అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) తన తాత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) జయంతి సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించాడు. వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం(Direction)లో NC 22 మూవీకి శ్రీకారం చుట్టాడు.

నాగ చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్‌(First look poster) ను మూవీ మేకర్స్(Movie Makers) విడుదల చేశారు. సెప్టెంబర్ 21 నుంచి రెగ్యులర్ షూటింగ్(Regular Shooting) మొదలు కానుంది. తెలుగు(Telugu), తమిళ(Tamil) భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.

ఇటీవలె ఈ  ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు(Pooja Works) పూర్తయ్యాయి. ఈ మూవీలో కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌‌గా నాగ చైతన్య సరసన నటిస్తోంది. మ్యూజిక్ మాస్ట్రో ద్వయం, ఇసైజ్ఞాని(Isaignani) ఇళయరాజా(Ilaiyaraaja) మరియు లిటిల్ మాస్ట్రో(Little Maestro) యువన్ శంకర్ రాజా(Yuvan Shankar Raja) ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చబోతున్నారు.

ఇది వారి మొదటి చిత్రం మరియు ఈ కాంబినేషన్‌లో రాబోతున్న  చార్ట్‌ బస్టర్ ఆల్బమ్. తండ్రీ కొడుకులు కలిసి ఓ సినిమాకు సంగీతం(Music) అందించనుండడంతో అందరిలోనూ మ్యూజిక్ పై అంచనాలు మరింత పెరిగింది . సెప్టెంబర్ 21 న (బుధవారం) హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇక పోస్టర్ విషయానికి వస్తే.. నాగ చైతన్య లుక్ సరికొత్తగా కనిపిస్తోంది. నాగచైతన్య పై లేజర్ టార్గెట్స్‌(Laser Tragets) లో నిలబడి ఉన్నాడు. రెడ్ అండ్ బ్లాక్‌లో పవర్ ఫుల్‌గా పోస్టర్ ఉంది. “అక్కినేని నాగేశ్వరరావు దివ్య ఆశీస్సులతో.. నాగచైతన్య, వెంకట్ ప్రభు సహకారంతో మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్‌(Update)ను ప్రకటిస్తున్నాము.

రేపటి నుంచి NC22 షూటింగ్ మొదలు పెడతాం అంటూ మూవీ మేకర్స్(Movie Makers) ప్రకటించారు. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌(Srinivasa Silver Screen) పై శ్రీనివాస చిట్టూరి(Srinivas Chitturi) నిర్మిస్తున్నారు. అబ్బూరి రవి(Abburi Ravi) డైలాగ్స్(Dialogues) రాశారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.