తెలుగువారు  జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల(Festival)లో తెలుగు వారి తొలి పండుగగా భావించేది ఉగాది(Ugadi). ఉగాది రోజున కొత్త పనులను ప్రారంభించాలని ఈ సంవత్సరమంతా సంతోషంగా ఉండాలని సుఖశాంతులతో జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.

ఉగాది పర్వదినంనాడు కోయిలలు తమ రాగాలతో తెలుగు వారి నూతన సంవత్సరానికి ఘానా స్వాగతం పలుకుతాయి. మల్లెలు, మామిడి పిందెలు అంతకంటే ఉత్సహంగా ఆహ్వానిస్తాయి. మావిచిగురు, వేపపూత, మల్లెల గుబాళింపులు కోయిలలు కూహురాగం, పంచాంగ శ్రవణం వంటివి ప్రతిదీ ఉగాదికి సంకేతాలు ఇస్తాయి.

శోభకృత నామ సంవత్సర వైభోగమంతా తెలుగు వారి వాకిలిలో తీర్చిద్దిదినా రంగవల్లికల్లో దర్శనమిస్తుంది. మామిడాకుల తోరణాలతో ఒదిగి చూస్తుంది. పంచాంగ శ్రవణంలో ప్రతిధ్వనిస్తుంది. పిండి వంటల్లో ప్రతిఫలిస్తుంది.ఉగాది పచ్చడి ఊరిస్తూ జీవన పరమార్థం బోధిస్తోంది.

ఆంగ్లేయుల న్యూ ఇయర్ వేడుకలను ఎలా నిర్వహించుకుంటారో. తెలుగు వారు ఉగాది పండుగను అదే విధంగా జరుపుకుంటారు. అసలు ఉగాది అంటే ఏమిటి? అంటే ఉగాది అనే పదం యుగాది(Yugadi) నుంచి పుట్టుకొచ్చింది. ఉగాదిలో ఉగ అంటే నక్షత్రగమనం (Nakshatraagamanam), అది అంటే మొదలు, మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అన్నమాట. యుగము అంటే జంట అని అర్ధం.

ఉత్తరాయణ(Uthrayana), దక్షిణాయన(Dakshanayana) కలయికే సంవత్సరం. అలా యుగానికి ఆది యుగాది లేదా ఉగాది అయింది మనం ఇప్పుడున్నది కలియుగ కాలంలో అసలు కలియుగం అంటే ఏమిటో తెలుసా. శ్రీకృష్ణుడు జగత్తుని విడిచి వెళ్ళినపుడే, కలియుగం(Kaliyugam) ప్రారంభమైంది.

ఉగాది రోజున తెలుగువారు చేసే సందడి అంతాఇంతా కాదు ఆడపిల్లలు రంగురంగుల పరికిణీలు, చీరలు ధరించి కళ్ళకు పసుపు, తలలో మల్లెలు పెట్టుకుని  పదహారణాల ఆడపడుచుల ముస్తాబవుతారు.

ఉదయాన లేచి తల స్నానం చేసి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. వేపపూత, మామిడి ముక్కలు, బెల్లం, ఉప్పు, మిరియాలు, చింతపండులను ఉపయోగించి తయారు చేసే ఉగాది పచ్చడి(Ugadi Pachadi) లో ఉప్పు, కారం, తీపి, వగరు,పులుపు, చేదు వంటి షడ్రుచులు(Shadruchulu) మిళితమై ఉంటాయి. ఈ షడ్రుచులను కోపం, ద్వేషం, శాంతిషం, దుఃఖం లాంటి భావోద్వేగాలకు సంకేతాలుగా భావిస్తారు.

జీవితంలో ఎప్పుడు సుఖసంతోషాలే ఉండవని మాధుర్యం మాత్రమే తొణికిసలాడని, కష్టంసుఖం కలగలసి వుంటాయని చెబుతుంది ఉగాది. దేనికి పొంగిపోక, కుంగిపోక  ప్రతిదాన్ని సమదృష్టితో చూడాలని అనియికి అతీతంగా ఉండాలనే సందేశాన్ని ప్రబోధిస్తోంది ఉగాది.

ఉగాది పచ్చడిని ముందుగా దేనువునికి నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ప్రసాదంగా తీసుకుంటారు. గారెలు, పాయసం, పులిహోర లాంటి ఇతర పిండివంటలను దేవునికి నైవేద్యం(Naivedyam)గా సమర్పించినప్పటికీ ఉగాది పచ్చడిదే అగ్రస్థానం. ఉగాది నుంతన సంవత్సర వేడుకే కాదు శోభాయమైన పర్వదినం పల్లెల్లోనేకాక, పట్టణాలలో తెలుగుతనం ఉట్టిపడుతుంది.

ఉగాది అంటే కొత్త సంవత్సరం కనుక ఆ రోజు మొదలు ఏడాది అంత ఎలా ఉంటుంది అని తెలియజేసే పంచాంగా శ్రవణం(Panchanga Sravanam) ఉంటుంది. వాతావరణం(Weather) అనుకూలంగా వుంటుందా, లేదా, అతివృష్టి, అనావృష్టి లాంటివి ఉన్నాయా. తుఫానులు, భూకంపాలు లాంటి ప్రకృతి ప్రళయాలు ఏమైనా ఉన్నాయా, దేశం సుభిక్షంగా వుంటుందా లేదా తదితర అంశాలన్నీ పంచాంగంలో చోటు చేసుకుంటాయి.

ఆయా రాశులకు గ్రహఫలాలను  జ్యోతిష్య శాస్త్ర పండితులు క్షుణ్ణంగా వివరిస్తారు. ఉగాది పండితులకే కాదు, కవీశ్వరులకు ఇష్టమైన పండుగా సాంస్కృతిక సంస్థలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. మంచి కవితం చెప్పి అలరించినవారిని సత్కరించి, సన్మానిస్తారు, మనది చాంద్రమాన కేలండర్(Chandramana Calendar) కనుక ఉగాది ప్రతి సంవత్సరం ఒక్కే రోజున రాదు.

శక కేలండర్(Shaka Calendar) చైత్ర శుద్ధ పాడ్యమి(Chaitra Shuddha Padyami)తో మొదలవుతుంది.  ఇంగ్లీష్ నేలలను అనుసరించి  చూస్తే మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆంధ్రులకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కొంకణి వారు కూడా ఉగాది పర్వదినమే కొత్త సంవత్సరం.

తెలుగు వారికి నూతన శోభ కృత నామ సంవత్సర శుభాకాంక్షలు అందిస్తున్నాము