బోనాలు(Bhonaalu) పెద్ద పండుగ(Big Festival) తెలంగాణ(Telangana) ప్రజలు తమ సంస్కృతి(culture)కి చిహ్నంగా భవిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే పెద్ద పండుగా బోనాలు.

ఈ బోనాలకు శతాబ్దాల చరిత్ర(History) వుంది. తెలంగాణలో  ప్రతి ఏడాది ఆషాడ(Ashadam) మాసంలో జరుపుకునే బోనాలు, తెలంగాణ సంస్కృతుకి ప్రాణం. పసుపు కుంకుమలతో అందంగా అలకంరించి పైన జ్యోతి(lighting)ని వెలిగించిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యం(Prasadam)గా సమర్పిస్తారు.

అమ్మవారికి బోనాన్ని వేశాక నీళ్లతో కూడిన సాకను సమర్పించడం ఆనవాయితీ. పోతరాజు(Pothuraju),శివశక్తి వేషాలు, నాట్యాలు అందరిని ఆకట్టుకుంటూ, వినోదాత్మకంగా సాగుతాయి. డప్పుల దరువులకు కాలికి గజ్జ కట్టుకున్న పోతరాజులే కాదు సామాన్యలు కూడా చిందేస్తూ ఉత్సవాలో ఉత్సహాన్ని నింపుతారు.

అయితే ఈ బోనాల చరిత్ర గురించి ఒక్కసారి మనం తెరచి చూస్తే, కాకతీయుల కాలం(Kakatiya’s Time) నుంచే ఈ బోనాల పండుగా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. కాకతి దేవత(Goddess Kakathi) ఎదురుగా ఆ రోజులో అప్పుడే శుచిగా వండిన పాత్రలో నుంచి అన్నం (Rice) తీసి అమ్మవారి ముందు కుంభం(Khumbham)గా పోసి మాతను ఆరాధించే వారని ప్రతీతి అదే అప్పటికి అనేక హంగులను ఆపాదించుకుని పల్లెల్లో విరజిల్లుతోంది.

ఇంకో కధనం మేరకు అమ్మవారు ఆషాడం మాసం పుట్టింటికి వస్తుందని ఆమెకి ఇష్టమైనటువంటి పిండి వంటలు(Food item) కొత్త కుండ(New Pot)లో వండి నైవేద్యం(Praadam) పెట్టడమే ఈ బోనాలు అని చెబుతారు. భోజనం అన్న పదానికి వికృత రూపం బోనం అని తెలుగు నిపుణుల ఉవాచ.

ఇంటికి వచ్చిన ఆడబిడ్డకు ఇష్టమైన విందులు, వినోదాలు చేయడానికి ఆషాడం అడ్డేమిటి అని, కావాలని ఈ మాసంలోనే వేడుక జరుపుతారు. రైతులను మొదట పలకరించే జగత్ జననిని ఆరాదించటానికి తిధి, వార నక్షత్రాల దోషాలేమి లేవని పెద్దలంటున్నారు.

అమ్మ తన బిడ్డలందరిని ఎంతో ప్రేమగా చూస్తుంది, అలాగే తప్పు చేస్తే మందలిస్తుంది, అయినా సరే వినకుంటే దండిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తప్పు తెలుసుకుని సరైన మార్గంలో పయనిస్తాడు, అదే అమ్మకు పిల్లలకు వున్న అనుభందం.

అదే విధంగా ప్రకృతి మాత(Nature Goddesses) లేదా ఆ అమ్మలగన్న అమ్మకు కోపం వస్తే మనల్ని దండిస్తుంది. ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. అంటూ రోగాలు ప్రబలుతాయి 1869 వ సంవత్సరం లో హైదరాబాద్(Hyderabad), సికింద్రాబాద్(Secundrabad) జంట నగరాల్లో ఇలాగే మలేరియా(Malaria) వ్యాధి ప్రబలి తీవ్ర జన నష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చింది అని భావించిన ప్రజలు ఆమెని శాంత పరచటానికి ఉత్సవాలు(Ustavas), జాతర(Jathara) జరిపించాలని నిర్ణయించారు.

అదే బోనాల జాతర. ఈ పండుగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు. జంటనగరాల్లోనే కాక మరి కొన్ని తెలంగాణ ప్రాంతాల్లో ఈ పండుగాను చాలా వైభవంగా జరుపుకుంటారు.

ఈ పండగా ముఖ్య ఉద్దేశం కలరా(Cholera), ప్లేగు(Palgue), మసూచి(chicken fox) వంటి అంటూ వ్యాధి ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జారకుండా, పాడిపంటలతో, తమ పిల్లలను చల్లగా చూడమని ఆమెకు బోనాం సమర్పిస్తారు భక్తులు. ఉగాది(Ugadi) తరువాత చాలా రోజులకు వచ్చే మొదటి పండు(First Festival)గా ఇదే.

