బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) హౌస్ లో వింత గా  ప్రవర్తిస్తున్న కంటెస్టెంట్స్(Contestants) రోజు రోజుకి మితిమీరి పోతున్న అట్టాచ్మెంట్స్. అసలు వాళ్ళ మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా? అనేలా ప్రవర్తిస్తున్నారు.

ఓ పక్క షన్ను-సిరి, మరోపక్క మానస్-పింకీలా రిలేషన్స్ చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటోంది. అసలు వీళ్ళ గోల ఏంటో తెలియాలంటే 75 వ ఎపిసోడ్ చూడాల్సిందే….

కెప్టెన్సీ(Captaincy) కంటెండ‌ర్స్ టాస్క్‌ లో ర‌వికి సూప‌ర్ ప‌వ‌ర్‌ తీసుకునే అవకాశం వచ్చింది. అయితే రవి ఈ అవ‌కాశాన్ని స‌న్నీకి ఇచ్చాడు. ఇందులో భాగంగా  25 బంగారు ముత్యాలు చెల్లించి ఈ ప‌వ‌ర్‌(Power)ను పొందాల‌ని స‌న్నీకి చెప్పాడు. అయితే స‌న్నీ మాత్రం త‌న‌కు ఏ ప‌వ‌ర్ వ‌ద్దని ఖరాఖండిగా చెప్పాడు . రంగంలోకి దిగిన‌ హౌస్ మేట్స్(House mates) అత‌డిని ఎలాగోలా ఒప్పించారు.

ఇంత‌కీ ప‌వ‌రేంటంటే మైన్‌లోకి వెళ్లే హౌస్‌మేట్స్‌ లో నుంచి ఒక‌రిని తొల‌గించి వారి స్థానంలో వెళ్లి ఆడాలి. ఎదుటివాళ్లను గ్రూప్ ఆట అని మంద‌లించే ర‌వి, శ్రీరామ్‌, యానీ ఒక్కటై గేమ్‌(Game) ఆడారు. శ్రీరామ్ త‌న ద‌గ్గరున్న ముత్యాల‌ను యానీకి ఇద్దామ‌ని నిర్ణయించుకున్నాడు. అయితే దాన్నో దొంగ‌తనంలా సీన్ క్రియేట్ చేశారు.

అప్ప‌టిదాకా దొంగ‌తనం చేస్తే త‌ప్ప‌న్న ర‌వి ఎందుకాల‌స్యం, వెంట‌నే వెళ్లి దొబ్బేయండి అని సలహా ఇవ్వడం విశేషం. దీంతో యానీ అంద‌రిముందూ ఏదో దొంగ‌త‌నం చేసిన‌ట్లుగా క‌వ‌రింగ్ ఇస్త‌ శ్రీరామ్ ముత్యాలు తీసేసుకుంది.

స‌న్నీ ఏదో ఇర్రిటేట్ అయ్యి  ఉన్నాడ‌ని అర్థమైన కాజ‌ల్ అత‌డి వెంటే న‌డిచింది. నా తోక‌లాగా వెన‌కే వ‌స్తున్నావేంటి? అని విసుక్కున్నాడు స‌న్నీ. దీంతో మిగ‌తా హౌస్‌మేట్స్(House mates) ఆమెకిలా జ‌ర‌గాల్సిందే అన్నకున్నారు.

అంద‌రి ముందు త‌న‌ను అవ‌మానించాడ‌ని కాజ‌ల్ హర్ట్ అయ్యి ఏడిచింది.  స‌న్నీ సారీ చెప్పి ఆమెను ఓదార్చాడు. త‌న‌కిచ్చిన‌ ప‌వ‌ర్‌ను కూడా ఆమెకు ఇవ్వడానికి ప్రయ‌త్నించాడు కానీ అది కుద‌ర‌ద‌ని తేల్చాడు సంచాల‌కుడైన‌ ర‌వి.

దీంతో అత‌డు త‌న ప‌వ‌ర్‌ను ఉపయోగించి శ్రీరామ్ స్థానంలో మైన్‌లోకి వెళ్లి అయిష్టంగానే  గేమ్ ఆడాడు. మొత్తంగా ఆట ముగిసేస‌రికి మాన‌స్‌, ప్రియాంక‌, సిరి, యానీ కెప్టెన్సీ(Captaincy) కంటెండ‌ర్లుగా నిలిచారు.

కాజ‌ల్ బాధ‌ప‌డితేనే నా క‌ళ్లలో నీళ్లు తిరుగుతాయి, అలాంటిది ఆమె డిస్‌క‌నెక్టెడ్ అని ముఖం మీదే చెప్తే ఎలా ఉంటుంద‌న్నాడు మాన‌స్‌. అందుకే కాజ‌ల్‌తో మాట్లాడ‌ట్లేద‌ని స‌న్నీతో చెప్పాడు.

అటు ప్రియాంక‌తోనూ మాట‌లు బంద్ చేశాడు. మ‌రోప‌క్క ష‌ణ్ముఖ్ ప‌దేప‌దే దీప్తిని  గుర్తు చేసుకున్నాడు. అటు సిరి కూడా శ్రీహాన్‌ను గుర్తు చేసుకుంది. త‌ర్వాత సిరి ఐ హేట్ యూ అంటూ లిప్‌స్టిక్‌తో పేప‌ర్ మీద రాసిచ్చింది. ఫీలైన ష‌ణ్ను సారీ చెప్పి హ‌గ్గిచ్చాడు. దీంతో సిరి కూడా అత‌డికి హ‌గ్గిస్తూనే ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది.

మ‌రోప‌క్క పింకీ త‌న‌ను ఫ్రెండ్‌గా కాక‌పోయినా క‌నీసం మ‌నిషిలా ట్రీట్ చేస్తే చాలంటూ మాన‌స్‌కు చెప్పింది. ఇదిలా ఉంటే ఈ వారం ప్రెస్టేజ్ 25 వేల గిఫ్ట్ వోచ‌ర్‌ యానీ సొంతం చేసుకుంది, దీంతో ఆమె ఆనందంతో స్టెప్పులేసింది.

త‌ర్వాత హౌస్ మేట్స్(House mates)  తో కొన్ని క్షణాలు ఇంటికి అంకితం అనే స‌ర‌దా టాస్క్ ఆడించాడు బిగ్‌బాస్‌(Big boss).

ఇందులో షన్ను – సిరి, మానస్-పింకీ,సన్నీ-కాజల్,యాని-శ్రీరామ్, జంట‌లుగా విడిపోయి ఓసారి బిగ్‌బాస్ హౌస్‌ను భూత‌ద్దంలో చూసొచ్చి గేమ్ ఆడారు.

ఫైన‌ల్‌గా మాత్రం ఎక్కువ పాయింట్లతో యానీ మాస్ట‌ర్‌- శ్రీరామ్ జోడీ చెరో రూ.5000ల గిఫ్ట్ వోచ‌ర్ గెలుపొందింది.

మొత్తం మీద బిగ్ బాస్(Big Boss) హౌస్(House) లో కంటెస్టెంట్స్(Contestants) టాస్క్ ల పరంగా గేమ్(Game) బాగానే ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నా , షన్ను-సిరి, మానస్-పింకీ లు మాత్రం వాళ్ల ప్రవర్తన తో ప్రేక్షకులను ఇక చాలు రా బాబు అని విసిగిపోతున్నారు..