మధుమేహం(Diabetes) నియంత్రించు(Controls)కునే క్రమంలో తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా పాటించడం వల్ల రక్తం(Blood)లో చక్కెర పరిమాణం కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.

ప్రస్తుతం చాలా మందిలో మధుమేహం కారణంగా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి వివిధ రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే సమస్యలకు చెక్‌ పెట్టడానికి పలు పోషకాలున్న డ్రై ఫ్రూట్స్‌(Dry Fruits) తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల శరీరం దృఢం(Body Strong)గా ఉండడమే కాకుండా అన్ని అనారోగ్య సమస్యలు(Health Issues) దూరమవుతాయి. అయితే డ్రై ఫ్రూట్స్‌లో వేటిని తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందో తెలుసుకుందాం. మధుమేహంతో బాధపడుతున్నవారికి అంజీర(Anjeer) పండు చాలా మేలు చేస్తుంది.

ఈ పండులో శరీరానికి  కావాల్సిన ఫైబర్(Fiber), కాల్షియం(Calcium), ఐరన్(Iron), పొటాషియం(Potassium) ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిల(Sugar levels)ను సులభంగా నియంత్రిస్తుంది. అంజీర పండులో యాంటీ-డయాబెటిక్(Anti Daibetic) లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు(Benefits) కలగడమేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలు దూరమవుతాయి.

మధుమేహంతో బాధపడుతున్నవారు ఈ పండ్లను 4 నుంచి 5 గంటలు పాల(Milk)లో నానబెట్టి(Soak).. రాత్రి నిద్రపోయే ముందు తినాలి. అయినప్పటికీ మీరు దానిని పరిమిత పరిమాణంలో తినవాల్సి ఉంటుంది. అంజీర్ ఆకుల్లో కూడా చాలా రకాల మూలకాలు ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు అంజీర్ ఆకుల(Anjeer Leaves)ను టీ(Tea)లో మరిగించి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.

అంజీర్ పండ్లతో పాటు.. డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు యాపిల్స్(Apples), ఆప్రికాట్లు(Apricots), బ్లూబెర్రీస్(Blue berries), కాంటాలప్(Contalope), చెర్రీస్(Cherries), కివీస్(Kiwis), నారింజ(Orange), బొప్పాయి(Papaya), స్ట్రాబెర్రీలు(Straw Berries) మొదలైన పండ్లను కూడా తినవచ్చని ఆరోగ్య నిపుణులు(Health Experts) తెలుపుతున్నారు.

ఈ పండు రెగ్యులర్(Regular) గా తీసుకోవడం వల్ల మలబద్ధకం(Constipation) నుంచి ఉపశమనం(Relaxation) కలిగిస్తుంది. గుండె(Heart)కు చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఎముకల(Bones)ను దృఢం(Strong)గా చేసేందుకు సహాయపడుతుంది.