మనకు ఇంత వరకు సమాచార వ్యవస్థలో ఒకరితో ఒకరు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడటం లేదా దూరవాణి (ఫోను) లో మాట్లాడటం వరకే తెలుసు. ఇంకో మెట్టు పైకెళితే webcam ద్వారా ఇక్కడ ఉన్న వారైనా చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోతున్న సాంకేతికత విజ్ఞ్యానం ద్వారా ఒక మాయా ప్రపంచం సృష్టింపబడుతుంది. అదేంటో ఇక్కడ వీడియో లో చూడండి.

ఇది ఎలా పని చేస్తుంది అంటే, ఒక ప్రత్యేకమైన కెమెరాలు ఉంచిన ఈ గదిలో వక్తను అన్ని కోణాల్లోంచీ వీడియో తీసి దాన్ని ఒక 3D మోడల్ గా తయారు చేసి ఆ data ను ఎక్కడికైనా పంపించవచ్చు. ఇక అవతలి గదిలో ప్రత్యేకమైన కెమెరాల ముందు ఉన్న వ్యక్తి లేదా పాప ను వక్త చూస్తూ మాట్లాడవచ్చు కానీ ఆ పాప ఆ వక్తను చూడలేదు. అదే hololens పెట్టుకున్నప్పుడు ఎక్కడో ఉన్న ఆ పాప తన కళ్ళ ముందుకు వచ్చినట్టు ఉంటుంది. అదే ఇద్దరూ ఒకరితో ఒకరు పైన చూపిన విధంగా చేయి కలపాలంటే ఆ ప్రత్యేకమైన గదుల్లో ఇద్దరూ hololens పెట్టుకుంటే ఇద్దరికీ, ఇద్దరూ ఒకే గదిలో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇద్దరూ చేయి కలపిన అనుభూతి కూడా వస్తుంది. అంతే కాదు ఈ సంభాషణను రికార్డు చేసుకుని తిరిగి చూసుకునే వీలు కూడా ఉంది. అంతే కాదు ఆ వీడియో ను ఒక miniature సైజులో కూడా చూసుకునే వీలు ఉండటం విశేషం.

ఇది ఒక వినూత్నమైన పద్ధతి అని చెప్పచ్చు. భవిష్యత్తులో దీనిని ఆధారం చేసుకుని మన సమాచార వ్యవస్థ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. దీని ద్వారా ఖండాంతరాల్లో ఉన్న వారైన తమ వారిని అచ్చం ఎదురు నిలబడి మాట్లాడిన అనుభూతి కలగక మానదు కదూ.