బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) హౌస్ మేట్స్(House mates) ఎవరి గేమ్ ప్లాన్ లతో ఆటాడుతున్నారు.గ్రూపులుగా విడిపోయి మరి వాళ్ళ ప్లానలతో సమయం వచ్చినపుడు గేమ్ స్టార్టజి బయట పడుతున్నాయి. శుక్రవారం ఎపిసోడ్ ఏవిక్షన్ ఫ్రీ పాస్(Eviction free pass)  గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓ టాస్క్(Task) ఇచ్చాడు.

మరి ఇందులో ఎవరు ఏవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకోనున్నారో? దాని కోసం హౌస్ మేట్స్ మధ్య ఎం రచ్చలు జరిగిందో ఎపిసోడ్ హై లైట్స్ మీ కోసం.

బిగ్‌బాస్(Big Boss) హౌస్‌లో ప్రియాంక సింగ్‌, సిరి, యానీ, మాన‌స్ కెప్టెన్సీ కోసం పోటీ ప‌డ్డారు. రింగ్ ఈజ్ కింగ్‌ టాస్క్‌ లో ఎవ‌రు రింగ్‌ను చివ‌రి వ‌ర‌కు ప‌ట్టుకుంటారో వాళ్లే కెప్టెన్‌(Captain)గా నిలుస్తారు.

ఈ గేమ్‌లో మాన‌స్ గెలిచి విన్నర్(Winner) గా నిలిచాడు. కెప్టెన్ మాన‌స్‌ కాజ‌ల్‌కు సారీ చెప్పి ఆమెతో వున్నా గొడ‌వ‌ల‌ క్లియర్ చేసుకున్నాడు. ఎలిమినేష‌న్‌(Elimination) నుంచి సేవ్(Pass) అయ్యేందుకు బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్(Eviction Free Pass) ప్రవేశ‌పెట్టాడు.

‘నిప్పులే శ్వాస‌గా, గుండెలో ఆశ‌గా’ టాస్క్‌ లో మీ ఫొటో కాల‌కుండా చూసుకోవాలని, చివ‌రి వ‌ర‌కు ఎవరి ఫొటో కాల‌కుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌(Contestant)కు ఈ పాస్ ద‌క్కుతుంద‌ని ప్రక‌టించాడు.

అయితే త‌న‌కెందుకో ఈ వారం స‌న్నీ ఎలిమినేట్(Eliminate) అవుతాడ‌నిపిస్తోంద‌ని, ఒక‌వేళ‌ ఎవిక్షన్(Eviction) పాస్ గెలిచినా కూడా స‌న్నీ దాన్ని వాడుకోడ‌డని రవి అన్నాడు.

త‌ర్వాత టాస్క్‌(Task) లో భాగంగా ఫైర్ ఇంజ‌న్ అలార‌మ్(Alaram) మోగ‌గా ర‌వి, ష‌ణ్ముఖ్ మొద‌ట ట్రక్ ఎక్కారు. వీరికి మాన‌స్‌, శ్రీరామ్‌ ఫొటోలు వ‌చ్చాయి.

bigg-boss

ష‌ణ్ను సేవ్(Save) చేసే ఛాన్స్  మాన‌స్‌ కిద్దామంటే ర‌వి మాత్రం శ్రీరామ్‌కే ఇద్దామ‌ని ఒప్పించాడు. అలా మాన‌స్ ఫొటో మంట‌ల్లో కాలిపోయింది. ఆ తరువాత రౌండ్‌లో స‌న్నీ, మాన‌స్ ట్రక్ ఎక్కారు.

వీరి ఎదుట ర‌వి, యానీ మాస్టర్ ఫొటోలు రాగా ఏకాభిప్రాయంతో ర‌వి ఫొటోను కాల్చేశారు. ష‌ణ్ను, సిరిలు ట్రక్ ఎక్కగా వారు పింకీని కాకుండా స‌న్నీని సేవ్(Save) చేశారు. త‌ర్వాత యానీ, శ్రీరామ్‌ల వంతు రాగా జనాల ఓటింగే నాకు ముఖ్యం, ఈ పాస్ అవ‌స‌రం లేద‌న్నాడు ష‌ణ్ను. ఆడియ‌న్స్‌(Audience) స‌పోర్ట్‌ తోనే ఇక్కడిదాకా వ‌చ్చాను, వారి నిర్ణయంతోనే వెళ్లిపోవాల‌ని ఉంద‌ని చెప్పుకొచ్చింది సిరి.

వీళ్లిద్దరూ త‌మ‌కీ పాస్(pass) అవ‌స‌రం లేద‌ని చెప్పిన‌ప్పటికీ యానీ, శ్రీరామ్ ఆలోచించుకుని సిరిని సేవ్ చేశారు. దీంతో ఆమె ఆనందం తో ష‌ణ్నును హ‌త్తుకుని అత‌డికి ఐ ల‌వ్‌యూ చెప్పింది.

ప్రియాంక‌, కాజ‌ల్‌, శ్రీరామ్‌, సిరిల‌లో నుంచి సిరిని సేవ్(save) చేశారు. యానీ, ప్రియాంక‌లకు స‌న్నీ, కాజ‌ల్ ఫొటోలు వ‌చ్చాయి. యానీ ఆ రెండు ఫొటోలు కాల్చేద్దామ‌ని చెప్పింది. కానీ పింకీ అది త‌ప్పని వారించ‌డంతో ఇద్దరూ ఒక నిర్ణయానికి వ‌చ్చి కాజ‌ల్ ఫొటోను కాల్చేసి స‌న్నీని సేవ్ చేశారు.

త‌ర్వాత అలార‌మ్(Alaram) మోగిన‌ప్పుడు ట్రక్‌(Truck)లో కూర్చున్న మాన‌స్‌, కాజ‌ల్‌ల‌కు యానీ, సిరి ఫొటోలు వ‌చ్చాయి. ఇద్దరూ ఒకే మాట మీద రాలేకపోయారు. ఇద్దరూ కాలిపోతే స‌న్నీ ఆటలో ఉంటాడని కాజ‌ల్, మనసుతో చెప్పింది. త‌న ఫొటోను కాల్చేస్తార‌ని భ‌య‌ప‌డిపోయిన యానీకి కోపం క‌ట్టలు తెంచుకుంది. త‌న‌కు పాస్ ద‌క్కుండా చేస్తున్నార‌ని చిరుబురులాడింది.

అయితే  సోష‌ల్ మీడియా(Social Media)లో వేదిక గా వినిపిస్తున్నది ఏంటంటే, ఈ ఎవిక్షన్(Eviction) ఫ్రీ పాస్ స‌న్నీ దక్కించుకున్నట్టు సమాచారం