ఆంధ్రప్రదేశ్‌(AP)లో డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల(Departmental Exam)కు సంబంధించిన తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (APPSC) ఖరారు చేసింది.

ఈ నెల 20వ తేదీ నుంచి 25 వరకు జిల్లా(Districts) కేంద్రాల్లో డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు APPSC పేర్కొంది. ఈ పరీక్షలకు 55,036 మంది దరఖాస్తు(Applied) చేసుకున్నట్లు వెల్లడించింది.

డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ (Schedule)ను APPSC ఆఫీషియల్ వెబ్‌సైట్‌(Official Website)లో చూడొచ్చు.

ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) రెవెన్యూ(Revenue), దేవాదాయ(Devadaaya) శాఖల్లోని ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌(Executive Officer Grade)-3, జూనియర్‌ అసిస్టెంట్‌(Junior Assistant) కమ్‌ కంప్యూటర్‌ ఆసిస్టెంట్‌(Computer Assistant) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష(Written Exam) తేదీలను వెల్లడించింది.

రెవెన్యూ, దేవాదాయ శాఖల్లోని 730 పోస్టుల భర్తీకి ఇటీవల APPSC నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 3 పోస్టులు, 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులున్నాయి.

అయితే.. ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీలను నోటిఫికేషన్ల(Notifications)లో పేర్కొనలేదు. దీంతో తాజాగా వీటికి సంబంధించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీలను APPSC ప్రకటించింది. జులై 24వ(July 24th) తేదీన ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 3 పోస్టులకు, జులై 31(July 31st)న రెవెన్యూ విభాగం(Revenue department)లో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌(Screening Test) నిర్వహించనున్నట్టు APPSC పేర్కొంది.

అభ్యర్థులు(Candidates) పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ (APPSC) అధికారిక వెబ్‌సైట్‌(Official Website) https://psc.ap.gov.in/ లో చూడొచ్చు.

ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు(Hall tickets) సైతం త్వరలో విడుదలయ్యే(Release) అవకాశం ఉంది.