బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season5) శనివారం వీకెండ్ షో మొదలైంది. ఈ వారమంతా హౌస్ మేట్స్(House mates) మధ్య కొట్లాటలు మమ్ములాగా లేవు.

మరి ఈ గొడవల గురించి నాగ్ సార్ హౌస్ మేట్స్ కి ఏ రేంజ్ లో క్లాస్ పీకారో? మరి శనివారం 56వ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం.

రంగం మూవీ లోని ఎందుకో ఏమో అనే పాటతో  స్టేజి మీదకు వచ్చిన నాగ్. మనతో పాటు నాగ్ కూడా శుక్రవారం ఎపిసోడ్ చూద్దామంటూ మన టీవీ వైపు తిరిగారు.

జైలులో ఉన్న సన్నీ ఫ్రెండ్ షిప్ కోసం ఆడానంటే ఒప్పుకుంటా కానీ సంచాలకుడు జెస్సీని మాత్రం సమర్ధిస్తే ఒప్పుకోను.. నాగ్ సార్ వచ్చి చెప్పినా సరే నేను తప్పు అనే చెప్తాను. నేను ఫిజికల్(Physical) అవ్వలేదు.

జెస్సీ పట్టుకున్న బ్యాగ్ ని కావాలనే తన్నలేదని చెప్పాడు సన్నీ. ఈ సందర్భంలో మానస్‌ యాంకర్ రవికి చురకలేశాడు. ఈ పెద్ద మనిషి అన్ని విషయాలపై మాట్లాడతాడు కానీ.మా విషయానికి వచ్చేసరికి మాట్లాడడు అసలు సంచాలకుడి విషయంలో నువ్వు ఫైట్ చేశావా? అని నిలదీశాడు.

ఇక సన్నీ కూడా మానస్‌తో మీరు నా దగ్గరకు రాకండి ఫ్రెండ్ షిప్ ఉంటే బయట చూసుకుందాం వాళ్లతో మాటలు పడలేకపోతున్న అని అన్నాడు. మరో పక్క సిరి, షణ్ముఖ్, జెస్సీలు, ఎప్పటిలాగే ముచ్చట్లు మునిగిపోతారు.

ఎప్పటిలాగే హౌస్ మేట్స్(House mates) కు టాస్క్(Task) ఇచ్చారు  బిగ్ బాస్(Big Boss).  రెండు గ్రూప్‌లుగా హౌస్ మేట్స్ విడిపోయి పూరీలు చేయాలని చెప్పారు.

ఆనీ, లోబో, విశ్వ, శ్రీరామ్, రవి, లు  ఒక టీం కాగా, జెస్సీ, కాజల్, మానస్, ప్రియాంక, సిరి రెండో టీంలో ఉన్నారు.

ఈ టాస్క్‌కి సంచాలకుడిగా హౌస్ కెప్టెన్ షణ్ముఖ్ వ్యవహరించాడు. అయితే 50 పూరీలు చేయాల్సి ఉండగా కాజల్ టీం సభ్యులు తొందరగా పూర్తి చేశారు.

అయితే పర్ఫెక్ట్ మేకింగ్ అంటూ ఆనీ మాస్టర్ టీంని విన్నర్ గా ప్రకటించాడు హౌస్ కెప్టెన్(House Captain). అయితే జైలులో ఉన్న సన్నీ రూల్ బుక్‌లో ఫాస్ట్‌గా చేసిన వాళ్లే విన్నర్ అని చెప్పారు కదా సరిగ్గా చదువుకోవచ్చు కదా అని షణ్ముఖ్‌కి చెప్పాడు.

దీంతో చీరెత్తిన ఆనీ మాస్టర్‌కి నీకు నీ ఫ్రెండ్స్ కష్టమే కనిపిస్తుంది. వాళ్లు కష్టపడి చేస్తే మేం ఆడుకుంటూ చేశామా? అంటూ సన్నీ దగ్గరకు దూసుకుని వెళ్లింది. సన్నీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

ఈమెకు తెలుగు సరిగా అర్థం కాలేదు అనుకుంటా తెలుగు నేర్పీయండి అని సన్నీ అంటే నాకు తెలుగు వచ్చు తెలుగు ఇండస్ట్రీ(Industry)లోనే వర్క్ చేశా అని చెప్పింది.

నార్త్ ఇండియా(North India)లో చపాతీ ఫేమస్ మాస్టర్ అని సన్నీ అంటే నార్త్ ఇండియానా?? నేను పుట్టింది తెలంగాణలో నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఏంటి? ఇండియా?? అంటూ పైపైకి ఎగురుతూ అరవడం మొదలుపెట్టింది.

దీంతో సన్నీ మీరు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని పాయింట్‌ని లేవనెత్తి ఫేమస్ అవ్వాలని అనుకోకండీ అవ్వరు కూడా.. నార్త్ ఇండియాలో చపాతీ ఫాస్ట్‌ గా చేస్తారని అంటే తప్పేంటి? నేను మాట్లాడిన దాన్ని ఎక్కడికో లింక్ చేస్తారేంటి? నేను ఇండియా కాదా? నన్ను బ్లేమ్ చేయడానికి ఈ పాయింట్ మాట్లాడుతున్నారా? అంటూ సన్నీ ఫైర్ అయ్యాడు.

నువ్ మాట్లాడటం తప్పే.. నేను ఇండియా(India) అంటూ ఆనీ మాస్టర్ ఊగిపోయింది .

