ప్రపంచమంతా నిత్యం వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్..  ఇప్పుడు సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది.  డెస్క్‌టాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ వాట్సాప్  సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. మరి ఈ ఫీచర్లన్నీ మనకు తెలుసా.. వీటి  గురించి మరింత వివరం గా తెలుసుకుందాం.

సరి కొత్త ఫీచర్స్

వాట్సప్ ఆడియో మెసేజెస్ సీక్రెట్‌గా ఇయర్ ఫోన్ లేకుండానే వినేయొచ్చు.

ఇప్పుడు వర్చువల్ ఫోన్ నెంబర్ ఉపయోగించి రియల్ ఫోన్ నెంబర్ దాచి ఉంచి వాడొచ్చు.

ఇక వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ కి’అన్‌లాక్ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి ముందుగా ఒక ఫింగర్ ప్రింట్ అన్ లాక్  యాప్ ఓపెన్ చేయాలి.రైట్ సైడ్ టాప్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. తర్వాత అకౌంట్ ఓపెన్ చేయాలి. అందులో ప్రైవసీ పైన క్లిక్ చేయాలి. చివర్లో ఫింగర్ ప్రింట్ లాక్ (Fingerprint Lock) ఉంటుంది. ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేయడానికి మీ వేలిముద్ర (ఫింగర్ ప్రింట్)తప్పనిసరిగా కావాలి. ఈ సెక్యూరిటీ ఫీచర్స్ రెండు ఎనేబుల్ చేశారంటే ఇతరులు మీ వాట్సప్ ఓపెన్ చేసి చూడటం సాధ్యం కాదు. మీ ఛాట్స్, వీడియోలు, ఫోటోలు, అన్నీ ఇప్పుడు సురక్షితంగానే ఉంటాయి.

ఇప్పుడు ల్యాండ్ లైన్ నెంబర్‌తో రిజిష్టర్ అయి కూడా వాట్సప్‌ను వాడుకోవచ్చు.

డార్క్ మోడ్… చాలాకాలంగా వాట్సప్ యూజర్లు ఎదురుచూస్తున్న ఫీచర్. ఇప్పటికే అనేక యాప్స్‌లో డార్క్ మోడ్ ఫీచర్ ఉంది. కొంతకాలంగా బీటా యూజర్లు డార్క్ మోడ్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ ఫీచర్ వాట్సప్ యూజర్లందరికీ రానుంది.

ఇన్నాళ్లూ మనం వాట్సప్ అకౌంట్‌ని కేవలం ఒకే ఫోన్‌లో వాడుకునే అవకాశం ఉండేది.అవసరమైతే కంప్యూటర్‌కు కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒకే వాట్సప్ అకౌంట్ ఎన్ని డివైజుల్లో అయినా ఓపెన్ చేయొచ్చు.

బ్లూ టిక్స్ రాకుండా వాట్సప్ మెసేజ్‌లను ఇప్పుడు సీక్రెట్‌గా చదివేయొచ్చు.

ఎవరైనా మిమ్మల్ని వాట్సప్‌లో బ్లాక్ చేశారా అనేది తెలుసుకోవచ్చు.

డైరెక్ట్‌గా మీ వాట్సప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్ స్టోరీస్‌గా చాలా సులభం గా మార్చేయొచ్చు. ఇందుకోసం షేర్ వాట్సప్ స్టేటస్ ఫీచర్ ఉపయోగపడనుంది. అంటే మీరుఏదైనా  మీ వాట్సప్‌ స్టేటస్ పెడితే ఇపుడు అదే స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోకి షేర్ చేయొచ్చు.

వాట్సప్ అకౌంట్ నిజమా ఫేక్ అనేది తెలుసుకోవచ్చు.

మీరు చేసిన వాట్సాప్ చాట్ మొత్తం మీరు ఎంపిక చేసుకున్న మెయిల్ ఐడీకి ఈమెయిల్ కి మెయిల్ చేసుకునే సదుపాయం వాట్సప్ కల్పించింది. తద్వారా ఎపుడైనా చాట్ డిలీట్ అయినప్పటికీ మొత్తం చాట్ డేటా ఈ మెయిల్ లో నోట్ పాడ్ రూపంలో స్టోర్ అవుతుంది.

మీరు కాకుండా ఇతరులు ఎవరైనా వాట్సప్ మెసేజ్‌లు చదువుతున్నారా అనేది కనుక్కోవచ్చు.

ఇక ఆలస్యం ఎందుకు ??సరికొత్త వాట్సాప్ ఫీచర్స్ మీ మొబైల్ లో కూడా వాడేయండి .