ఎరుపు రంగు(Red Color)ల్లో చూసేందుకు ఆకర్షణీయం(Attracts)గా కనిపించే చెర్రీ పండ్లంటే(Cherry Fruit) అందరికి ఇష్టమే. అందానికి తగ్గట్టు అవి చూపించే ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) కూడా చాలానే వున్నాయి.

చెర్రీ పండ్లలో(Cherry Fruits) మన శరీరానికి కావల్సిన విటమిన్ సి(Vitamin C) తో పాటు మెగ్నీషియం(Potassium), ఫలావోనోయిడ్స్(Flavonoids) ఉంటాయి. అంతే కాకుండా ఎన్నో అనారోగ్యాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.

మరి చెర్రీ పందాలను తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం !

చెర్రీ పండ్లు, వీటిని ఎవరైనా ఇష్టంగానే తింటారు. అంతటి అమోఘమైన రుచిని ఈ పండ్లు మనకిస్తాయి.అయితే కేవలం రుచికి మాత్రమే కాదు, చెర్రీ పండ్లు పోషకాల(Nutrients)కు పెట్టింది పేరు. ఈ పండ్లలో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు వున్నాయి. వాటితో పలు అనారోగా సమస్యలు సులభంగా నయం చేసుకోవచ్చు.

ఊబకాయం రాకుండా చెర్రీ పండ్లు ఎంతో దోహదపడతాయి. ఈ పండ్లను తినడం ద్వారా రక్తం(Blood) లో కొలెస్ట్రాల్(Cholesterol) పెరగకుండా(prevents Increasing) నివారిస్తుంది.

చెర్రీ పండ్ల(Cherry Fruits)లో అపారంగా వుండే యాంటీ-ఆక్సిడెంట్స్(Anti-Oxidants) శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చెర్రీ పండ్లలో సంవృద్ధిగా వుండే విటమిన్ సి సరైన రోగ నిరోధక వ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది.

ఇన్ఫెక్షన్స్(Infections) రాకుండా చూస్తుంది. అలాగే చెర్రీ పండ్లలో వుండే మెలటోనిన్(Melontin) నొప్పులు(Pains), వాపుల(Swellings)ను తగ్గిస్తుంది. చెర్రీ పండ్లలో ఆంథోసైనిన్(Anthocyanin) యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ-ఇన్ఫలంటరీ(Anti-Inflammatory) గుణాలను కలిగి ఉంటుంది. కనుక కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

చెర్రీ పండ్లలో పుష్కలంగా వుండే మెలటోనిన్ మనకు వుండే నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. చెర్రీ పండ్లలో ఫలావోనోయిడ్స్, కెరోటినాయిడ్స్(Kertonoids) ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు(Brain) పని తీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపక శక్తిని(Memory) పెంచుతాయి. చెర్రీ పండ్లలో ఫైటోస్టెరాల్స్(Phyto Sterols) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తి(Immunity Power)ని పెంచడంతో పాటు రక్తంలో వుండే చేదు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. దింతో గుండె జబ్బులు(Heart issues) రాకుండా ఉంటాయి.

అలాగే రక్త నాళాలు(Blood cells) గట్టిపడకుండా ఉంటాయి. చెర్రీ పండ్లను తరచుగా తినే వారు ఎప్పటికి యవ్వనం(Young)గా కనిపిస్తారు. ఎందుకంటే వాటిలో వుండే ఫ్లేవనాయిడ్లు, కెరొటోనోయిడ్స్, విటమిన్ సి లు చెర్మాన్ని ముడతలు(Skin Wrinkles) పడకుండా, ఆరోగ్యంగా సంరక్షిస్తాయి.

చెర్రీ లోని ఆంథోసైనిన్లు ట్యూమర్(Tumor) పెరుగుదలను, కాన్సర్(Prevents Cancer) ను నిరోధిస్తాయి. చెర్రీ పండ్లలో సంవృద్ధిగా వుండే ఫైబర్(Fiber) జీర్ణ సమస్యల(Digestive Problems)ను పోగొడుతుంది. గ్యాస్(Gas), అసిడిటీ సమస్యలు(Acidity Problems) వుండవు. తిన్న ఆహారం సరిగా జీర్ణమవుతుంది. డయాబెటిస్(Diabetes) వున్నా వాళ్ళు కూడా చెర్రీ పండ్లను నిర్భయంగా తినవచ్చును. వాటిలో వుండే ఆంథోసైనిన్స్ ఇన్సులిన్(Insulin) ఎక్కువగా ఉత్పతయేలా చేస్తాయి. అందువల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్(Controls Sugar Levels) లో ఉంటాయి. ఏ మాత్రం వీలున్న ఒక్క గుప్పెడు చెర్రీ పండ్లను ప్రతి రోజు తినడం మంచిదని డిటిషన్స్(Dietician) చెబుతున్నారు.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు వున్నా చెర్రీ పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని మరింత శక్తివంతంగా చేసుకోండి.