బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) ఈ వారం ఎలిమినేషన్‌(Elimination) లో శ్రీరామ్ మినహా మిగిలిన ఐదుగురు నామినేషన్స్(Nominations) లో వున్నారు. ఒక్క నామినేషన్స్ తో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో టాప్‌ ౫ లో ఎవరు ఉంటారన్న విషయం తేలిపోతుంది. కానీ ఈ సీజన్ లో ఎలిమినేషన్ ప్రక్రియ లో ఊహించని షాక్(Shock) లతో పాటు ట్విస్టు(Twist)లు ఇస్తున్న బిగ్ బాస్. అయితే కాజల్, సిరికి, తొక్కువ వోట్ లు పడ్డాయని తెలుస్తోంది. కానీ శ్రీ రామ్ టికెట్ టూ ఫినాలే మొదటి ఫైనలిస్ట్(First Finalist) అవ్వగా, ఇప్పటి వరకు ఆడియన్స్ పోలింగ్ లో సన్నీ, షన్ను టాప్ 5 స్థానంలో వున్నారని సమాచారం. ఆ ముగ్గురి తో పాటు  సిరి, కాజల్ టాప్ 5(Top 5) లో ఉంటే, ఇక మిగిలిన మానస్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్(Chances) వుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారో?  టాప్ 5 ఎవరు వుంటారో? తెలియాలంటే వీకెండ్ షో(Weekend show) వచ్చే వరకు వెయిట్(Wait) చేయాల్సిందే.

హౌస్ మేట్స్(House mates) తమ పెర్ఫార్మన్స్(Performance) తో ఆడియన్స్(Audience) ని ఓట్లు అడిగే అవకాశం ఎవరికి అన్నదానిపై కంటెస్టెంట్స్ (Contestants) మధ్య రచ్చ రేగింది.‘ఓట్ ఫర్ మి’(Vote for me) టాస్క్ లో మానస్-శ్రీరామ్‌లకు టై అయ్యింది. వీళ్లిద్దరిలో ఎవరు ‘ఓట్ ఫర్ మి’ పొందుకుని ప్రేక్షకుల్ని ఓట్లు ఎవరు అడుగడానికి అర్హులో అన్నదాని పై హౌస్‌లో ఉన్న హౌస్ మేట్స్(House mates) నిర్ణయించి చెప్పాలన్నారు బిగ్ బాస్(Big Boss) . అయితే షణ్ముఖ్, శ్రీరామ్‌కి టికెట్ టు ఫినాలే ఉంది. మానస్ నామినేషన్స్‌ (Nominations)లో ఉన్నాడు కాబట్టి మానస్‌కి ఇస్తే బాగుంటుందా? లేదంటే శ్రీరామ్‌కే ఇవ్వాలా? అని రెండు ఆలోచనలు ఉన్నాయని అన్నాడు. అయితే సన్నీ, కాజల్‌లు మానస్‌కి మద్దతు(Support) ఇచ్చారు. అయితే హౌస్ కాల్ కాదు మానస్ నేను మాట్లాడుకుని నిర్ణయించుకుంటాం అని అనడంతో కాజల్ మధ్యలో దూరి వాగ్వాదనకు దిగుతుంది. హౌస్ కాల్(House Call) తీసుకోమంటే మీ ఇద్దరూ మాట్లాడుకోవడం ఏంటని వాదించింది. దీంతో శ్రీరామ్ ఆమె పై మండిపడ్డాడు . మానస్‌కి నువ్వు, సన్నీ మాత్రమే ఫ్రెండ్స్ నేను కాదు షణ్ముఖ్, సిరి కూడా సపోర్ట్ చేయడం లేదు మేం మాట్లాడుకుంటాం అంటే మధ్యలో నువ్ వచ్చి దూరిపోతావ్ ఏంటి?? ఆట లో ఆడటం రాదు, ఏం రాదు అంటూ ఫైర్(Fire) అయ్యాడు. మాటలు లూజ్ అవుతున్నావు  చూసుకో బ్రో అని కాజల్ అనడంతో, బ్రో ఏంటి? బ్రో నువ్వు  నన్ను అలా పిలవకు అంటూ శ్రీరామ్ గట్టిగా పంచ్(Punch) ఇచ్చాడు. దీంతో సన్నీ కల్పించుకుని కాజల్‌ని తప్పుపట్టాడు.

