కొవ్వు(Fat) అనేది ఓ మైనం లాంటి పదార్థం. ఇది కణాలు(Cells), హర్మోన్ల(Hormones)ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అయినప్పటికీ, హై కొలెస్ట్రాల్(High Cholesterol) మీ ధమనుల(arteries)కి మంచిది కాదు. అక్కడే గట్టిపడి సమస్యలను సృష్టిస్తుంది. రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. ఇది కచ్చితంగా మీ గుండె(Heart)పై ఒత్తిడి(Stress)ని కలిగిస్తుంది. దీంతో మీ గుండె బలహీనపడే అవకాశం ఉంది. దీంతో గుండెజబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యల నుంచి తప్పించుకోవడానికి, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, సరైన జీవన శైలి(Life style)ని అలవాటు చేసుకోవడం  మంచిది.

ఆహారం, నిద్ర, వ్యాయామం, మానసికం (Mentally)గా ఆరోగ్యంగా ఉండం మంచిది. ఇక ఆహార విషయానికి వస్తే కొన్ని ఆహార పదార్థాలు, ముఖ్యంగా డ్రింక్స్(Drinks) శరీరం(Body)లో కొవ్వుని తగ్గిస్తాయ(Reduces fat)ని చెబుతున్నారు నిపుణులు. వీటి వల్ల శరీరంలో వచ్చే అనేక సమస్యల్ని దూరం చేసుకోవచ్చయని చెబుతున్నారు. అయితే వీటిని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు(Precautions) కూడా తీసుకోవాలట. మరి.. ఆ డ్రింక్స్ ఏంటో.. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సోయా మిల్క్..

సోయా(Soya)లో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. సోయా పాలు, క్రీమర్స్(Creamers) మీ కొవ్వు స్థాయిలను సరిగ్గా నిర్వహించడంలో మీకు సాయపడతాయి. అదిక కొవ్వు, క్రీమ్, ఇతర పాల ఉత్పత్తులకి ఇవి మంచి ప్రత్యామ్నాయం. అయితే ఈ పాలు కొనేటప్పుడు తాజాగా ఉన్నాయా లేదా, అదనపు చక్కెర, ఉప్పు వంటివి యాడ్ చేశారా.. కొవ్వులు ఎంత వరకు ఉన్నాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన గుండెకి ఇది చాలా మంచిది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారంలో భాగంగా, రోజుకి 25 గ్రాముల సోయా ప్రోటీన్ తీసుకోవాలని చెబుతున్నారు.

టమాటా జ్యూస్..

టామాటా(Tomato)ల్లో లైకోపీన్(Lycopene) అధికంగా ఉంటుంది. ఇది మీ లిపిడ్(Lipid) స్థాయిలు అంటే కొవ్వు స్థాయిలను మెరుగుపరుస్తుంది. LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. టమాటా రసం కొలెస్ట్రాల్ తగ్గించే ఫైబర్, నియాసిన్‌కి గొప్ప మూలం.2015 అధ్యయనంలో 25 మంది మహిళలు రోజూ 280 మిల్లీ లీటర్ల టమాటా జ్యూస్‌ని 2 నెలల పాటు తాగితే వారి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయి.

గ్రీన్ టీ డ్రింక్

గ్రీన్ టీలో కాటెచిన్స్, ఎపిగాల్లో కాటెచిన్ గాలెట్, ఇతర ప్రయోజనకరమైన యాంటీ ఆక్సిడెంట్(Anti Oxidants) సమ్మెళనాలు చెడు ఎల్డీఎల్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.2015 అధ్యయనంలో, శాస్త్రవేత్తలు ఎలుకలకి కాటెచిన్‌లు, ఎపిగాల్లో కాటెచిన్ గాలెట్‌తో కలిపిన నీటిని అందించారు.56 రోజుల తర్వాత, హై కొలెస్ట్రాల్ ఆహారంలో ఎలుకల రెండు సమూహాలలో మొత్తం, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు దాదాపు 14.4, 30.4 తగ్గాయని గమనించారు. కాబట్టి వీటిని మీ డైట్‌(Diet)లో చేర్చుకోండి.

ఓట్స్ డ్రింక్

ఓట్స్‌(Oats) లో బీటా గ్లూకాన్స్(Beta Glucose) పుష్కలంగా ఉంటాయి. ఇవి గట్‌లో జెల్ లాంటి పదార్థాన్ని సృష్ఠిస్తాయి. పిత్త లవణాలతో సంకర్షణ చెందుతాయి. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సాయపడతాయి. మీరు ప్యాకెజ్ ఓట్స్ డ్రింక్ తాగితే అందులో బీటా గ్లూకాన్స్ ఉండేలా జాగ్రత్త తీసుకోండి. లేబుల్‌పై ఫైబర్ డీటెయిల్స్ కూడా పరీక్షించడం మంచిది.2018లో ఓట్స్ డ్రింక్స్ సెమీ సాలిడ్(Semi Solid), సాలిడ్(Solid) ఉత్పత్తుల కంటే కొలెస్ట్రాల్‌లో మరింత స్థిరమైన తగ్గింపు అందించవచ్చని కనుగొంది.

బెర్రీస్ డ్రింక్

బెర్రీస్‌(Berries)లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సాయపడతాయి. బెర్రీస్‌ లో కేలరీలు(Calories), కొవ్వు కూడా తక్కువ. మీరు స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ వంటి వాటిని తీసుకుని స్మూతి కోసం అరకప్పు లో ఫ్యాట్ మిల్క్, అరకప్పు చల్లని నీరు కలిపి మిక్సీ పట్టండి. అంతే హెల్దీ డ్రింక్(Healthy Drink) రెడీ.

కోకో డ్రింక్స్

కోకో(COCO)లో కొలెస్ట్రాల్‌ స్థాయిలను మెరుగుపరిచే ఫ్లేవనోల్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కోకోలో మోనో అన్ శాచురేటెడ్(Unsaturated) ఫ్యాటీ యాసిడ్స్(Fatty Acids) అధిక స్థాయిలో ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సాయపడుతుంది. డార్క్ చాక్లెట్‌లో కోకో మెయిన్ ఇంగ్రేడియేంట్. మీరు తీసుకునే కోకో పానీయాలలో ఉప్పు, కొవ్వులు కలిపిన చాక్లెట్స్(Chocolates) లేవని నిర్ధారించుకోండి. ప్రాసెస్ చేసిన చాక్లెట్ పానీయాలలో అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. కోకో ఫ్లేవనోల్స్ (Cocoa flavanols) కలిగిన 450 మిల్లీగ్రాముల పానీయం, ఒక నెలలో రెండు సార్లు తాగడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతూ, చెడు LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించింది.