బిగ్ బాస్ 5 (Big boss 5) లో  హౌస్ మేట్స్ (House mates) ఎవరికీ వాళ్ళు తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించడానికి ఓ రేంజ్ లో  దూసుకుపోతున్నారు. ఒకరికి మించి ఒకరు ఎక్కడ తగ్గకుండా గొడవలు పడుతూ, వాదనలకు  దిగుతూ,  ఎవరికీ వాళ్ళు ఎమోషన్ అయ్యి ఏడవడం, తప్ప కాస్త ఎంటర్టైన్మెంట్ (Entertainment) కు స్కోప్ ఇవ్వడం లేదు హౌస్ మేట్స్ . ఇక నాలుగో రోజు ఎపిసోడ్  కూడా చాలా డల్ గా సాగింది.  ఆడియన్స్ (Audience) ను కూడా షో పెద్దగా ఆకట్టుకోవడం లేదని అనిపిస్తోంది.

ఇక నాలుగో రోజు వివరాల్లోకి వెళ్ళితే,

మానస్‌కు ఇచ్చిన టాస్క్‌ ప్రకారం, అర్ధరాత్రి ఎవరు నిద్ర లేచినా ముందు కాజల్‌ను లేపాల్సి ఉంటుంది. కానీ  లహరి, శ్రీరామచంద్ర, కాజల్ ను నిద్ర లేపకపోవడం వలన  అలారమ్‌ మోగడం తో హౌస్ మేట్స్(House mates) అందరికి నిద్ర భంగమైంది.  మరోపక్క షణ్నూకు సర్వీస్ చేయలేక విసిగిపోయిన  లోబో. వారు చేయిస్తున్న టాస్క్‌ లకు దండం పెట్టేశాడు. స్మోకింగ్‌ రూమ్‌లో తన ఫ్రస్టేషన్‌ను విశ్వ ముందు బయటపెట్టాడు. ఇలాంటి టాస్కులు చేయలేను అని నాకు ఇది సెట్ కాదని హ్యాపీ గా వెళ్లి తన  షాప్ చూసుకుంటాను అని  లోబో కాస్త అసహనం చూపించాడు. విశ్వ లోబో మాటలకూ ఇదంతా టాస్క్ అని కొంచం ఓపిక గా నడుచుకోవాలని సర్ది  చెప్పాడు.

తరువాత  కెప్టెన్సీ (Captaincy) కోసం పోటీపడుతున్న టాస్క్ (Task) లో ఈ సారి పవర్ బజ్ ని ప్రెస్ చేసి పవర్ రూమ్ లోకి వెళ్లిన హమీద. బిగ్ బాస్ ఆమెకు చాలా కఠినమైన టాస్కే  ఇచ్చాడు. తను  సెలెక్ట్ చేసుకునే కంటెస్టెంట్ (contestant), ఈ సీజన్ లో ఎప్పటికి కెప్టెన్(captain) కాలేరని చెప్పడం తో హమీద, ప్రియా పేరు ను ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని హౌస్ మేట్స్ (House mates) అందరి ముందు చెప్పగా అందరు షాక్ కి గురయ్యారు, ప్రియా కూడా షాక్ కు గురియైన వెంటనే టాస్క్ ని స్పోర్టివ్ (sportive) గా తీసుకుంది.

మరో వైపు రెస్ట్‌ రూమ్‌ క్లీన్‌ చేస్తున్న లోబో అక్కడికి వచ్చిన ప్రియాంక సింగ్‌ను చూసి తన పని ఆపేసి మరి, ఆమెను అలాగే  చూస్తూ ఐ లవ్‌యూ అంటూ ప్రపోజ్‌ చేసాడు.  అయితే ఆమె మాత్రం నీకు దమ్ముంటే మానస్‌ ఎదురుగా నాకు లైనేయ్‌ అని సవాలు చేయడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. ఇదే విషయాన్ని లోబో,  మానస్‌ దగ్గర ప్రస్తావించగా అతడు తేలికగా నవ్వేసి మధ్యలో నా అనుమతి అవసరం లేదని ఖరాకండి గా  చెప్పేసాడు . ఆ తర్వాత కంటెస్టెంట్లు లోబోను అమ్మాయిగా రెడీ చేసి కెమెరా ముందు కు వెళ్లి బిగ్ బాస్ (Big boss) కి ఐ లవ్‌యూ చెప్పించారు.

