వెల్కమ్

స్మాల్ స్క్రీన్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 (Big Boss season 5) మొదలైంది. పంచ అక్షరాల సాక్షి, పంచేద్రియాల సాక్షిగా, పంచ భూతాల సాక్షి నా పంచ ప్రాణాలు మీరే అంటూ ప్రేక్షకులను పలకరించిన నాగార్జున. . నాగ్ షో ని ప్రారంభించి కంటెస్టెంట్స్ కి వెల్కమ్ చెప్పారు.

కంటెస్టెంట్స్ (contestants)బిగ్ బాస్ లోకి ఎంట్రీ 

అలాగే బిగ్ బాస్ హౌస్ (Big Boss House) లోకి వెళ్ళి హౌస్ అంతా చూపించాడు. గత సీజన్స్ కంటే ఈ సారి బిగ్ బాస్ హౌస్ చాలా అద్భుతంగా వుంది. ప్రతి చోటు చాలా కలర్ ఫుల్  (color full) గా మనసును హత్తుకునేలా వుంది. ఆ తరువాత ఒకొక్కరి గా కంటెస్టెంట్స్ (contestants)బిగ్ బాస్ లోకి వెళ్లారు.

సెమి టాస్క్

మొదట సిరి, సన్నీ, లహరి శేరి, లోబో, యాని మాస్టర్ మొత్తం ఐదుగురు హౌస్ లోకి వెళ్లారు. ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ కు సెమి టాస్క్ (semi task) ఇచ్చారు నాగ్. అలా మొదటి టాస్క్ తో షో మొదలైంది.

లహరి కి ఒక దండ ఇచ్చి ఎవరో ఒకరి మేడలో వేయాలని చెప్పారు నాగ్. లహరి సిరి వెంట పడింది కానీ ఎవరి మేడలో వేయలేదు, దాంతో లహరి గేమ్ నుంచి అవుట్ అయింది.

తరువాత సన్నీకి దండ ఇచ్చారు. సన్నీ శ్రీరామ్ ని ముట్టుకోగా అతను ఓడిపోయాడు. తరువాత దండ సిరి చేతికి, యని మాస్టర్ చేతికి వచ్చింది కానీ ఈ ఇద్దరు కూడా దండ ను ఎవరి మేడలో వేయలేక పోయారు. దాంతో సన్నీ మొదటి టాస్క్ గెలిచాడు.

మొదటి టాస్క్ తరువాత మరి కొంత మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

పకడో పకడో

పది మంది కంటెస్టెంట్స్ తో మరో టాస్క్ ఆడించిన నాగార్జున. పకడో పకడో (Pakado Pakado) అనే టాస్క్ లో నాలుగు జంతువులను నాలుగు రూంలో దాచి పెట్టి జంతువు సౌండ్స్ వచ్చినపుడు ఆ జంతువును వెతికి పట్టుకోవడమే టాస్క్, ఈ టాస్క్ మొదటి రౌండ్ లోనే జెస్సి, షన్ను అవుట్ అయ్యారు.

ఇక రెండో రౌండ్ లో ప్రియాంక టాస్క్ గెలిచింది. టాస్క్ విన్ అయినా ప్రియాంక ను బిగ్ బాస్ కోరిక మేరకు సన్నీ మాలా వేసి అభినందించాడు.

తరువాత మరో ఐదు మంది కంటెస్టెంట్స్ కూడా హౌస్ కి వెళ్లారు. అలా మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

కుల్ఫీ గేమ్

సెకండ్ టాస్క్ తరువాత వచ్చిన 5 గురు కంటెస్టెంట్స్ తో మూడో టాస్క్ కుల్ఫీ గేమ్ సార్ట్ చేసారు. ఈ టాస్క్ లో 5 కుల్ఫీలు తింటారో వాళ్ళే విన్నర్ అని చెప్పారు నాగ్. ఈ టాస్క్ లో అందరు గట్టి పోటీనే ఇచ్చిన విశ్వ ఈ టాస్క్ విన్ అయ్యాడు.

రోల్ బేబీ రోల్

మూడు టాస్క్ లు ముగిసిన తరువాత వచ్చిన చివరి నలుగురి కి మరో టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ సింగల్ బెడ్ కోసం ఆడిన టాస్క్. టాస్క్ కి రోల్ బేబీ రోల్ అనే పేరు పెట్టిన బిగ్ బాస్. నలుగురితో డైస్ వేయించి ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వారే విన్ అని చెప్పాడు.

మొదటగా డైస్ వేసిన మానస్. ఆతర్వాత కాజాల్, శ్వేతా వర్మ, చివరిగా రవి డైస్ వేశారు. ఈ టాస్క్ లో మానస్ విన్ అయ్యాడు.

హౌస్ లో 19మందిని ఉంచి తాళం వేసిన నాగ్. చివరిగా కంటెస్టెంట్స్ అందరికి ఆల్ ది బెస్ట్ (All The Best) చెప్పి, మరో టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్. నాలుగు టాస్కులలో గెలిచిన నలుగురికి పోటీ పెట్టిన బిగ్ బాస్.

నాలుగు బాక్సులలో తాళం ఉంచి అన్నీ ఓపెన్ చేయమన్నాడు. ఈ టాస్క్ లో విశ్వ విన్ అయ్యి సింగిల్ బెడ్ గెలుచుకున్నాడు.

మొదటి రోజే చాలా డిఫరెంట్ టాస్క్ లు ప్లాన్ (different tasks plan) చేసిన బిగ్ బాస్, ఇక పై ఎలాంటి టాస్క్ లతో ఆకట్టుకోనున్నారో చూడాల్సి వుంది.

మరి మనం కూడా కంటెస్టెంట్స్ అందరికి ఆల్ ది బెస్ట్  (All the Best) చెపుదాం.