alzhimers1

Alzheimers అంటే మెదడుకు సోకే ఒక భయంకరమైన వ్యాధి. ఇది సోకితే వ్యక్తికి జ్ఞ్యాపక శక్తి పోతుంది. అంతే కాదు ఇది సోకితే తనని తాను మర్చిపోతాడు. అన్నిటి కంటే విస్మయం కలిగిoచే విషయం ఏంటంటే ఈ వ్యాధికి మందు లేదు. అసలు దేని వల్ల వస్తుందో కూడా పూర్తిగా తెలియ రాలేదు. అంతే కాదు ఈ వ్యాధి సోకిన ఎన్నో సంవత్సరాల తరువాత కానీ లక్షణాలు బయటపడవు, ఈ లోపు మెదడులో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మెదడులో సమాచారాన్ని చేరవేసే కణాలలో ఉండే Amyloid beta protein ఆకృతిలో మడతలు పడి, సమాచారాన్ని చేర వేసే కణాల మధ్య ఆటంకo కలగడం ఈ వ్యాధి లక్షణం. ఇదీ ఈ వ్యాధి తీవ్రత. ఇక ఇది 60 – 70 లు పైబడిన ముసలివారికి సోకే అవకాశం ఉంది. ఇక ఈ వ్యాధి మన దేశంలో కంటే అధిక శాతం పశ్చిమ దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది.

alzdisease

alz-2

అందువల్ల ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన తరువాత చేసే వైద్యం, కేవలం ఆ లక్షణాలను కొద్దో గొప్పో ఉపశమనం కలిగించేవే కానీ పూర్తిగా నయం చేయలేవు. అందువల్ల ఇప్పుడు వైద్యులు దీనిని ముందుగా గుర్తించే వీలుగా పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగా జర్మనీ లో Klaus Gerwert, Ruhr-University Bochum మరియు German Centre for Neurogenerative Diseases (DZNE), కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఒక ఇన్ఫ్రారెడ్ సెన్సర్ ను తయారు చేసారు. ఈ సెన్సర్ సహాయంతో ఒక రక్త పరీక్ష ద్వారా Alzhimers ను కనీసం 15 సంవత్సరాల ముందు కనిపెట్టవచ్చు అని అంటున్నారు. అదెలాగో చూద్దాం.

blood-test_1
ఈ పరీక్షలో immuno-chemical analysis ద్వారా రోగ నిర్ధారణ చేయబడుతుంది. ఇదెలా చేస్తారంటే వ్యక్తి నుంచీ సేకరించిన రక్తం కానీ cerebrospinal fluid (మనిషి వెన్ను చివరి భాగం నుంచీ సేకరించే ద్రవం) ను కానీ ఈ సెన్సర్ మీద వేయగానే, ఆ సెన్సర్ మీద ఉండే antibodies ఈ వ్యాధికి సంబంధించిన biomarkers ను గుర్తించి, అప్పటికే వాటి ఆకృతిలో మార్పులు వచ్చాయేమో విశ్లేషిస్తుంది. ఈ మార్పులు కనీసం 15 సంవత్సరాల ముందు నుంచే చోటు చేసుకునే అవకాశం ఉన్నoదున ముందుగానే ఈ వ్యాధి సోకుతుందని నిర్ధారణకు రావచ్చు.

ఈ పరీక్షను 141 alzhimers పేషెంట్ల మీద ప్రయోగించగా రక్త పరీక్ష ద్వారా 84 శాతం మేర, అలాగే cerebrospinal fluid ద్వారా 90 శాతం విజయవంతం అయ్యారు. దీనిని మరింత వృద్ధి చేసి 99 శాతం విజయం సాధించగలిగితే ఈ వ్యాధి నుంచీ మనుషులకు రక్షణ లభిస్తుంది.

Courtesy