హీరో ప్రభాస్(Prabhas) నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ చిత్రం  ఓం రౌత్(OM ROUTH) డైరెక్షన్లో(Direction) రూపొందుతోంది  కృతి సనన్(Krithi Sanon), సైఫ్‌అలీ ఖాన్(Saif Ali khan) ముఖ్య పాత్రలు(Key Roles)  పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్(Shooting) గతంలోనే పూర్తి అయింది. ప్రస్తుతం పొస్ట్ ప్రోడక్షన్ వర్క్(Post Production Work) జరుగుతుంది.

ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12(January 12th)న ప్రపంచవ్యప్తం(World Wide)గా థియేటర్లో సందడి చేయనుంది.  ప్రభాస్ సినిమా అంటే బిజినెస్ వర్గాల్లో ఓ కలకలం. కనీసం  భాక్సాఫీస్ ఓపినింగ్స్(Box Office Openings) ఉంటాయి. సినిమా టాక్ కు సంభందం లేకుండా మూడు నాలుగు రోజులు వీకెండ్ కుమ్మేస్తుంది.

అంతకు మించి ఏం కావాలనేది మూవీ యూనిట్ ఆలోచన. అందుకే ప్రభాస్ సినిమాల ప్రీ రిలీజ్(Pre Release) ఓ రేంజిలో జరుగుతూంటుంది. ఇప్పుడు ‘ఆదిపురుష్’ది అదే తరహా పరిస్థితి.

బాహుబలి (Baahubali) ప్రాంచైజీ(Franchise)తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన ఇచ్చిన ఉత్సాహంతో ఆయన నటిస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియాగా రూపొందుతున్నాయి. బాహుబలి తర్వాత వచ్చిన సాహో (Sahoo)యావరేజ్(Average) అనిపించుకుంది.

కానీ ఆ తర్వాత వచ్చిన  ‘రాధే శ్యాం(Radhe shayam)’మాత్రం బాక్స్ ఆఫీస్(Box Office) వద్ద బోల్తాపడింది. దాదాపు ఈ రెండు చిత్రాలు థియేటర్స్‌ లోకి వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని(Success) సాధించలేదు.

ఈ క్రమంలో తాజాగా ‘ఆదిపురుష్’ కు సంబంధించిన ఓ వార్త తెలుగు మీడియాలో విపరీతంగా హల్‌‌చల్ చేస్తుంది. అదేమిటంటే…ఆదిపురుష్ సినిమా తెలుగు రైట్స్(Telugu Rights) ని యువి క్రియేషన్స్ వారు సొంతం చేసుకున్నారు.

యువి క్రియేషన్స్(UVI Creations) అంటే ప్రభాస్ స్వంత సంస్ద. తన రెమ్యునరేషన్ భాగంగా దాదాపు వంద కోట్లు విలువ చేసే రైట్స్ ని ప్రభాస్ సొంతం చేసుకున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క భారతీయ సినిమా చరిత్రలోనే ‘ఆదిపురుష్’ డిజిటల్ రైట్స్(Digital Rights) అత్యధిక ధర(High Price)కు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

ఆదిపురుష్ పాన్ ఇండియా(Pan India)గా తెరకెక్కుతుంది. ఈ మూవీకీ సంబంధించిన అన్ని భాషల డిజిటల్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుందని రూమర్స్(Rumors) వినిపిస్తున్నాయి.

ఓటీటీ ప్లాట్‌ఫాం(OTT Platform) రూ.250కోట్లకు ఈ హక్కుల(Rights)ను కొనుగోలు చేసిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలు కనుక నిజమైతే సినిమాకు పెట్టిన సగం బడ్జెట్(Budget) ఓటీటీ రైట్స్ రూపంలోనే వచ్చినట్టవుతుంది.

ఈ సినిమాలో జానకీగా కృతి సనన్, రావణాసురుడిగా సైప్‌అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్(Huge Visual Effects) ఉన్నాయి. రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.