యంగ్(Young) అండ్ డైనమిక్(Dynamic) హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) `రాజావారు రాణిగారు`, `ఎస్‌. ఆర్‌ కళ్యాణమండపం` చిత్రాలతో ఆడియన్స్(Audience) లో మంచి గుర్తింపు(Good recognition) తెచ్చుకున్నారు.  వరుస సినిమాలతో అలరిస్తూ, ఇప్పటికే ఈ ఏడాది  మూడు చిత్రాలు విడుదలై పాజిటివ్ టాక్(Positive Talk) ను ఈ యంగ్ హీరో దక్కించుకున్నారు.

ఇందులో `సెబాస్టియన్‌`, `సమ్మతమే` చిత్రాలు ఏడాది మొదట్లో రిలీజ్ కాగా గతనెల 16 (సెప్టెంబర్ 16)న `నేను మీకు బాగా కావాల్సినవాడిని` చిత్రంతో ఆకట్టుకున్నాడు. తాజాగా మరో చిత్రంతో థియేటర్ల(Theaters)లో సందడి చేసేందుకు రెడీగా ఉన్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్(Super Hit) సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్(GA2 Pictures) లో రాబోతున్న మరో చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’(Vinaro Bhagyamu Vishnu Katha).

కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్ర(Main Role)లో నటిస్తున్నారు. మురళీ కిషోర్‌ అబ్బురూ(Murali Kishore Abburi) దర్శకత్వం(Direction) వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశ(Shooting Stage)లో ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎగ్జైటింగ్(Makers Exciting) అప్డైట్స్(Updates) ను అందిస్తూ వస్తున్నారు.

ఇప్పటికే చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు(Posters), గ్లింప్స్(Glimpse) కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే ఆదరణ  వస్తోంది. తాజాగా సినిమా విడుదల తేదీని ఖరారు(Confirm) చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17(FEBRUARY 17th)న రిలీజ్ కు సిద్ధం చేస్తున్నట్టు మేకర్స్ అధికారికం(Official)గా అనౌన్స్(Announce) చేసారు.

విలేజ్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీని  జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత బన్నీవాసు(bunny vasu) నిర్మిస్తుండగా మెగా నిర్మాత(Producer) అల్లు అరవింద్‌(Allu Arvind) సమర్పిస్తున్నారు. చిత్రానికి చేత‌న్ భ‌ర‌ద్వాజ్(Chetan bhardwaj) మ్యూజిక్(Music) అందిస్తున్నారు.

 

 

.