తమ జీవితాలను సైతం లెక్కచేయకుండా ,మన దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడాలనే లక్ష్యంతో భారత కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ (Ministry Of Home Affiars) ఆధ్వర్యంలో ‘భారత్ కె వీర్ ‘ అనే ట్రస్ట్ ని గత ఏడాది ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఏడుగురు దర్మకర్తలతో, కేంద్ర హోం సెక్రటరీ పర్యవేక్షణలో కొనసాగుతుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌, బాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌తోపాటు మరికొంత మంది ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నారు.

ఈ ట్రస్ట్ కి సంబంధించి ఆన్లైన్లో ఒక వెబ్సైటు ఉంది అది www.bharatkeveer.gov.in  ఈ వెబ్సైటులో దేశం కోసం చనిపోయిన సైనికుల వివరాలు ఉంటాయి. అంతేకాదు అమరవీరుల కుటుంబాలకు దేశపౌరులంతా తమ వంతు సాయాన్ని అందించే విధంగా ఈ వెబ్సైటును ఏర్పాటుచేశారు. ఒకవేళా మీరు ఎవరైనా ఈ అమరవీరుల కుటుంబానికి సహాయం చేయాలనుకుంటే మీ యొక్క స్థోమతను బట్టి పది రూపాయల నుంచి పదిహేను లక్షల వరకు సహాయం చేయవచ్చు. ఏ జవాను యొక్క కుటుంబానికి పదిహేను లక్షల ఆర్ధిక సహాయం అందుతుందో వారి ఫోటోను వెబ్సైటు నుంచి తొలగిస్తారు.

ఇలా ఈ భారత్ కె వీర్ సైట్ ( www.bharatkeveer.gov.in )ద్వారా అమరులైన జవాన్ల యొక్క కుటుంబాలకు మన వంతు సహాయం చేయవచ్చు. అంతేకాకుండా మన మొబైల్ లో ‘Bharat ke veer ‘అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా డబ్బుని సహాయం చేయొచ్చు మరియు paytm ద్వారా కూడా చేయవచ్చు. సహాయం చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికెట్ వస్తుంది.