మనలో చాలా మంది అందం(Beauty)గా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకోసం ముఖానికి ఏవోవే క్రీములు(Creams), లోషన్లు(Lotions) పూస్తుంటారు. కొత్త కొత్త డైట్ ఫాలో(New Diet Follow) అవుతుంటారు.

బ్యూటీ అంటే కేవలం ముఖంలోనే ఉందని అనుకుంటారు.  కానీ ఎంత అందంగా ఉన్నా పళ్లు బాగా లేకపోతే చూడానికి అస్సలు బాగుండదు.

అందుకే పళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దంతాలు పాడవడాని(Tooth Decay)కి చాలా కారణాలున్న అందులో ముఖ్యమైనది, మన తినే ఆహారం. కొన్ని రకాల ఆహారాలు మన దంతాలు, నోటిని ఎక్కువగా ప్రభావితం(Influence) చేస్తాయి.

కావిటీస్(Cavities), దంత క్షయం రావడానికి కారణమవుతాయి. చికిత్స(Treatment) చేయకుండా అలాగే వదిలేస్తే మరిన్ని సమస్యలు వస్తాయి. మీ పళ్లను పాడుచేసే కొన్ని ఆహార పదార్థాల(Food Nutrients)కు దూరంగా ఉండాలి. అదేంటో చూద్దాం!

కొన్ని ఆహారాలు అంటే ఆమ్ల(Amla) పదార్థాలు తీసుకోవడం ద్వారా మీ దంతాల ఎనామిల్‌ను(Enamel) కూడా బలహీనపరుస్తాయి(Weak). టమోటాలు(Tomatoes), సిట్రస్ పండ్లు(Citrus Fruits), వెనిగర్(Vinegar) వంటివి సహజంగా ఎక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటాయి. అవి ఎనామిల్‌ను తినేస్తాయి. మీ పళ్లకు హాని కలిగిస్తాయి.

యాసిడ్ ఉంటే ఆహారాలు తిన్న తర్వాత మీ నోటిని నీటి తో శుభ్రంగా కడగాలి. దంతాలలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాన్ని తటస్థీకరించడానికి నీరు సహాయపడుతుంది.అంటుకునే ఆహారం దంతాలలో పుచ్చులు, కుళ్ళిపోవడానికి ప్రధాన కారణం.

దంతాల నుంచి వాటిని తొలగించడం చాలా కష్టం. మీరు డ్రై ఫ్రూట్స్, మిఠాయిలు ఎక్కువగా తింటే, మీకు కావిటీస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవి పళ్లకు అంటుకుంటాయి. ఇలాంటి వాటిని తిన్న తర్వాత నోటిని శుభ్రం(Mouth Clean)గా కడుక్కోవాలి. ఎందుకంటే నోటిలోని బ్యాక్టీరియా(Bacteria) తీపి ఆహారాలు(Sweet Foods), డ్రింక్స్(Drinks) పట్ల ఎక్కువగా ఆకర్షితమవుతుంది.

బ్రెడ్, చిప్స్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు(Refined Carbohydrates) కూడా దంత క్షయానికి కారణమవుతాయి. ఇటువంటి ఆహారాలు తరచుగా మన దంతాలలో ఇరుక్కుపోతాయి.

నోటిలోని బ్యాక్టీరియా వాటిని తింటాయి. ఇది కావిటీస్, పాచి(Fungus) ఏర్పడటానికి కారణమవుతుంది. అందువల్ల కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తిన్న తర్వాత ఎప్పుడూ దంతాలను బ్రష్(Brush) చేయాలి. మీ దంతాలను ఆరోగ్యంగా ఉండాలంటే.. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు(Millets) వంటి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను తినాలి. చక్కెర పానీయాలు మీ దంత క్షయం, కావిటీస్ ప్రమాదాన్ని పెంచుతాయి.

ఒక వ్యక్తి చక్కెర పానీయాలు ఎంత ఎక్కువగా తాగితే.. అతని దంతాలు అంత ఎక్కువగా పాడవుతాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా, చక్కెర(Sugar)ను తినడం వల్ల కుళ్ళిపోయి కావిటీలు ఏర్పడతాయి. పళ్లు పుచ్చిపోతాయి(Teeth Rot).