పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power star Pavan Kalyan), బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి(Rana Daggubati), ముఖ్య పాత్ర(Main role)ల్లో నటించిన చిత్రం భీమ్లా నాయక్(Bheelma Nayak). మోషన్ డ్రామా(Motion Drama)గా తెరకెక్కిన ఈ మూవీని కే చంద్ర(K.Chandra) రూపొందించగా, ఈ సినిమాను  సూర్యదేవర నాగవంశీ(Surya Devara Nagavamsi) నిర్మించాడు.

ఈ చిత్రం ఫిబ్రవరి25(February 25th)వ తేదీన విడుదలయ్యి, ప్రేక్షకుల(Audience) నుంచి  మంచి స్పందన(Good Response)తో పాటు కలెక్షన్ల(Collections)నూ బాగానే రాబట్టింది.

భీమ్లా నాయక్ ఇటీవలే ఆహా వీడియో(AAHA Video), డిస్నీ+ హాట్‌స్టార్‌(Disney+HotStar)లో స్ట్రీమింగ్(Streaming) అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘భీమ్లా నాయక్’ మూవీ ఓటీటీ(OTT)లో సరికొత్త చరిత్రను సృష్టించింది. తద్వారా ఇండియాలోనే నెంబర్ వన్ మూవీగా నిలిచింది.

భీమ్లా నాయక్ కు ఆహాలో భారీ స్పందన వస్తోంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికం(Official)గా వెల్లడించింది. అంతేకాదు, ఇది తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్(100 Million Streaming Minutes) ను కూడా పూర్తి చేసుకుంది. తద్వారా ఆహాలో ఈ ఘనతను అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్(Record Create) చేసింది. దీంతో చిత్ర యూనిట్‌(Movie Unit)తో పాటు ఆహా టీమ్(AAHA Team) ఫుల్ జోష్ లో వున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ఈ చిత్రానికి దర్శకత్వ(Direction) పర్యవేక్షణతో పాటు మాటలను కూడా రాశారు. ఈ మూవీలో నిత్య మీనన్(Nitya Menon), సంయుక్త మీనన్(Samyukta Menon) హీరోయిన్లు(Heroines)గా నటించారు. ఈ మూవీకి థమన్(Thaman) సంగీతాన్ని(Music) అందించాడు.

మల్టీ స్టారర్‌(Multi Starer)గా రూపొందిన ‘భీమ్లా నాయక్’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ.88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్(pre-Release Business) అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ.9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు(Overseas Rights) రూ.9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఆంధ్రా(Andhra), తెలంగాణ(Telangana)లో ఫుల్ రన్‌(Full Run)లో ‘భీమ్లా నాయక్’ రూ.76.84 కోట్లు వసూలు చేసింది. మిగిలిన ప్రాంతాల్లో నిరాశనే ఎదుర్కొంది.

ఫలితంగా కర్నాటక తో పాటు రెస్టాఫ్  ఇండియా  రూ.8.24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.12.55 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ముగింపు సమయానికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా(World Wide) రూ.97.63 కోట్లు షేర్‌తో పాటు రూ.159.10 కోట్ల గ్రాస్ వచ్చింది.