బోనాలు జంట నగరాల్లో, గోల్కొండ కోటలోను మరి కొన్ని దేవాలయాల్లోనూ నిర్వహిస్తారు. సికింద్రాబాద్లో(Secundrabad)ని ఉజ్జయిని మహాకాళి(Ujjaiani Mahamkaali) ఆలయం,లాల్ దర్వాజా(Laal Darwaja) లోని సింహవాహిని మహంకాళి(Simhavahini Mahmakaali) ఆలయాల్లో జరుపుకునే బోనాల జాతర కూడా వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ ఆలయాలు కాక నగరం లోని 45 ప్రధాన ఆలయాల్లో కుక్కడ లక్షలాది భక్తులు బోనం సమర్పిస్తుంటారు.

జంట నగరా(Twin Cities)ల్లో మొదట గోల్కొండ కోట(Golconda Fort) జగదాంబిక ఆలయం(Jagadambika Temple)లో  బోనాలు ఆషాడ మాసంలో ప్రతి అది, మంగళ, గురువారాల్లో బోనాలు సమర్పణ పూజలు జరుగుతాయి. గోల్కొండలో జాతర ప్రారంభమైన తరువాత రోజుల్లో తెలంగాణలోని అన్ని పల్లెలో జరుపుకుంటారు.

అసలు బోనం అంటే ఏంటి ?

బోనం(Bhonam) అంటే భోజనం(FOOd) శుచిగా అన్నం వండుకుని దానిన్ని ఘట్టంలో అంటే మట్టి కుండ లేదా ఇత్తడి గుండిగాలో ఉంచి దానిన్ని పసుపు, కుంకుమలతో అలంకరించి, వేపాకు తోరణాలు కడతారు. అన్నంలో పాలు లేదా పసుపు, చెక్కర కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

ఆ పాత్ర పైన ఒక ప్రమిదలో దీపం పెట్టి, ఇంటి ఇల్లాలు లేదా ఆడపడుచు పట్టుబట్టలతో, పూలు, నగలు అలంకరించుకుని సంతోషంగా ఆ బోనాన్ని తమ తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, డప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. అమ్మకు బోనాలు,తొట్టెలు సమర్పించి కల్లుతో సాక పెడితే అమ్మ శాంతించి అందరిని చల్లగా చూస్తుందని నమ్మకం.

అమ్మకు పోతరాజు(Potharaju) సోదరుడు అని నానుడి, అయన ఉగ్ర రూపంలో ఉంటాడు. ఈ పోతరాజు వేషంలో వుండే వారు ఎత్తుగా ఉండి. అమ్మ వారికి ఇష్టమైన పసుపును ఒళ్ళంతా  రాసుకుని, నిమ్మకాయలు మాల ధరించి, ముఖాన్ని కాసంత ఉగ్ర రూపంగా ఉండేట్లు అలకరించేసుకుని చర్న కోలాతో తనను తాను కొట్టుకుంటూ, డప్పు చప్పుళ్ల (Drums Sound)కనుగుణంగా నృత్యం(Dance) చేస్తూ ఊరేగింపులో వున్నా వారిని, వేడుకలను చూసేందుకు వచ్చిన వారిని చర్న కోలాతో సున్నితంగా కొడుతూ ముందుకు సాగుతారు. పోతరాజు చేతి చర్న కోలా తగిలితే జన్మధన్యమని ప్రజలు భావిస్తారు.

ఈ బోనాలు సందర్భంగా రంగం(Rangam) ఆట ఒకటి ఉంది. రంగం అంటే ఏంటి? ఆధునిక కాలంలో కూడా అమ్మ చూపే అద్భుతం ఈ రంగం. పచ్చి కుండ అంటే కాల్చని కుండ మీద ఎక్కి పూనకం వచ్చిన స్త్రీ భవిష్యత్తు(Future) ఎలా ఉంటుందో చెప్పే కార్యక్రమాన్ని రంగం అంటారు.

జనమంతా ఆ మనిషి చెప్పేది విని ముందు జాగ్రత్తలు తెలుసుకుంటారు. గోల్కొండ ఎల్లమ్మ(Golconda yellamma), సికింద్రాబాద్ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ(Balkampet Yellamma), జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి(Jublieehills Peddamma)… ఇలా నగరంలోని ప్రతి కూడలిలోనూ జరిగే బోనాలు భాగ్యన‌గ‌రానికే ప్రత్యేక‌త(Special) తీసుకువ‌స్తాయి.

అదే తెలంగాణ బోనాలకున్న ప్రాధాన్యత(Importance). ఆ అమ్మవారు కరుణ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ. మీ అందరికి బోనాలు ..