అనుష్క(Anushka) శెట్టి మూడేళ్ల గ్యాప్‌ తర్వాత ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్(UV Creations) లో రూపొందుతోన్న ఈ చిత్రంలో `జాతిరత్నాలు` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నారు.

అనుష్కకి జోడీగా నవీన్‌ పొలిశెట్టి(Naveen Polishetty) చేస్తుండటం విశేషం. దీంతో సినిమా ప్రకటించినప్పట్నుంచే దీనిపై ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి.

మహేష్‌బాబు(Mahesh Babu) అనే నూతన దర్శకుడు(New Director) దీన్నిరూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌(Movie Title), ఫస్ట్ లుక్‌(First Look)ని విడుదల(Release) చేసింది టీమ్‌. దీనికి `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు.

బుధవారం సాయంత్రం ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో అనుష్క ఓ పుస్తకం పట్టుకుని తన డ్రీమ్‌లోకి వెళ్లిపోయి ఏదో ఆలోచిస్తుంది. మరోవైపు గోడపై కూర్చొని నవీన్‌ పొలిశెట్టి తన డ్రీమ్‌లోకి వెళ్లిపోయారు. ఊహల్లో తేలియాడుతున్నాడు. అయితే అనుష్క లండన్‌లో ఉండగా, నవీన్‌ హైదరాబాద్‌లో ఉండటం పోస్టర్ ద్వారా తెలుస్తోంది. మరి వీరిద్దరికి ఎలా కనెక్షన్‌ కుదిరింది అనేది స్టోరీ. మరి వీరిద్దరి కథేంటి అనేది ఆసక్తికరంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

అనుష్క, నవీన్ పేర్లు కలిసి వచ్చేలా చూడగానే ఆకట్టుకునేలా ఈ చిత్రానికి “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే టైటిల్ ను కంఫర్మ్ చేసారు మూవీ మేకర్స్. ఈ టైటిల్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా క్యాచీగా ఉండటంతో పాటు సినిమా కథకు కూడా ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోయిందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో నవీన్, సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్(Standup Comedian) గా, అనుష్క, అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌(Chef) పాత్రలో నటించారు.  ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించగా, పి. మహేష్‌ బాబు దర్శకత్వం లో రూపొందించారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఇది వరకే అనుష్క ప్రధాన పాత్రలో నటించిన `భాగమతి ` బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ని సాధించింది. ఇప్పుడు రాబోతోన్న ఈ “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రాన్ని కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల(Audience)కు నచ్చేలా రూపొంచించాడు దర్శకుడు పి. మహేష్‌ బాబు.

నిశ్శబ్దం చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న అనుష్క తన ఇమేజ్ కు తగ్గట్టుగా అద్బుతమైన స్క్రిప్ట్(Script) కావడంతో కాస్త గ్యాప్ తర్వాత ఈ పాత్రకు ఓకే చెప్పింది. `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`, `జాతిరత్నాలు` సినిమాలతో యువ తరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల చేత మంచి నటుడుగా ప్రశంసలు అందుకున్న నవీన్ పోలిశెట్టి కూడా కాస్త గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా ఇది.

ఇక టైటిల్ తోనే భారీ అంచనాలు(Huge Expectations) పెంచిన ఈ చిత్రం ఈ వేసవికి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో రిలీజ్ చేయనున్నాం` అని తెలిపింది యూనిట్‌.

ఇక ఈ చిత్రానికి రధన్(Radhan) సంగీతం(Music) అందించారు, సినిమాటోగ్రఫీ(Cinematograph) నీరవ్ షా(Nirav sha) వ్యవహరించారు,  కోటగిరి వెంకటేశ్వరరావు(Kotagiri Venkateswararao) ఎడిటర్(Editor) గా పని చేసారు,  నిర్మాతలు, వంశీ – ప్రమోద్, మహేష్‌ బాబు. పి రచన, దర్శకత్వం వహించారు.