చికెన్(Chicken) అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? చెప్పండి. అందరికి ఇష్టమే. చికెన్ తో బోలెడు డిషెస్(Dishes) వున్నాయి. స్టార్టర్స్, చికెన్ బిర్యానీస్, చికెన్ పులుసు, చికెన్ కబాబ్, చికెన్ పకోడీ, సూప్స్, సలాడ్స్ ఇలా చికెన్ రెసిపీస్(Recipes) చెప్తుంటే వస్తూనే ఉంటాయి. ఎప్పుడు క్రిస్పీ(Crispy) గా, స్పైసి(Spicy) గా కాకుండా కాస్త హెల్దీ రెసిపీస్ కూడా టేస్ట్(Taste) చేస్తే బాగుంటుంది. సలాడ్స్ తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సలాడ్స్(Salads) లో కూడా వెజ్ సలాడ్స్, నాన్-వెజ్  సలాడ్స్ రెసిపీస్ వున్నాయి. మనం కూడా కాస్త కొత్తగా, డిఫరెంట్ గా, చాలా ఈజీగా చికెన్ తో సలాడ్ రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం!

 కావాల్సిన పదార్థాలు

మెరినేడ్/డ్రెస్సింగ్ చేయడానికి

ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు

నిమ్మరసం – 1

నీరు – 2 టేబుల్ స్పూన్లు

రెడ్ వైన్ వెనిగర్(Red Wine Venegar) – 2 టేబుల్ స్పూన్లు

తరిగిన పార్స్లీ – 2 టేబుల్ స్పూన్లు

ఎండిన తులసి – 2 టీస్పూన్లు

తరిగిన  వెల్లుల్లి – 2 టీస్పూన్లు

ఎండిన ఒరేగానో – 1 టీస్పూన్

ఉప్పు – 1 టీస్పూన్

మిరియాలు – రుచికి

స్కిన్ లెస్. బోనెల్స్ చికెన్ – 500 గ్రా

సలాడ్ తయారీకి కావాల్సిన పదార్దాలు:

ఎండబెట్టిన పాలకూర ఆకులు – 4 కప్పులు

పెద్ద దోసకాయ ముక్కలు – 1

టమోటాలు ముక్కలు – 2

ఎర్ర ఉల్లిపాయ ముక్కలు – 1

అవోకాడో(Avocado) ముక్కలు – 1

ఆలివ్(Olive) – 1/3 కప్పు

సర్వ్ చేయడానికి నిమ్మకాయ ముక్కలు

తయారు చేయు విధానం:

  • ఒక పెద్ద బౌల్ లో మెరినేడ్/డ్రెస్సింగ్(dressing) పదార్థాలన్నింటినీ కలపండి. మెరీనాడ్‌(Marinade)లో సగం, డిష్‌లో పోయాలి. తర్వాత డ్రెస్సింగ్‌గా ఉపయోగించడానికి మిగిలిన మెరినేడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచండి.
  • గిన్నెలో marinade కు చికెన్ జోడించండి; 15-30 నిమిషాలు చికెన్‌ను మెరినేడ్ చేయండి. లేదా రిఫ్రిజిరేటర్‌లో రెండు గంటల వరకు ఉంచండి, ఇప్పుడు  సలాడ్ పదార్థాలన్నింటినీ సిద్ధం చేసి, సలాడ్  పెద్ద గిన్నెలో కలపండి.
  • చికెన్ సిద్ధమైన తర్వాత, గ్రిల్ పాన్ లేదా గ్రిల్ ప్లేట్‌లో 1 టేబుల్ స్పూన్ నూనెను మీడియం-అధిక వేడి మీద వేడి చేయండి. చికెన్‌ని రెండు వైపులా బ్రౌన్‌గా మరియు పూర్తిగా ఉడికినంత వరకు గ్రిల్ చేయండి.
  • చికెన్ 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. ఆ తరువాత చికెన్ ని ముక్కలు చేసి సలాడ్ మీద ఉంచండి . మిగిలిన అన్‌టచ్డ్ డ్రెస్సింగ్‌తో సలాడ్‌ను పైన స్ప్రింకిల్ చేయండి. అంత గ్రిల్ల్డ్ చికెన్(grilled Chicken) సలాడ్ రెడీ. వీటిని నిమ్మకాయ(Lemon) ముక్కలతో సర్వ్ చేయండి.

ఈ సలాడ్ లో మనకు కావల్సిన న్యూట్రిషన్లు(Nutrition’s) అధికంగా ఉన్నాయి. ఇందులో,

కేలరీలు: ౩36క్సాల్, కార్బోహైడ్రేట్లు: 13గ్రా, ప్రోటీన్: 24గ్రా, కొవ్వు: 21గ్రా, సంతృప్త కొవ్వు: 3గ్రా, కొలెస్ట్రాల్: 107mg, సోడియం: 271mg, పొటాషియం: 385mg, ఫైబర్: 6గ్రా, చక్కెర: 4గ్రా, విటమిన్ A: 4745IU, విటమిన్ సి: 18.4mg, కాల్షియం: 84mg, ఐరన్: 2.8mg