మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది, కానీ ఇప్పుడు సెల్యూట్‌ నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కానుంది.

ఇప్పటికే ట్రైలర్‌తో మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. తాజాగా ఈ సినిమాను ఈనెల 18న సోనీ LIVలో నేరుగా విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించేసారు. ఇందులో దుల్కర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.థియేటర్లలో రన్ అవుతున్న హే సినామికలో దుల్కర్ సల్మాన్ తన నటనకు వచ్చిన రెస్పాన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా  తన తదుపరి  చిత్రం సెల్యూట్ విడుదలకు సిద్ధంగా వుంది .

కోవిడ్-19 మహమ్మారి కారణంగా మరియు భారీ-టిక్కెట్ చిత్రాల నిరంతర విడుదలల కారణంగా,  అలాగే ఈ చిత్రాన్నిదుల్కర్ సల్మాన్ తన హోమ్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్‌(Home Banner Wayfarer Films) పై నిర్మించారు.దింతో SonyLIVలో సెల్యూట్‌(Salute)ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

సెల్యూట్‌లో దుల్కర్ సల్మాన్ సబ్ ఇన్‌స్పెక్టర్ దుల్కర్ సల్మాన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో డయానా పెంటీ, మనోజ్ కె జయన్, లక్ష్మీ గోపాలస్వామి, సాయికుమార్, విజయకుమార్, బిన్నీ పప్పు మరియు అలెన్సియర్ లే లోపెజ్ తదితరులు ముఖ్య పాత్రలు(Main Characters) పోషించారు.

ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్(Roshan Andrews) దర్శకత్వం(Direction) వహించగా, రచయిత(Writer) ద్వయం బాబీ(Dvayam Bobby) మరియు సంజయ్(Sanjay) స్క్రీన్ ప్లే(Screen Play) రాశారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ(Cinematography): అస్లాం కె పురాయిల్(Aslam K. Purayil), ఎడిటింగ్(Editing): శ్రీకర్ ప్రసాద్(Sreekar Prasad) మరియు సంగీతం(Music): జేక్స్ బిజోయ్(Jakes Bejoy).