గత నలభై సంవత్సరాలు గా తెలుగు సినీ ఇండస్ట్రీ లో తన నటన తో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన నటుడు మోహన్ బాబు . డైలాగ్ కింగ్ (Dialogue King) గా పేరుపొంది తన నటన చాతుర్యం తో ప్రతీ పాత్రకు న్యాయం చేకూర్చి అభిమానుల ఆదరణను పొందారు.

కొన్ని నెలల నుండి  విరామం తీసుకున్న ఆయన తిరిగి ఒక స్ట్రాంగ్ కథతో ప్రేక్షకుల ముందుకు మళ్లీ రాబోతున్నారు.

మోహన్ బాబు దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతున్న సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’ (Son of India) చేస్తున్నారు.  తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్ రిలీజ్ చేశారు.

Son of India

నిజానికి ఈ సినిమా  ఫస్ట్ లుక్ పోస్టర్ జనవరి 26న గణతంత్ర దినోత్సవ (Republic Day)కానుకగా విడుదల చేస్తారని ప్రేక్షకులు భావించారు.  కానీ ఇది ఒక మూడు రోజులు ఆలస్యమైనా ఈ పోస్టర్‌ రిలీజ్ చేసి ,మోహన్ బాబు లుక్ తో సినిమాపై అంచనాలు భారీ గా పెంచేశారు.

ఈ పోస్టర్ చూసిన మోహన్ బాబు అభిమానులంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా లో మోహన్ బాబు పాత్ర ఆయన మ్యానిరిజానికి తగ్గట్టుగా పవర్ ఫుల్‌గా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మూడు  రంగులతో కూడిన జెండాపై ఉన్న ఈ సినిమా టైటిల్ మన  దేశ ప్రజల ఆదరణ చూరగొంటోంది. దీనిలో మోహన్ బాబు సీరియస్ లుక్‌లో కనిపిస్తుండటం దేశభక్తికి సంబంధించి కీలక అంశం ఏదో  చూపించబోతున్నారనే ఫీలింగ్ తెప్పిస్తోంది ఈ పోస్టర్ .

అయితే ఈ  సినిమా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్నదని సమాచారం.

శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో హీరో మంచు విష్ణు నిర్మిస్తున్నారు.

మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయన కోడలు మంచు విరానికా వ్యవహరిస్తున్నారు . ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో మోహన్ బాబు విరూపాక్ష అనే పాత్రలో  కనిపించనున్నారు. అదేవిధంగా హీరో  శ్రీకాంత్ కూడా మమేంద్రభూపతి అనే పాత్ర చేస్తున్నారు.

వీరితో పాటుగా ఇతర నటులు అలీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, రఘు బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసింది  చిత్రయూనిట్..

ఈ చిత్రం మోహన్ బాబుకి  డిఫరెంట్ జానర్ అని,  అందరినీ ఆకట్టుకుంటూ మంచి మెసేజ్ ఇస్తుందని చెబుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

ఈ సినిమా కోసం మంచు  అభిమానులు తారాస్థాయి అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా Dr. మోహన్ బాబు గారి కెరీర్ లో మరి కొత్త సంచలనాన్ని సృష్టిస్తుందని ఆశిద్దాం.