బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season5) లో కెప్టెన్సీ కంటెండర్‌(Captaincy Contender) టాస్క్‌ ‘నియంత మాటే శాసనం’ గేమ్‌లో రవి, షణ్ముఖ్‌, ప్రియాంక మిగిలారు.

బజర్‌ మోగగానే మొదటగా సింహాసనం దక్కించుకున్నాడు షణ్ను. దీంతో మిగిలిన ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్‌ (Eliminate) చేసే ఛాన్స్(Chance) రావడంతో, ప్రియాంక ట్రాన్స్‌ కమ్యూనిటీకి తను ఆదర్శంగా ఉండాలనుకుంటున్నానని, ఒక్కసారైనా కెప్టెన్‌ అవ్వాలని ఉందంటూ తనను గేమ్‌(Game)లో నుంచి తొలగించవద్దని కోరింది.

అయితే షన్ను తాను రవికి ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేకపోయానని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అతడిని సేవ్‌(Save) చేస్తున్నానని తన అభిప్రాయాన్ని తెలిపాడు షణ్ను.

తన కమ్యూనిటీ(Community) కోసం అయినా పింకీని సేవ్‌ చేయొచ్చుగా అని కాజల్‌ పింకీకి సపోర్ట్‌(Support) చేయడంతో షణ్ను కాజల్ మీద మండిపడ్డాడు. కమ్యూనిటీ గురించి మాట్లాడడం తప్పంటూ కాజల్ తో వాగ్వాదానికి దిగాడు . నేనేమైనా ఎదవలా కనిపిస్తున్నానా? ఆ పదం ఎందుకు వాడుతున్నారు? అని ఫైర్ అయ్యాడు.

ఈ గొడవతో ఇర్రిటేట్(Irritate) అయిన ప్రియాంక తన చెంపలు వాయించుకుని వాష్‌రూమ్‌ హాల్‌లోకి వెళ్లి ఏడ్చేసింది. పింకీ బర్త్‌ డే కాబట్టి ఆమెను సేవ్‌(Save) చేయాల్సిందని సన్నీ అభిప్రాయపడ్డాడు. ఈ గొడవతో షణ్ను సిరిని పట్టుకుని ఏడ్చేశాడు. ఎప్పటిలానే షన్ను ని ఓదార్చడం సిరి వంతైంది. ఈ ఓదార్పు యాత్ర వీళ్ళ మధ్య సర్వ సాధారణమే కదా!

చివర గా షణ్ముఖ్‌, రవి కెప్టెన్సీ(Captaincy) కంటెండర్లు అవ్వగా శ్రీరామ్‌ తప్ప మిగతా అందరూ షణ్నుకు ఓటేయడంతో అతడు ఈ సీజన్‌(Season) లో ఆఖరి కెప్టెన్‌ (Last Captain)గా గెలిచాడు.

సిరి అందంగా కనిపించాలంటూ షణ్ను ఆమెకు ముక్కుపుడకిచ్చాడు. తనకు అది పెట్టుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ షణ్ను కోసం దాన్ని ధరించించిది సిరి.

ఆ తరువాత హౌస్ మేట్స్(House mates) కి బీబీ ఎక్స్‌ప్రెస్‌ అనే లగ్జరీ బడ్జెట్‌(Luxury Budget) టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్(Task) లో భాగంగా చుక్‌ చుక్‌ సౌండ్‌ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లంతా(Contestants) రైలు బోగీలా మారడంతో పాటు రైలులా కదలాల్సి ఉంటుంది.

ఈ ఆట  ఎంతో ఫన్నీ గా సాగింది. ప్రేక్షకులతో పాటు హౌస్ మేట్స్ కూడా బీబీ ఎక్స్‌ప్రెస్‌ (BB Express) టాస్క్ ని బాగా ఎంజాయ్ చేసారు .

ఇక అన్ని సీజన్స్ లోలాగానే హౌస్ మేట్స్(House mates)  తో ఫాస్ట్ ఫార్వర్డ్, పాజ్, రిలీజ్ గేమ్ ఆడించిన బిగ్ బాస్. చాలా సరదాగా సాగుతున్న ఈ గేమ్(Game) మధ్య లో కంటెస్టెంట్స్(Contestants) ని పాజ్‌(Phause) చేసినప్పుడు కాజల్‌ భర్త,

కూతురు హౌస్‌లోకి వచ్చారు. తల్లిని చూడగానే కాజల్‌ కూతురు వెక్కి వెక్కి ఏడ్చింది. కాజల్‌ను రిలీజ్‌(Release) అని చెప్పగానే ఆమె తన ఫ్యామిలీని పట్టుకుని ఎమోషనల్‌ (Emotional) అయింది.

భర్తకు హాగ్ లు, ముద్దులు ఇచ్చి తన ప్రేమను వ్యక్త పరుచుకుంది. నువ్వు ఇక్కడివరకు వస్తావనుకోలేదని కూతురు అనడంతో కాజల్‌ నవ్వేసింది. కనీసం టాప్‌ 5(Top 5)కి చేరుకున్న సంతోషమే అని చెప్పింది.

మమ్మీనెవరైనా నామినేట్‌(Nominate) చేస్తే కోపమొస్తదా? అని శ్రీరామ్‌ అడగ్గా కాజల్‌ కూతురు అవునని తలూపింది.

రవి, శ్రీరామ్‌ను రెండుసార్లు, యానీ మాస్టర్‌నైతే లెక్కలేనన్నిసార్లు తిట్టుకున్నానంది. యానీ మాస్టర్‌ ఎలిమినేట్‌(Eliminate) అయినందుకు సంతోషంగా ఉన్నానంటూనే జస్ట్‌ జోక్‌(Joke) చేశానని కవర్‌ చేసింది.

ఈ సీన్‌తో షణ్నుకు తన ఫ్యూచర్‌ గురించి టెన్షన్‌(Tension) పట్టుకుంది. తనకోసం ఎవరు వస్తారో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు.

అయ్యా, నమస్కారం, ఎవరిని పంపిస్తున్నారో చెప్తే నేను ముందుగానే ప్రిపేర్‌ అవుతానంటూ కెమెరాకు విన్నవించాడు.

ఇక తదుపరి ఎపిసోడ్(Episode) లోశ్రీరామ చంద్ర సిస్టర్, అలాగే మానస్ వాళ్ళ అమ్మ బిగ్ బాస్(Big Boss) హౌస్ లో వచ్చినట్టు ప్రోమో(Promo)లో చూపెట్టారు……