డిజో వాచ్‌ డీ (Dizo Watch D) స్మార్ట్ వాచ్‌ సేల్ మొదలైంది. రియల్‌మీ టెక్ లైఫ్(Real me Tech Life) నుంచి గత వారం లాంచ్(Launch) అయిన ఈ స్మార్ట్‌ వాచ్‌ మొదటి సారిగా సేల్‌(Sale)కు వచ్చింది.

భారీ డిస్‌ప్లే(Huge Display), టెంపర్డ్ కర్వ్‌డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌(Tempered curved glass protection)తో ఈ వాచ్‌ వస్తోంది. లుక్ పరంగా చూస్తే యాపిల్ వాచ్‌(Apple Watch)ను పోలి ఉంటుంది. ఇతర వాచ్‌లతో పోలిస్తే బడ్జెట్ రేంజ్‌(Budget Range)లో పెద్దగా కనిపించే స్క్వేర్ డయల్‌ (Square Dial) ను ఈ వాచ్‌ కలిగి ఉంది. మిగిలిన ఫీచర్లు(Features) సైతం ఆకర్షణీయంగా ఉన్నాయి.

ప్రధానమైన హెల్త్ ఫీచర్లన్నీ(Health Features) డిజో వాచ్ డి లో ఉన్నాయి. అలాగే 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌(Sports Modes) కు సపోర్ట్(Support) చేస్తుంది. మంచి బ్యాటరీ లైఫ్(Battery Life) ఇస్తుంది.5ATM వాటర్ రెసిస్టెంట్ (Water Resistant) మరో ఆకర్షణగా ఉంది. తొలిసేల్ సందర్భంగా ప్రత్యేకమైన ఇంట్రడక్టరీ ధర(Introductory Price)తో అందుబాటులోకి వచ్చింది. డిజో వాచ్‌ డీ(Dizo Watch D) ధర(Price), సేల్‌(Sale), స్పెసిఫికేషన్ల(Specifications)పై ఓ లుక్కేయండి.

డిజో వాచ్‌ డీ స్పెసిఫికేషన్లు:

డిజో వాచ్‌ డీ 1.8 ఇంచుల ఫుల్ టచ్ TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. 240×286 పిక్సెల్స్ రెజల్యూషన్ (Pixels Resolution), 550నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ (Peak Brightness) ఉంటుంది. స్క్వేర్ డయల్ ఉండగా.. దీనికి మెటల్ ఫ్రేమ్‌(Metal Frame)ను డిజో పొందుపరిచింది. ఇక డిస్‌ప్లేకు కర్వ్‌డ్ టెంపర్డ్ గ్లాస్ రక్షణ ఉంది. కర్వ్‌డ్ ఫినిష్(Curved Finish) ఉండడంతో చూసేందుకు యాపిల్ వాచ్‌లా లుక్‌ను ఇస్తుంది. ప్రీమియమ్‌(Premium)గా కనిపిస్తోంది. 150పైగా కస్టమైజబుల్ వాచ్‌ ఫేసెస్‌(Customize Watch Phases) కు డిజో వాచ్‌ డీ సపోర్ట్ చేస్తుంది. విడ్జెట్‌ల(Widgets)ను కూడా సెట్ చేసుకోవచ్చు.

బ్యాటరీ విషయానికి వస్తే, Dizo Watch D ఫుల్ చార్జ్‌పై 14 రోజుల బ్యాటరీ లైఫ్(Battery Life) ఇస్తుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ అయ్యేందుకు 2 గంటల వరకు సమయం పడుతుంది. రన్నింగ్(Running), వాకింగ్(Walking) సహా మొత్తంగా 110స్పోర్ట్స్ మోడ్స్‌ కు మద్దతిస్తుంది.

నిరంతర హార్ట్ రేట్ మానిటరింగ్ (Heart rate Monitoring), బ్లడ్ ఆక్సిజన్(Blood Oxygen) సాచురేషన్ సెన్సార్ ఎస్‌పీఓ 2(Saturation Sensor Spo2), నిద్రను విశ్లేషించే స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్ల(Sleep Tracker Health features)తో ఈ వాచ్ వస్తోంది. స్టెప్ కౌంటర్(Step Counter), క్యాలరీ బర్న్‌(Calorie Burn) వివరాలు ఆటోమేటిక్‌గా రికార్డ్(Automatic Record) అవుతాయి. వాటర్ రెసిస్టెంట్ కోసం 5ఏటీఎం రేటింగ్‌(5ATM Rating)తో వస్తోంది.

మొబైల్‌(Mobile)కు కనెక్ట్ చేసుకునేందుకు బ్లూటూత్ వెర్షన్‌(Blue tooth Version) 5.1ను డిజో వాచ్‌ డీ కలిగి ఉంది. కనెక్ట్ అయినప్పుడు స్మార్ట్‌ ఫోన్‌కు కాల్ వస్తే వాచ్‌లో అలెర్ట్ వస్తుంది. ఎస్ఎంఎస్‌లు(SMS), సోషల్ మీడియా నోటిఫికేషన్లు(Social Media Notifications) వచ్చినా అలెర్ట్‌లను కూడా పొందవచ్చు. మ్యూజిక్(Music), కెమెరా(Camera)ను కూడా కంట్రోల్ చేసే సదుపాయం ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్‌లో డిజో యాప్‌ (Dizo App)ను ఇన్‌స్టాల్(Install) చేసుకొని ఈ వాచ్‌ను సింక్ చేసుకోవచ్చు.

ఫిట్‌నెస్(Fitness), వర్కౌట్‌ల(Workouts) గుంచి మరిన్ని వివరాలు చూడవచ్చు.