బిగ్ బాస్ తెలుగు సీజన్ 5(Big Boss Season 5) విజేత(Winner) VJ సన్నీ(VJ Sunny) కొత్త చిత్రం(New Movie) ప్రారంభమైంది.

ఈ చిత్రాన్ని ఎ2బి ఇండియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్(A2B India Productions Pvt Ltd), అన్‌స్టాపబుల్(unstoppable) (నౌట్ 100% ఎంటర్‌టైన్‌మెంట్) బ్యానర్‌(Banner)పై రంజిత్ రావు.బి నిర్మిస్తున్నారు(Ranjith Rao Produces) . సప్తగిరి, పోసాని కృష్ణమురళి, పృద్వీ, షకలక శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత(Writer) వి విజయేంద్ర ప్రసాద్(V.Vijayendra Prasad) , దర్శకుడు బి గోపాల్(Director B. Gopal),మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్ తదితరులు పాల్గొన్నారు.
హీరో వీజే సన్నీపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశాని(Muhurtham Scence)కి రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లాప్ కొట్టారు. దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్(Camera Switch on) చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర హీరో సన్నీ మాట్లాడుతూ, ‘దర్శకుడు డైమండ్ రత్నబాబు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. బిగ్ బాస్ తర్వాత నటుడిగా నిరూపించుకునే అవకాశాన్ని వదులుకోకుండా సినిమా చేస్తున్నాను. నటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, నవ్వించడానికి వంద శాతం కష్టపడతాను. ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంది.

త్రిమూర్తులు వంటి నిర్మాతలతో కలిసి సినిమాకు మంచి టీమ్‌ వచ్చింది. సీనియర్ నటీనటులు నటించిన ఈ సినిమా ప్రేక్షకుల(Audience)కు తప్పకుండా నచ్చుతుంది. ‘

సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు దర్శకుడు డైమండ్ రత్నబాబు(Director Diamond Ratna babu) తెలిపారు. జూన్ 9(June 9th) నుంచి రెగ్యులర్ షూటింగ్(Regular Shooting) ప్రారంభించి జూన్, జులైలో షూటింగ్ పూర్తి చేసి దసరాకి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు.

ఇకపై ప్రేక్షకులు మెచ్చే మంచి చిత్రాలను తమ బ్యానర్‌పై తీసుకొస్తామని నిర్మాత బి. రంజన్‌రావు తెలిపారు.