ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్(Music Director) జీవీ ప్రకాష్‌ కుమార్‌(GV Prakash Kumar)  తమిళ ‘డార్లింగ్‌’(Darling) చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.

తాజాగా జీవీ ప్రకాష్‌ కుమార్ నటిస్తోన్న చిత్రం ’13′(Movie 13). రీసెంట్ గా జీవీ ప్రకాష్‌ కుమార్, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌(Director Gautham Menon) కలిసి నటించిన ‘సెల్ఫీ'(Selfie) చిత్రం మంచి రెస్పాన్స్(Good Response) దక్కించుకుంది. మళ్లీ వీరిద్దరూ కలిసి ’13’ మూవీలో నటించడం విశేషం.

దీన్ని ఎస్‌. నందగోపాల్‌(S.Nandagopal) సమర్పణలో మద్రాస్‌ స్టూడియోస్(Madras Studios), అన్షు ప్రభాకర్‌ ఫిలిమ్స్‌ సంస్థ(Anshu Prabhakar Films Company)లు కలిసి నిర్మిస్తున్నాయి. నటి ఆదిత్య, భవ్య, ఐశ్వర్య నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వివేక్‌(Vivek) అనే నవ దర్శకుడు(New Director) పరిచయం(Introduced) కానున్నారు.

షూటింగ్‌ పూర్తి(Shooting Finish) చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మూవీ  గురించి జీవీ ప్రకాష్‌ కుమార్‌ మాట్లాడుతూ నిర్మాత నందకుమార్‌ ఫోన్‌ చేసి మంచి హారర్‌ కథ(Horror Story) ఉంది దర్శకుడు చెబుతారు వినమని చెప్పారన్నారు. తొలి చిత్రమే హర్రర్‌ నేపథ్యంలో డార్లింగ్‌ చేయడంతో కాస్త సందేహించానన్నారు.

అయితే కథ విన్న తర్వాత వెంటనే నటించడానికి ఓకే చెప్పానని, ఇది హర్రర్‌ నేపథ్యంలో సాగే విభిన్నమైన చిత్రమని చెప్పారు. చిత్ర  టైటిల్(Movie Title), ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌(First Look Poster)ను రెండు రోజుల క్రితం ఆవిష్కరించినట్లు వెల్లడించారు.