తెలంగాణ(Telangana) జ్యుడీషియల్‌(Judicial) మినిస్టీరియల్‌(Ministerial) సర్వీసు(Service)లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్(Direct Recruitment) ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ప్రాసెస్‌ సర్వర్‌(Process Server) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్(Notification) రిలీజ్(Release) చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 163 ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి.

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు (Online Application)  జనవరి 11(January 11th)న మొదలు కానున్నాయి. దరఖాస్తుల(Application)కు చివరితేది(Last Date) జనవరి ౩o (January 30th)గా నిర్ణయించారు. పూర్తి వివరాలు(Full details) కింద పొందుపరిచి వుంది.

 ముఖ్య సమాచారం:

అర్హత: 10వ తరగతి(10TH Class) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాల(Professional Skills)ను పేర్కొనడంతో పాటు స్థానిక భాషలు(Local Language) తెలిసి ఉండాలి.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు(Exception) ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.22,900-రూ.69,150 జీతం(Salary) చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: సీబీటీ/ ఓఎమ్మార్‌ పరీక్ష(45 మార్కులు), ఇంటర్వ్యూ(Interview)(5 మార్కులు) తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రశ్న పత్రం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(CBT)/ ఓమ్మార్‌(OMR) పరీక్షలో 45 ప్రశ్నలుంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌(GK) విభాగంలో 35, జనరల్‌ ఇంగ్లిష్‌(General English) విభాగంలో 15 ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

దరఖాస్తు ఫీజు: ఓసీ(OC)/ ఓబీసీ(OBC) అభ్యర్థుల(Candidates)కు రూ.600 (ఎస్సీ(SC), ఎస్టీ(ST), ఈడబ్ల్యూఎస్‌(EWS) అభ్యర్థులకు రూ.400).

ప్రాసెస్‌ సర్వర్‌: 163 పోస్టులు

జిల్లాల వారీగా ఖాళీలు:

భద్రాద్రి కొత్తగూడెం- 4

సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్- 15

సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్, హైదరాబాద్- 2

హనుమకొండ – 5

జోగులాంబ గద్వాల- 5

జగిత్యాల- 5

జనగామ – 4

జయశంకర్ భూపాలపల్లి- 3

కుమ్రం భీం ఆసిఫాబాద్ – 3

మహబూబాబాద్ – 1

మహబూబ్ నగర్ – 8

మంచిర్యాల- 2

మెదక్ – 1

మేడ్చల్-మల్కాజిగిరి- 18

మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్, హైదరాబాద్- 4

ములుగు- 3

నాగర్ కర్నూలు – 7

నల్గొండ – 3

నారాయణపేట- 4

నిజామాబాద్ – 2

పెద్దపల్లి- 2

రాజన్న సిరిసిల్ల – 3

రంగారెడ్డి- 27

సిద్దిపేట – 5

సూర్యాపేట- 7

వికారాబాద్ – 6

వనపర్తి – 6

వరంగల్ – 5

యాదాద్రి భువనగిరి – 3