ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో ఎక్స్ సిరీస్(vivo X series) లో భాగంగా మన దేశంలో కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ సరి కొత్త స్మార్ట్ ఫోన్ మూడు వివో ఎక్స్ సిరీస్ లను సెప్టెంబర్ 9న చైనా లో రిలీజ్ చేసారు. ఈ స్మార్ట్ (smart phone) సిరీస్ లు వివో ఎక్స్ 70, వివో ఎక్స్ 70 ప్రో,వివో ఎక్స్ 70 ప్లస్, లను సెప్టెంబర్ ౩౦ న భారత్ మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. అయితే ప్రస్తుతం భారత్ మార్కెట్ లో రెండు స్మార్ట్ ఫోన్  మోడళ్లను మాత్రమే రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. వివో ఎక్స్‌70 ప్రో ప్లస్ 8జీబీ, 12జీబీ ర్యామ్‌ వేరియంట్స్‌(Variants) తో రానున్నాయి. ఈ మోడళ్లు 128జీబీ, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ (internal storage)ను పొందుపరిచారు .ఈ మూడు స్మార్ట్‌ ఫోన్‌లు జీస్ టి సర్టిఫైడ్ కోటింగ్‌తో రానున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు రియల్ టైమ్ ఎక్స్‌ట్రీమ్ నైట్ విజన్, ప్యూర్ నైట్ వ్యూ, సూపర్ నైట్ వీడియో, ప్రో సినిమాటిక్ మోడ్ మరిన్ని  కెమెరా ఫీచర్‌లను కలిగి వున్నాయి.

ఈ ఫోన్ లను  లాంచ్ చేయడానికి ముందు, వీటి  ధరను ప్రకటించబడింది. నిజానికి, టిప్‌స్టర్ యోగేష్ బ్రార్(TipstarYogeshBrar) ట్వీట్ చేయడం ద్వారా రెండు స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరను తెలిపాడు. టిప్‌స్టర్ ప్రకారం, వివో ఎక్స్‌70 ప్రో (VIVO X 70 PRO) స్మార్ట్‌ఫోన్ రెండు ఎంపికలలో వస్తుంది. వివో ఎక్స్‌70 ప్రో ప్లస్ (VIVO X70 PRO plus) కేవలం 12 GB ర్యామ్‌ వేరియంట్‌తో వస్తుంది. ఒక వేరియంట్‌కు 8 GB ర్యామ్‌(RAM) , 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది, దీని ధర రూ.46990 కాగా, రెండవ వేరియంట్‌కు 12 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తాయి, దీని ధర రూ .54990. అదే సమయంలో, VIVO X 70 PRO ప్లస్ ఒకే వేరియంట్‌లో ప్రవేశపెట్టబడింది, దీని ధర రూ. 69,999. ఈ ధరను టిప్‌స్టర్ నుండి వచ్చింది. అయితే, ఈ ధరలను కంపెనీ ఇంకా నిర్ధారించలేదు.

వివోఎక్స్70ప్రో , వివో ఎక్స్ 70 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్‌లు

వివో ఎక్స్ ప్రో(vivo x 70 pro) 6.56-అంగుళాల అమోలెడ్ ఫుల్‌హెచ్‌డి ప్లస్డిస్‌ప్లే అమరిచి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్షన్ 1200 చిప్‌సెట్‌ పొందివుంటుంది. అలాగే, ఇది 4450mAh బ్యాటరీని 44W ఫాస్ట్ ఛార్జర్‌తో కలిగి ఉంది. వివో ఎక్స్ 70 ప్రో  ప్యానెల్‌లో క్వాడ్ కెమెరా (quad camera)సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా,సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్స్ తో పాటు, పెరిస్కోప్ జూమ్ లెన్స్. అలాగే  2 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ , నాల్గవ కెమెరాకు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇవ్వబడింది.

ఇక వివో ఎక్స్ 70 ప్రో(vivo x pro plus) ప్లస్ స్మార్ట్‌ ఫోన్ 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు,120hz రిఫ్రెష్ రేటు కలిగి వుంది. అలాగే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్‌తో అమర్చబడి వుంది. ఇది 4500 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది వెనుక ప్యానెల్‌లో క్వాడ్ కెమెరా సెటప్‌ తో వస్తుంది , దీనిలో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్‌లు. ఇది 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ , 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ జూమ్ లెన్స్,  48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంది, ఇది మైక్రో గింబల్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది.

వివో ఎక్స్70 ప్రో, వివో ఎక్స్‌70 ప్రో ప్లస్ స్మార్ట్‌ ఫోన్‌లలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా(selfie camera) ఉంది. అలాగే, ఈ రెండు స్మార్ట్ ఫోన్ ల లోను  ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ కలిగి వుంది. ఇది  ఫన్ టచ్ ఓఎస్ (funtouchOS) 12 ఆధారిత ఆండ్రాయిడ్ 11 ఓఎస్ (Android 11 OS) పై పని చేస్తుంది.