బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) పదమూడో వారం ప్రారంభమైంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్(Contestant) గా కొనసాగిన రవి ఎలిమినేట్ అవ్వడం హౌస్ (House mates) ఎవరు జీర్ణించుకోలేక పోతున్నారు. దీని గురించే ఇంట్లో అందరు డిస్కస్ చేసుకున్నారు.

రవి ఎలిమినేషన్ (Elimination) బిగ్ బాస్ కి నచ్చినట్టు చేసాడేమో అనిపిస్తుంది, ఆడియన్స్ పోల్ లో అయితే రవికి మంచి ఓట్లు పడ్డాయని సమాచారం.  ఇక 13వ వారం నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తం ఏడుగురు బిగ్ బాస్(Big Boss) హౌస్ లో ఉండగా, కెప్టెన్(Captain) గా వున్న షన్ను కి నామినేషన్స్(Nominations) నుంచి మానహాయింపు లభించింది.

ఇక మిగిలిన మానస్, పింకీ, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్ లు ఎవ్వరు నామినేట్ అయ్యారు. ఎవరెవరు ఎవర్ని నామినేట్ చేసారో 86 వ ఎపిసోడ్ హై లైట్స్  చూసేద్దాం.

ఇక షన్ను,సిరి, శ్రీరామ్ రవి గురించి మాట్లాడుతూ టాప్(Top 3) 3లో  రవి ఉంటాడనుకున్నా అని షన్ను  అంటే, టాప్‌ 2లో ఊహించానని శ్రీరామ్‌ రవి గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మరో వైపు  కాజల్‌ మాత్రం ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌(Eviction free pass)తో కాకుండా ప్రేక్షకుల ఓట్ల(Audience votes)తో సేవ్‌(Save) అయినందుకు తెగ సంతోషపడిపోయింది. మరోపక్క మానస్‌ తను టైటిల్‌(Tittle)ను లెక్క చేయనని తేల్చేశాడు. ప్రజల మనసులు గెలవడమే తనకు ముఖ్యమని పేర్కొన్నాడు.

ఈ మధ్య ప్రియాంకను కనీసం ముట్టుకోవడం లేదన్నాడు. ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్‌ వస్తున్నాయో అన్న భయంతో హగ్‌ చేసుకోవడం లేదని చెప్పుకొచ్చాడు.

మరో పక్క పింకీ చాలా ఒంటరిగా ఫీల్‌ అవుతోందని, నన్ను తనతో ఉండమంటోందని షణ్నుతో చెపింది సిరి. తర్వాత పింకీ దగ్గరకు వెళ్లి ఏమైంది డల్‌గా ఉన్నావంటూ ఆమె బాధను పోగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో ప్రియాంక రవి లేని లోటు గురించి చెప్పుకొచ్చింది. నా చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నప్పుడు నాకు కనిపించే వ్యక్తి రవి అన్నయ్య, అతడు లేకపోతే నాకు ధైర్యం లేనట్లు అనిపిస్తోందని బాధపడింది పింకీ.

మరోపక్క షణ్ను వద్దంటున్నా సిరి హగ్గివ్వడానికి వెళ్లింది. అతడు ఎంత వారించినా వినకుండా ఫ్రెండ్‌షిప్‌(Friend ship) హగ్గంటూ షణ్నును హాగ్ చేసుకుంది.

ఎప్పటిలాగే కాజల్‌ ఈ వారం నామినేషన్స్‌(Nominations) లో ఎవరెవరు ఉంటారు? ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారని లెక్కలు వేసింది. సన్నీనెవరూ నామినేట్‌ చేయరని కుండబద్దలు కొట్టి చెప్పింది. చివరకు ఆమె అన్నదే నిజమైంది.

మరోపక్క షణ్ముఖ్‌ ప్రియాంకతో మాట్లాడుతూ.. సన్నీ, మానస్, కాజల్ ధైర్యం ఏంటంటే నిన్నేం చేసినా నువ్వు వాళ్లను నామినేట్‌ చేయవు, ఎదురు తిరగవని వాళ్ల నమ్మకం. నువ్వు వాళ్ల కంట్రోల్‌లో ఉన్నావనుకుంటున్నారు అని ఆమెను విడమరిచి చెప్పే ప్రయత్నం చేసే  ప్రయత్నించాడు.

తరువాత నామినేషన్స్‌(Nominations) ప్రక్రియ మొదలైంది. హౌస్ మేట్స్(House mates)  తగిన కారణాలు చెప్తూ ఇద్దరు సభ్యుల ముఖం ఉన్న బాల్స్‌ ను బిగ్ బాస్ ఎగ్జిట్(Big Boss Exit)  గేటు బయటకు తన్నాలి. కమ్యూనిటీ పేరు తీయడం తప్పంటూ కెప్టెన్‌(Captain) షణ్ముఖ్‌ కాజల్‌ను నామినేట్‌ చేశాడు. అలాగే ప్రియాంకను నామినేట్‌ చేస్తూ ఆమె ఫేస్‌ ఉన్న బంతిని ఒక్క తన్ను తన్నాడు.

ప్రియాంక ఎవరిని నామినేట్‌ చేయాలో అర్థం కావట్లేదని టైం వృథా చేయగా బిగ్‌బాస్‌ నేరుగా నామినేట్ అవుతావని హెచ్చరించాడు.  దీంతో పింకీ సిరిని, కాజల్‌ను నామినేట్‌ చేసింది. శ్రీరామ్ నన్ను అగౌరవపర్చారంటూ(Dis Respect) మానస్‌, కాజల్‌ను నామినేట్‌ చేశాడు.

ఎమోషనల్‌గా కనెక్ట్‌(Emotional Connect) అవకుండా నీ గేమ్‌(Game) నువ్వు ఆడంటూ సిరి, పింకీ ఫేస్‌ ఉన్న బంతిని తన్ని నామినేట్ చేసింది. కమ్యూనిటీ (Community)అన్న పదం వాడటం తప్పంటూ కాజల్‌ను నామినేట్‌ చేసింది. ఇక  సన్నీ, మానస్‌లు  సిరి, శ్రీరామ్‌లను నామినేట్‌ చేశారు.

నేను కమ్యూనిటీ అన్న పదం తీయడం తప్పు తప్పు అని పదే పదే పాయింట్ చేస్తున్నారంటూ  కాజల్‌.. సిరి, ప్రియాంకను నామినేట్‌ చేసింది. మొత్తంగా ఈ వారం సిరి, మానస్‌, శ్రీరామ్‌, ప్రియాంక, కాజల్‌ నామినేట్‌(Nominate) అయినట్లు బిగ్‌బాస్‌(Big Boss) ప్రకటించాడు.