చైతన్య జొన్నలగడ్డ భార్య ,నిహారిక ,అదేనండి మన మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా? లేదా? అనే సందేహాలు కలిగాయి మన అందరికి.పెళ్లి తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే జవాబు ఇచ్చేసింది నిహారిక .

ఓ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి రెడీ అయిపోయింది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనున్న నిహారిక వెబ్‌సిరీస్‌ను షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.హైదరాబాద్ లో శుక్రవారం లాంఛనంగా  ఈ వెబ్‌ సిరీస్‌ ప్రారంభమైంది.

నిహారికకు వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం కొత్తేమీ కాదు. నిహారిక నటిగా నటన లో ఓనమాలు దిద్దింది ఈ వెబ్‌ సిరీస్‌ల్లోనే. నాన్న కూచి, ముద్దపప్పు అవకాయ్‌, మ్యాడ్‌ హౌస్‌ వెబ్‌ సిరీస్‌ల లో నటించింది.ఒక వైపు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తూనే సినిమాల్లోనూ నటించింది నిహారిక.

ఇప్పుడు పెళ్లి తరువాత సరి కొత్తగా ,రాయుడు చిత్రాలు బ్యానర్‌పై భాను రాయుడు దర్శక నిర్మాతగా ఈ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్నారు.

ఈ వెబ్‌ సిరీస్‌ పూజా కార్యక్రమాలను నిహారిక ,చైతన్య  ఇరువురు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిచారు. ప్రముఖ సినీ రచియత విజయేంద్రప్రసాద్‌ మరియు దర్శకుడు వి.వి.వినాయక్‌ కలిసి దర్శక నిర్మాత భాను రాయుడుకి స్ట్రిప్ట్‌ను అందించారు. యంగ్‌ ప్రొడ్యూసర్‌ హర్షిత్‌ రెడ్డి ఈ వెబ్ సిరీస్ బ్యానర్‌ లోగోను ఆవిష్కరించారు.

యూట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్ర ఇందులో నటిస్తున్నారు. ఇందులో కొత్త చెప్పాల్సిన విషయమేమంటే.. ఇందులో హాట్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్‌  కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇంకా ఈ సినిమాలో హారిక, అస్తా మాలిక్‌, వసంత్‌ సమీర్‌ తదితరులు నటిస్తున్నారు. శౌర్యవ్ మాటలు రాస్తున్నారు. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కీరవాణి తమ్ముడు కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూరుస్తు్న్నారు.

ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో ,పెళ్లి తర్వాత నిహారిక సక్సెస్ ఎలా ఉంటుందో చూద్దాం మరి …