బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season5) టికెట్ టూ ఫినాలే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో భాగంగా రెండో దశలో జరిగిన 29 నిమిషాలు లెక్కపెట్టాల్సిన ఛాలెంజ్‌(Challenge)లో మానస్‌ మొదటి స్థానాన్ని గెలిచాడు. షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, ప్రియాంక, కాజల్‌, సన్నీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మానస్‌ హెల్ప్  చేసినా సన్నీ ఓడిపోవడంతో హౌస్‌మేట్స్‌(House Mates) అతడి పై సెట్టైర్ వేశారు. ఇక ఎప్పటిలాగానే  సిరి హగ్గివ్వంటూ షణ్నును అడిగింది.

ఇంతకీ టాప్ 5 లో నిలిచే  మొదటి  ఫైనలిస్ట్(Finalist) ఎవరో? ఏ కంటెస్టెంట్(Contestant) సొంతం చేసుకోనున్నాడో? గురువారం నాటి 89 వ ఎపిసోడ్ హై లైట్స్ చూద్దాం.

దీంతో షన్ను కాస్త ఇబ్బందిపడుతూనే ఫ్రెండ్‌షిప్‌ హగ్‌ అని కెమెరా(Camera)ల వంక చూడగా నన్ను బాగా చూసుకుంటున్నాడు, మరి హగ్గివ్వకపోతే ఎలా అంటూ అతడిని హాగ్(Hug) చేసుకుంది సిరి. మా అమ్మకు ఇప్పుడు అర్థమవుతుందని తనలో తానే అనుకుంది సిరి. అయితే వీళ్ల హగ్గులును చూస్తున్న పింకీ తనకు కూడా ఓ హగ్గివ్వమని షన్ను ని అడిగింది కానీ అతడు మాత్రం ఇవ్వలేదు.

ఆ తరువాత  షణ్ను, కాజల్‌ మధ్య వాగ్వాదం(Argument) జరిగింది. నిజంగా నాది తప్పైతే నీకంటే ముందే వెళ్లిపోతా అని కాజల్‌తో అంటాడు చేశాడు షణ్ను. నువ్వెప్పుడూ నేను తప్పు అని ప్రూవ్‌ చేయడానికి ట్రై చేస్తావని కాజల్‌ మండిపడింది. ఈ క్రమంలో షణ్ను నీ బొంద, కామన్‌సెన్స్‌ (Common sense)అంటూ కాజల్ ని రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. కాజల్ కూడా తగ్గేదెలా అన్నట్టు షన్ను తో ఆర్గ్యుమెంట్ కి దిగింది.

ఆ తరువాత మూడో దశలో కంటెస్టెంట్స్(Contestants) కి  స్కిల్‌ ఛాలెంజ్‌(Skill Challenge) ఇచ్చారు బిగ్ బాస్(Big Boss). ఇందులో భాగంగా ఏటవాలుగా ఉన్న స్టాండ్‌లో నీళ్లు పోసి అందులోని జార్స్‌ లో ఉన్న బాల్స్‌ కింద పడేలా చేయాలి. ఎవరైతే అన్ని బాల్స్‌ ముందుగా కిందపడేలా చేస్తారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. ఐస్‌ టాస్క్‌(Ice Task) వల్ల ఇప్పటికీ నిలబడి నడవలేకపోతున్న కారణంగా వాళ్ళ తరపున ఇతర కంటెస్టెంట్స్ ఆట ఆడే ఛాన్స్(Chance) ఇచ్చిన బిగ్ బాస్. అయితే అప్పటివరకు కాలు నొప్పితో ఇబ్బంది పడుతున్న సిరి టాస్క్ అనగానే తన ఆట తానే ఆడుతానని ముందుకు వచ్చింది. కంటెస్టెంట్స్ అందరు వద్దు అన్న కూడా సిరి తానే ఆడతనాన్ని చెప్పుకొచ్చింది.

దీంతో బిగ్ బాస్(Big Boss) ఆమె తో టాస్క్ ఆడించాడనికి కుదరదని చెప్పడంతో  శ్రీరామ్‌, సిరిల స్థానంలో సన్నీ, షణ్ను టాస్క్ ఆడారు. ఇక ఈ ఆట లో మానస్‌, శ్రీరామ్‌, సిరి, ప్రియాంక, కాజల్‌, సన్నీ, షణ్ముఖ్‌ వరుసగా ఏడు స్థానాల్లో(Places) నిలిచారు.

మొత్తంగా టికెట్‌ టు ఫినాలే(Ticket to Finale) టాస్క్‌ లో మూడు ఛాలెంజ్‌(Challenge)లు పూర్తయ్యే సరికి అందరికంటే  తక్కువ పాయింట్లు తో నిలిచినా కాజల్‌, ప్రియాంకలను రేసు(Race) నుంచి తప్పుకున్నట్లు బిగ్‌బాస్‌(Big Boss) ప్రకటించారు. సన్నీ, షణ్ముఖ్‌లిద్దరికీ సమాన పాయింట్లు రావడంతో వీరికి మళ్లీ గేమ్‌(Game) పెట్టగా ఇందులో సన్నీ గెలిచి తర్వాతి రౌండ్‌(Next Round)కు అర్హత సాధించాడు. షణ్ను కూడా రేసు నుంచి అవుట్ అయ్యాడు.

ఇక రేపటి ఎపిసోడ్‌ ప్రోమో(Promo) లో మానస్‌, సన్నీ, శ్రీరామ్‌, షణ్ను, సిరిలకు చివరి పోటీ పెట్టినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కాజల్ అందరిని డిస్టర్బ్ చేస్తూ కనిపించింది. దింతో శ్రీరామ్, సన్నీ, కాజలో తో గొడవ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

మరి ఈ టాస్క్లో ఎవరు గెలిచి ఫినాలే(Finale)లో మొదట ఫైనలిస్ట్(First Finalist) గా  అడుగు పెడతారో రేపటి ఎపిసోడ్‌(Episode) కోసం వెయిట్ చేయాల్సిందే.