ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్‌ (Samsung Galaxy 5 G Smart Phone) ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం గా వుంది. తన గెలాక్సీ ఏ52ఎస్ స్మార్ట్ ఫోన్‌ను యూరోప్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇది వరకే లాంచ్ అయిన గెలాక్సీ ఏ52 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ లాంచ్ చేసింది.

సెప్టెంబర్ ౩న మనదేశంలో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం.

శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ధర ( Samsung Galaxy A 52 s 5 G Cost)

యూరోప్‌లో కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే ఈ ఫోన్ లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 409 పౌండ్లుగా అంటే సుమారు రూ.40,800 నిర్ణయించారు.

అయితే మనదేశంలో మాత్రం దీనికి సంబంధించి రెండు వేరియంట్లు లాంచ్ కానున్నాయని సమాచారం. మనదేశంలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,499గానూ ఉండనుందని సమాచారం.

అసమ్ వైట్,అసమ్ బ్లాక్, అసమ్ వయొలెట్, అసమ్ మింట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది .

శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది.

ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు.

దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌ (120 H) గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

8 జీబీ వరకు ర్యామ్ (8 GB RAM) , 128 జీబీ స్టోరేజ్ (128 GB Storage) ఇందులో ఉంది. దీన్నిమైక్రో ఎస్‌డీ కార్డు (Micro SD Card) ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది.

25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ (USB Type-C) , బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా పొందుపరిచారు.

ఇక కెమెరా విషయానికి వస్తే ,

ఫోన్ వెనుకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా కెపాసిటీ 64 మెగాపిక్సెల్‌ ఉండగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి.

ముందువైపు (Front side) సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 189 గ్రాములుగానూ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్‌  ఎలా ఉంటుందో చూద్దాం మరి …