నూతన సంవత్సరం2022,(New Year) ప్రారంభంలోనే  వినియోగదారుల(Customers)ను సరి కొత్తగా ఆకట్టుకునేందుకు రెడీ అయింది. స్మార్ట్ ఫోన్(Smart Phone) తయారీ కంపెనీలు, ముఖ్యంగా చైనా(China) ఫోన్ సంస్థలు కొత్త సంవత్సరం మొదటి నెలలోనే కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వివో (VIVO) వన్ ప్లస్(One Plus), షోవామి(Xiaomi), రియల్ మీ(Real me ), ఒప్పో(Oppo), ఇంఫినిక్(Infinix)  సంస్థలు సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ని ఇండియన్ మార్కెట్లోకి తీసుకు రానున్నాయి. ఇప్పటికే ఆయా మోడల్స్ ని ఆవిష్కరించిన సంస్థలు, వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేలా సిద్దమవుతున్నాయి.

ఈ సంస్థల నుండి వస్తున్న ఆ కొత్త మోడల్స్(new Models) ఏంటంటే ఇక్కడ తెలుసుకుందాం.

షోవామి 11i, షోవామి హైపర్ ఛార్జ్ : చైనా ఫోన్ దిగ్గజం షియోమీ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ని విడుదల చేస్తుంది. షోవామి 11i(Xiaomi 11i) ఫోన్ లో అధిక కెపాసిటీ(High Capacity) కలిగిన బ్యాటరీ ఉండగా, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్(Charging Feature) తో షోవామి 11i (Xiaomi 11i) హైపర్ ఛార్జ్ (Hyper Charge)  వేరియంట్(Variant) ప్రత్యేకత చాటుకుంది. ఇక ఈ రెండు ఫోన్లు 6.67 అంగుళాల FullHD+ డిస్ప్లే(Display)తో వస్తున్నాయి. ఈ రెండు ఫోన్ లలో బ్యాటరీ(Battery) మినహా మిగతా ఫీచర్స్(Features) అన్నీ ఒకేలా ఉంటాయి. జనవరి మొదటి/రెండో వారాల్లో ఈ ఫోన్స్ రానున్నాయి.

రియల్ మీ  GT 2 ప్రో  మాస్టర్  ఎడిషన్ :

శాంసంగ్, యాపిల్, షియోమీ మార్కెట్ ను తనవైపు తిప్పుకోవాలని భావిస్తున్న రియల్ మీ(Realme) సంస్థ..ఆ దిశగా అడుగులు వేస్తుంది. ప్రీమియం ఫోన్స్(Premiere phones) కి ధీటుగా స్మార్ట్ ఫోన్స్ ను తీసుకు వచ్చింది. ఇక 2022లో రియల్ మీ(Realme) నుంచి వస్తున్న స్మార్ట్ ఫోన్ GT 2 Pro Master Edition. స్నాప్‌డ్రాగన్(Snap Dragon) 778G 5G ప్రాసెసర్, 120Hz AMOLED స్క్రీన్, 65W సూపర్‌డార్ట్ ఛార్జ్(Super charge) వంటి పవర్ ప్యాకెడ్ ఫీచర్స్(Power Packed Features) తో ఈ ఫోన్ రానున్నది. ఇప్పటికే సంస్థ వెబ్ సైట్(Web Site) లో ఈ సరి కొత్త  ఫోన్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి.

వివో V23 సిరీస్ :

చైనాకు చెందిన మరో స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో (VIVO) 2022 నూతన సంవత్సరాన్ని ఒక కొత్త సిరీస్ తో ప్రారంభించనుంది. వి23 (V23) సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్స్ ని వివో విడుదల చేయనుంది. ఇప్పటికే చైనాలో అమ్మకాలు ప్రారంభమవగా, జనవరి నుంచి  భారత్లోనూ V23 సిరీస్ ఫోన్ అమ్మకాలు మొదలౌతాయి. భారత్  లోనే మొదటిసారి 3D కర్వ్ డిస్ప్లే, 7.36mm స్లిమ్ బాడీ వంటి ఫీచర్స్ ఈ ఫోన్స్ లో ఉన్నాయి. వి23 5జి (V23 5G), వి23 ప్రో 5జి (V23 Pro 5G)గా వస్తున్న ఈ రెండు స్మార్ట్ ఫోన్స్, ప్రీమియం యూజర్లను(premiere Users) టార్గెట్ గా చేసుకుని మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి.

ఇన్ఫినిక్స్  జీరో 5జి :

బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ నుంచి వస్తున్న ప్రీమియం ఫోన్ ఇన్ఫినిక్స్ జీరో 5జి (Infinix Zero 5G). ఇప్పటికే బడ్జెట్ సెగ్మెంట్లో(Budget Segments) ఈ సంస్థ నుంచి వచ్చిన ఫోన్స్ వినియోగదారు(Customers)లను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సంస్థ 5G ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ప్రీమియం ఫోన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా Zero 5G ఫీచర్స్ ఉండనున్నాయి. 6.67 అంగుళాల AMOLED FullHD+ తెర, 8GB రామ్, 128GB స్టోరేజ్, 108MP ట్రిపుల్ కెమెరా సిస్టం(Triple Camera System)తో ఈ ఇన్ఫినిక్స్ జీరో 5జి (infinix Zero 5G) రానుంది.

వన్ ప్లస్  10 ప్రో:

ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ (Premiere Android Phone)లలో వినియోగదారుల(Customers)ను ఆకట్టుకుంటున్న మరో టాప్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ (OnePlus). ఈ సంస్థ నుంచి 2022లో హై ఎండ్ స్మార్ట్(High End) ఫోన్ రానుంది. వన్ ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro) గా వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లో అన్ని కొత్త ఫీచర్స్(New Features) ఉండనున్నాయి. క్వాల్కమ్ సంస్థ అభివృద్ధి చేసిన స్నాప్ డ్రాగన్  8 Gen1 హై ఎండ్ ప్రాసెసర్ తో వస్తున్న మొట్టమొదటి ఫోన్ ఇది. 6.7అంగుళాల LPTO QHD+ AMOLED స్క్రీన్, 12GB LPDDR5 ర్యామ్(RAM) వంటి అధునాతన ఫీచర్స్(Advanced Features) ఇందులో ఉన్నాయి.

కొత్త ఏడాది మొదటి నెలలోనే భారత్ లో విడుదల కానున్న టాప్ స్మార్ట్ ఫోన్స్ ఇవేనండి. సో మార్కెట్లో  రిలీజ్ అయినవెంటనే మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ మీ సొంతం చేసుకోండి.