వాళ్లు మాట్లాడుకుని ఫైనల్(Final) అవుతారని అంటున్నారు కదా మధ్యలో నీకెందుకు?  అని చిరుబుర్రులాడడం తో పాటు, ఆమెకు డిస్కషన్‌లో ఉండటం కావాలి ప్రోవోకింగ్(Provoking) చేస్తుంది అని కాజల్‌పై ఫైర్ అయ్యాడు. అయితే ఈ ముగ్గురి మధ్య డిస్కషన్ నడుస్తుంటే మోజ్ రూంలోని సోఫాపై సిరి, షణ్ముఖ్‌లు కూర్చుని తెగ సంబరపడిపోయారు మాటలు అనడం, తిరిగి పడటం, ఏడ్వడం కాజల్ స్ట్రాటజీ(Strategy) అంటూ షణ్ముఖ్ సిరితో చెప్పుకొచ్చాడు. ఆ తరువాత  సన్నీ-మానస్‌ల దగ్గరకు వచ్చి ఎమోషనల్ అయ్యింది కాజల్ . ఈవారం అంతా శ్రీరామ్‌ని బాగా చూసుకుంటే, బ్రో అని ఫ్లోలో వచ్చేసింది. నువ్ నన్ను అలా పిలవకు అని అన్నాడని ఎమోషనల్(Emotional) అయ్యి  ఏడ్చేసింది. ఆ తరువాత సన్నీ శ్రీరామ్ దగ్గరకు వెళ్లి కాజల్‌తో మాట్లాడు, హౌస్ కాల్(House Call) తీసుకుంటే మానస్ హ్యాపీ ఫీల్ అవుతాడనే ఉద్దేశంతో అలా అన్నది, ఆమె బ్రదర్ అని నీతో ఎమోషనల్‌(Emotional)గా కనెక్ట్ అయ్యింది కానీ నువ్వు ఆలా పిలవకు అనే సరి బాధపడుతోందో  అని చెప్పాడు. ఆ మాటతో ఎమోషనల్ కనెక్షన్‌ ఎవరితోలేదు అలాంటివి  ఇక్కడ నడవవు బ్రదర్ అని చెప్పి దాన్ని షీల్ట్‌ గా ఉపయోగించుకోవడానికి అలా చేస్తుంది. నాకు పిచ్చ లైట్ అంటూ కుండబద్దలుకొటినట్టు మాట్లాడాడు శ్రీరామ్. ఇక మానస్‌కి ఓటింగ్ అడిగే అవకాశం(Chance) రావడంతో ప్రేక్షకుల్ని ఓట్లు తనకు వేయాలని వేడుకున్నాడు. ఇప్పటివరకూ నన్ను సేవ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు టాప్ 5లో వెళ్లడానికి బిగ్ బాస్(Big Boss) విజేత(Winner) కావడానికి మీ ఓట్లు నాకు చాలా అవసరం. అలాగే సన్నీ, కాజల్‌కి కూడా ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుతున్నా అంటూ ప్రేక్షకుల్ని ఓట్లు(Votes) వేయాలని రిక్వెస్ట్(Request) చేసాడు మానస్.

ఇక వోట్‌ అప్పీల్‌(Vote Appeal) టాస్క్‌ లో భాగంగా మూడో అవకాశం(Chance) ఇచ్చాడు బిగ్ బాస్(Big Boss). హౌస్ మేట్స్(House mates) అందరు  సూపర్‌ స్టార్స్‌(Super Stars) లా నటించాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా సన్నీ-బాలయ్య,కాజల్‌- శ్రీదేవి, శ్రీరామ్‌-చిరంజీవి, మానస్‌- పవన్‌ కల్యాణ్‌, షణ్ను- సూర్య, సిరి.-జెనీలియాగా నటించారు. ప్రతి ఒక్కరూ వారివారి పాత్రల్లో అద్భుతంగా జీవించేశారు. క్లాస్‌, మాస్‌ పాటలకు స్టెప్పులు కూడా ఇరగదీశారు. ఈ టాస్క్‌ ద్వారా హౌస్‌మేట్స్‌ అంతా కలిసిపోయారు. షణ్ను సిరికి మధ్య మరోసారి రచ్చ  మొదలైంది. నువ్వు వాళ్లత. అయితే హ్యాపీగా ఉంటావు, వెళ్లు, నీతో నేను ఇమడలను అని సిరికి ముఖం మీదే చెప్పాడు షణ్ను. ఎప్పుడూ లేనిది ఈ వారమే నీకు ప్రాబ్లం అవుతుంది కదా అంటూ సిరి ఫ్రాస్ట్రేట్ అవుతుంది. మరి కాసేపటికి  నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ షణ్ను కోపాన్ని తగ్గించేసింది. అతడు నవ్వేయగానే మన ఫ్రెండ్‌షిప్‌(Friend ship) అంటే చాలా ఇష్టమంటూ వెళ్లి అతడిని హాగ్(Hug) చేసుకుంది. అలా వీళ్ల గొడవ కాస్త  చల్లారిపోయింది. కానీ రేపటి ఎపిసోడ్‌ ప్రోమో(Promo) లో కూడా వీళ్లు మళ్లీ గొడవపడుతున్నట్లు చూపించారు.

వీళ్ళ గొడవకు కారణాలు పెద్దగా లేకపోయినా గొడవ మాత్రం తారస్థాయిలో ఉంటుంది. ఏ ఇద్దరు ఎందుకు మల్లి గొడవ పడ్డారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.