ప్రతిభా వంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశ్యం తో బడ్డీ 4 స్టడీ ఇండియా ఫౌండేషన్ ( Buddy4Study India Foundation) మెడిసిన్ ,ఇంజనీరింగ్ విద్యార్థులకి డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్షిప్ ని అందిస్తోంది. బడ్డీ 4 స్టడీ ఇండియా అనేది ఒక నాన్ ప్రాఫిట్ ప్రైవేట్ సంస్థ. పలు సంస్థలతో కలిసి పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తుంది.వార్షిక ఆదాయం 3,00,000 లోపు ఉండి,ప్రతిభావంతులైన  విద్యార్థులు  ఈ స్కాలర్షిప్ కి అర్హులు. అర్హులైన విద్యార్థులు రూ.20,000 స్కాలర్‌షిప్ పొందొచ్చు.మెడిసిన్,ఇంజనీరింగ్ విద్యార్థులకు డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్షిప్

అర్హత వివరాలు

12వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులతో పాస్ కావాలి.

12వ తరగతి లేదా ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు.

జాతీయ,రాష్ట్ర స్థాయిలో మెడికల్ మరియు  ఇంజనీరింగ్  ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.

ఇంజనీరింగ్, మెడిసిన్‌లో చేరాలనుకునే విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్ కి  అప్లై చేయాలి.

ఎంపిక విధానం

విద్యార్థుల అకడమిక్ రికార్డ్‌తో పాటు ఆర్థిక అవసరాలను పరిశీలిస్తారు. తదుపరి టెలిఫోన్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఫైనల్ సెక్షన్‌కు ముందు ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది.

అవసరమైన ధ్రువపత్రాలు

12వ తరగతి మార్క్స్ షీట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, దరఖాస్తుదారుల క్యాన్సల్డ్ చెక్ బుక్ లేదా పాస్‌బుక్ కాపీ ఉండాలి.

దరఖాస్తు విధానం (Application Process):

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మెడిసిన్,ఇంజనీరింగ్ విద్యార్థులకు డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్షిప్

దరఖాస్తులకు చివరి తేదీ (Lastdate): ఫిబ్రవరి 15, 2021

వెబ్‌సైట్‌: https://www.buddy4study.com/