ప్రస్తుత రోజుల్లో డిజిటల్ ట్రాన్సక్షన్స్ అనేవి ప్రతీ ఒక్కరూ చేస్తున్నాం .కరోనా వల్ల ప్రతీ ఒక్కరూ మొబైల్ ట్రాన్సక్షన్స్ ఇది వరకు రోజుల కంటే కొంచెం ఎక్కువ గానే వాడుతున్నాం అని చెప్పొచ్చు. దీనిలో భాగం గానే ప్రతీ ఒక్కరి మొబైల్ లో పే టీ ఎమ్ (Paytm) అనేది అందరూ బాగా వాడుతున్నారు .

ఇపుడు పే టీ ఎమ్ యూజర్లు (users) కి సరి కొత్త ఫీచర్ (new feature) తీసుకొచ్చింది . అదేంటో తెలుసుకుందామా మరి .

పే టీ ఎమ్ ,చిన్న మొత్తాల కి ఋణం అనే కొత్త ఫీచర్స్ . ఇదేంటీ అనుకుంటున్నారా ?? అవును , పేటిఎం కొత్తగా తీసుకొచ్చిన పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ తో చిన్న మొత్తాన్ని రుణం గా అందిస్తుంది. ఈ రుణాన్ని ఇన్స్టాంట్ గా పొందవచ్చు.

ఇప్పటికే పేటిఎం నుండి కొనసాగుతున్న ‘Buy Now Pay Later’ సర్వీస్ కు ఇది మరొక మెట్టుగా చెప్పవచ్చు.

ఈ పోస్ట్ పెయిడ్ మిని సర్వీస్ కోసం పేటిఎం ,ప్రముఖ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తో జతకట్టింది. ఈ సర్వీస్ మధ్య తరగతి వారికి ఎమర్జెన్సి అవసరాల కోసం బాగా ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం కరోనా మహమ్మారి కష్టకాలంలో మన చేతిలో డబ్బు లేనప్పుడు తక్షణ అవసరాలకు ఉయాయోగపడే ఉద్యేశ్యంతో ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు పేటిఎం పేర్కొంది.

common bills

ఈ పేటిఎం మిని సర్వీస్ తో 250 రూపాయల నుండి 1000 రూపాయల వరకూ చిన్న మొత్తాన్ని సులువుగా రుణంగా పొందవచ్చు. ఇంటి బిల్లు ల కి కరెంట్ బిల్ లేదా DTH గ్యాస్ సిలిండర్ బుకింగ్, మొబైల్ ఫోన్ రీఛార్జ్, వంటి చిన్న ఖర్చులకి ఈ రుణం అనేది చాలా ఉపయోగపడుతుంది.

దీనికి సంబంధించి చిన్న మొత్తానికి సర్వీస్ ఛార్జ్ (service charge) కానీ వడ్డీని (interest)కానీ వసూలు చెయ్యదు. తీసుకున్న రుణాన్ని 30 రోజుల్లో తిరిగి చెల్లించినట్లయితే ఎటువంటి వడ్డీ (interest) ఉండదు.

అలాగే ఎటువంటి యాక్టివేషన్ ఫీజ్ లేదా యాన్యువల్ ఫీజ్ కూడా ఉండదు ట . కానీ, నామమాత్రపు కన్వీనియన్స్ ఫీజ్ (convenience fee) మాత్రం వర్తిస్తుంది. అందుకని ఋణం తీసుకునే ముందు మీరు కూడా ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ (terms and conditions) ఒకసారి చదివి ఈ ఫీచర్ ని చిన్న ఋణాలకి వాడుకోండి మరి .

చిన్న మొత్తాలకు మధ్య తరగతి వారికి ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది కదా !!పే టీ ఎమ్ తెచ్చిన ఈ సరి కొత్త ఫీచర్ ఎలా ఉందో యూజ్ చేసి ,ఈ ఇన్ఫర్మేషన్ ని అందిరికీ షేర్ (share) చేయండి మరి .