మొత్తంగా ఈ గొడవ పై హౌస్ మేట్స్(House mates) రెండు గ్రూప్‌లుగా విడిపోయి దూషించుకోవడం మొదలుపెట్టారు. అయితే అసలు గొడవకు కారణమైన షణ్ముఖ్ ఓ మూలన కూర్చుని నవ్వుతూ ఉన్నాడు. అది చూసిన సన్నీకి కాలింది. హౌస్‌లో గొడవ అవుతుంటే అది చూసి నవ్వుతున్నావు చూడు అది కరెక్ట్ కాదని షణ్ముఖ్‌ని టార్గెట్(Target) చేశాడు సన్నీ.

నాకు నవ్వు వచ్చింది నవ్వాను, నువ్వు ఎన్ని చెప్పినా నవ్వుతూనే ఉంటా అని అన్నాడు షణ్ముఖ్. అది కరెక్ట్ కాదంటూ నీకు గేమ్ అంటే మజాక్‌గా ఉంది అని సన్నీ అంటే అవును నాకు బాగా కిక్ వస్తుంది అని షణ్ముఖ్ మరింత రెచ్చగొట్టేశాడు.

నేను బయటకు వస్తే ఇంకా కిక్ ఉంటుందని సన్నీ అంటే వామ్మో భయం వేస్తుంది ఎలాగా సన్నీ ఇప్పుడే పోసుకుని వచ్చా నీ భయానికి మళ్లీ పోసుకుని వస్తా అని పంచ్ వేశాడు షణ్ముఖ్.

ఈ వారం హౌస్ లో కొత్తగా కెప్టెన్‌(Captain) అయిన షన్ను ని ముందుగా విష్ చేసిన నాగార్జున.

ఆ తరువాత లోబోని కాస్త మందలిస్తూ యాంకర్ రవితో బ్యాటింగ్ మొదలుపెట్టారు. హౌస్ లోకి వచ్చే ముందే అన్ని తెలిసే కదా వచ్చావ్ అందరు ఫామిలీస్ ని వదిలేసాగా వచ్చారు. పక్కన వున్నవాళ్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వుతారు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

ఇక హౌస్ మేట్స్(House mates) అందరికి క్లాస్‌లు పీకడం ముగిసిన తరువాత వైకుంఠపాళి గేమ్ ఆడించారు. ఈ ఆటలో ఎక్కువ మంది  కాజల్ ని  పాము అని నామినేట్(Nominate) చేశారు.

ఆ తరువాత ‘మెడ‌లో మోత‌- స‌రిపోయే సామెత’ ఆట ఆడించాడు. ఇందులో నాగ్‌ సామెతలు చెప్తే దానికి సంబంధించిన‌ ప్లేట్‌ను ఎవ‌రికి సరిపోతుందో వారి మెడ‌లో వేయాల‌న్నాడు.

స‌న్నీ కుక్క తోక వంక‌ర సామెత‌ను జెస్సీకి అంకిత‌మిచ్చాడు. మాన‌స్‌ అబ‌ద్ధం ఆడినా అతికిన‌ట్లు ఉండాల‌ని ర‌విని సూచించాడు. కాజ‌ల్‌ ఏమీ లేని ఆకు ఎగిరెగిరి ప‌డుతుంది అన్న సామెత శ్రీరామ్‌కు సెట్టవుతుంద‌ని చెప్పింది.

యానీ రాను రాను రాజు గారి  గుర్రం గాడిదైంది అన్నదాన్ని కాజ‌ల్‌కు ఇచ్చింది.

ప్రియాంక‌ కంద‌కు లేని దుర‌ద క‌త్తిపీట‌కు ఎందుకు అన్న సామెత‌ను సిరికి ఇచ్చాడు. త‌ర్వాత శ్రీరామ్‌ అంతంత కోడికి అద్దసేరు మ‌సాలా సామెత కాజ‌ల్‌కు ఇచ్చాడు.

విశ్వ‌ దున్నపోతు మీద వ‌ర్షం కురిసిన‌ట్లు సామెత లోబోకు ఎంపిక చేసాడు.

జెస్సీ పైన ప‌టారం, లోన లొటారం అన్న ప్లేటును స‌న్నీకిచ్చాడు.

సిరి అంద‌ని ద్రాక్ష ప‌ళ్లు పుల్లన అనే సామెత ష‌ణ్ను మెడ‌లో వేసింది.

ష‌ణ్ను ఏకులా వ‌చ్చి మేకులా త‌గులుకున్నాడ‌ని ర‌వి ఇచ్చాడు.

ర‌వి ఓడ ఎక్కేవ‌ర‌కు ఓడ మ‌ల్లన్న‌, ఓడ దిగిన త‌ర్వాత బోడ మ‌ల్లన్న అనేది మాన‌స్‌కు స‌రిపోతుంద‌న్నాడు.

లోబో చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుని ఏం లాభం అన్న సామెత‌ను యానీకి ఇచ్చాడు.

ఇక శనివారం వీకెండ్ షో లో ఎవ‌రినీ సేవ్ చేయ‌లేదు.

ఇక సండే  దీపావ‌ళి స్పెష‌ల్(Deepavali Special) ఎపిసోడ్‌లో సుమ‌,శ్రియ‌, బిగ్‌బాస్(Big Boss) కంటెస్టెంట్లు(Contestants) స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు(Celebrities’) స్పెష‌ల్ గెస్ట్స్గా(Special Guests) రాబోతున్నారు.

ఆ హంగామా(Hungama) చూడాలంటే రేపు సాయంత్రం ఆరు గంటల వరకు వెయిట్ చేయాల్సిందే…..