాంక హమీదకి ఎవరు తినిపిస్తారు అంటూ సెట్టైరే వేస్తుంది.

నేను కొంచం జెలస్ ఫీల్ అవుతుంటా నువ్వు పెద్ద గా పట్టుంచుకోకు ఆలా అని పట్టించుకోకుండా ఉండకు అని మానస్ తో తన మీద వున్న ఇష్టాన్ని చెప్పకనే చెప్తుంది ప్రియాంక.

శ్రీ రామ్ కి కూడా రాఖి కడతానేమో కానీ నీకు మాత్రం కట్టాను అని మానస్ తో చెప్తుంది ప్రియాంక.

మరో వైపు  సిరి, రవి, కాజల్ ఎలిమినేషన్(elimination) గురించి సిరి, రవి, కాజల్ డిస్కషన్ పెడతారు. ప్రియాంక, ప్రియలో ఎవరో ఒకరు వెళ్లిపోతారు అని అనిపిస్తోందంటూ సిరి చెప్తుంది .

ఇక  నటరాజ్ మాస్టర్ వ్యక్తిత్వం గురించి కూడా మాట్లాడుకుంటారు . ఎవరు ఏదీ మాట్లాడుకున్నా.. తన గురించే మాట్లాడుకుంటున్నారు అని ఫీల్ అవుతుంటాడు అని  రవి, సిరిలు మాట్లాడుకుంటారు.

బిగ్ బాస్(Big boss)  నటరాజ్ మాస్టర్ కి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. సడన్ గా ఇంట్లో పాప ఏడుపు వినిపిస్తుంది.

హౌస్ లో అందరు ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుకుంతుంటారు. అంతలోనే నటరాజ్ మాస్టర్ భార్య టీవీ లో ప్రత్యక్షముతుంది.

నటరాజ్ మాస్టర్ వైఫ్ గర్భవతి అని మనందరికి తెలిసందే. ఈ మధ్యే ఆయన భార్య సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. బుల్లితెర సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై ఘనంగా జరిపించారు.

మాస్టర్ భార్య నీతూ సీమంతం వేడుకలను హౌస్ మేట్స్ కి చూపించాడు బిగ్ బాస్. దీంతో నటరాజ్ మాస్టర్ తెగ ఎమోషనల్ అయ్యి పుట్టబోయే బిడ్డను తలుచుకుంటూ చిన్న పిల్లాడిలా ఏడిచాడు.

ఇక శ్రీ రామ్ హమీదాలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. సన్నీ, మానస్, నీతో నేను మాట్లాడే విధానం లో నీకు తేడా కనిపించడం లేదా? అంతా ఒకటే అని నీకు అనిపిస్తుందా? అంటూ శ్రీరామ్ మీద వున్నా ప్రేమను చూపేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోంది.

నాకు తెలియదు అంతలా గమనించను అని శ్రీరామ్ అన్నాడు. కొన్ని సార్లు నువ్వు అర్థం అవుతావు, కొన్ని కొన్ని సార్లు అర్థం కావు, నీతో ఏదో పడితే అది మాట్లాడలేకపోతున్న అంటూ శ్రీరామచంద్ర గురించి హమీద చెప్పుకొచ్చింది.

అప్పుడు శ్రీరామ  నీకు, మానస్‌కు ఓ డెఫినేషన్ ఉంది.. ఫ్రెండ్ షిప్ అని.

సన్నీని కూడా ఫ్రెండ్ అనుకుంటావు. కానీ నీకు నాకు ఆ క్లారిటీ లేదు.. మన రిలేషన్ ఏంటో ఇంకా తెలియడం లేదు.. అది బ్రదర్- సిస్టర్,  లేదా ఫ్రెండ్ షిప్ లేదా  అంతకంటే ఎక్కువా? అనేది తెలియడం లేదు. క్వశ్వన్ మార్క్ గా  ఉంది అంటూ శ్రీరామచంద్ర చెప్పుకొచ్చాడు.

మరి ఈ క్యూస్షన్ మార్క్ గురించి తేలాలంటే నాగ్ సార్ రావాల్సిందే. ఎలాగో వీకెండ్ వచ్చేసిందిగా చూదాం ఎంటర్టైన్మెంట్(entertainment) తో పాటు ఈ వీక్  హౌస్ మేట్స్(house mate)s పెర్ఫార్మన్స్ గురించి ఏం చెప్పనున్నారో నాగ్. క్యాచ్ యూ టుమారో.