దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకులో (State Bank Of India) ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం(Govt Job) అన్నంత క్రేజ్ ఉంటుంది యువతకు. దీంతో ఈ బ్యాంకులో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా అనేక మంది ప్రిపేర్(Prepare) అయ్యి పోటీ పడుతుంటారు.

స్టేట్ బ్యాంక్ సైతం వరుసగా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల(Release) చేస్తూ ఉంటుంది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్(Specialist Cadre Officer) ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ(Application Process) ఈ నెల 10న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30ని ఆఖరి తేదీ(Last date)గా నిర్ణయించారు అధికారులు. అర్హత(Qualified), ఆసక్తి(Interested) కలిగిన అభ్యర్థులు https://bank.sbi/web/careers వెబ్ సైట్లో(Websites) అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:

ఈ నోటిఫికేషన్(Notifications) ద్వారా డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(DCTO) విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతి(Based on Contract) ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ముంబాయి/నేవీ ముంబాయిలో పని చేయాల్సి ఉంటుంది. విద్యార్హతల వివరాలు: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్(B.Tech) లేదా ఎంసీఏ(MCA) చేసిన అభ్యర్థులు(Candidates) ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు(Recognized) పొందిన యూనివర్సిటీ (University) లేదా సంస్థ నుంచి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంబీఏ (MBA) విద్యార్హత కలిగిన వారికి ప్రాధాన్యం (Priority) ఉంటుంది.

ఎలా అప్లై చేయాలంటే?

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో(Online) అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు https://bank.sbi/web/careers, https://www.sbi.co.in/web/careers వెబ్ సైట్లలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజు(Application Fee)గా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో Resume, ఐడీ ప్రూఫ్(ID Proof), డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్(DOB Proof), – విద్యార్హతల సర్టిఫికేట్లు(Educational Certificate), ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు(Experience Certificate), లేటెస్ట్ ఫామ్(Latest Form)-16/ఐటీ రిటర్న్(IT Returns), కరంట్ పే స్లిప్ అప్ లోడ్(CPCL) చేయాల్సి ఉంటుంది.