ఈ టాస్క్‌ లో అమ్మాయిలకు సపోర్ట్ చేయాలనుకున్న కాజల్ , విశ్వకు ఇమ్యూనిటీ అవసరం లేదంటూ అతడిని డిస్టర్బ్‌ చేయగా ఆటలో నుంచి విశ్వ బయటకు వచ్చేశాడు.  అయితే విశ్వను ఒక్కడినే ఎందుకు టార్గెట్‌ చేశావని సరయూ కాజల్‌ను నిలదీసింది. నేను అమ్మాయిలకే సపోర్ట్‌ చేస్తానని, విశ్వకు ముందే  డైరెక్ట్‌గా చెప్పానని క్లారిటీ ఇచ్చింది కాజల్‌. కాసేపటివరకు వీరి మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధమే నడిచిందని చెప్పవచ్చు. మొత్తానికి రసాభాసగా సాగిన ఈ టాస్క్‌ లో సిరి గెలుపొంది హౌస్‌కు తొలి కెప్టెన్‌గా ఎంపికైంది.  బిగ్ బాస్(Big boss) ఆదేశానుసారం సిరి కి ప్రియ కెప్టెన్‌ బాండ్‌ తొడిగింది. తరువాత  సిరి, విశ్వను రేషన్‌ మేనేజర్‌గా ఎంపిక చేసింది.

ఇక కిచెన్‌లో పనులు పంచుకునే దగ్గర మరోసారి గొడవ మొదలైంది.  నాన్‌వెజ్‌ వండలేను, ఎవరైనా నాన్‌వెజ్‌ వండితే ఆ గిన్నెలను శుభ్రం చేయను అని ఉమాదేవి తేల్చి చెప్పింది. మార్నింగ్‌ వెజ్‌ వండేందుకు ప్రియాంక సింగ్‌ ఉందని లహరి చెప్పగా దాన్ని ఉమాదేవి తప్పుగా అర్థం చేసుకుంది. అంటే వెజ్‌ వండటానికి నేను పనికి రానని అంటున్నారంటూ, కొత్త వాదన కు శ్రీకారం చుట్టింది. దీంతో ఇర్రిటేట్ అయినా లహరి.. ఆమె అరిస్తే పడాలా? అని నిలదీసింది. దీంతో జోక్యం చేసుకున్న కెప్టెన్‌ లహరి ‘పనికి రాదు’ అనే పదం వాడలేదని ఉమాదేవికి గట్టిగానే క్లారిటీ ఇవ్వడంతో ఈ గొడవ సర్దుమణిగింది. ఇప్పుడే ఈ రేంజ్‌లో గొడవ పడితే రేపటి నుంచి కెప్టెన్‌ సిరికి హౌస్ మేట్స్  చుక్కలు చూపిస్తారో లేదా సిరి వాళ్ళను మేనేజ్ చేయగల సత్తా ఉందొ చూడాలి. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 5 (Bigboss5) తొలి వారం కెప్టెన్(Captain) గా సిరి ఎంపికైంది.

రేపటి నుండి తన కెప్టెన్సీ లో హౌస్ మేట్స్ (House mates ) గొడవలు తగ్గించి ఎంటర్టైన్మెంట్(Entertainment) దిశ గా వెళ్తారో లేదో, ఈ రోజు ఎపిసోడ్ అయితే మాత్రం చాలా బోర్ గానే ముగిసిందని చెప్పాలి.రేపటి ఎపిసోడ్  ఎలా ఉంటుందో? ఎదురుచూడాల్సిందే.