Photo అంటే గతంలో ఒక ప్రత్యేకమైన పరికరం అంటే, కెమెరా మన చేతిలో ఉంటేనే వచ్చేది. కానీ ఇప్పుడు డిజిటల్ కెమెరాలను సవాల్ చేస్తూ మన నిత్య ఆయుధం సెల్ ఫోన్ లో కూడా ఎంతో క్లారిటీ తో ఫోటోలు తీయగలుగుతున్నాము. అంతేనా ఫోటోలు, వీడియోలు వాటిని భద్రపరచడానికి ఎంతో మెమరీ, అలాగే అప్పటికప్పుడు వాటిని కోల్పోకుండా గూగుల్ వంటి డ్రైవ్ లలో upload చేయడం ఇవన్నీ సులువుగా జరిగిపోతున్నాయి. దీన్ని కూడా కాదని ఇంతకు మించి మరింత సులువుగా, మరే పరికరo అవసరం లేకుండా కేవలం మన రెప్ప పాటుకే photoలు, వీడియో లు తీయగలిగితే? అసాధ్యం అని అప్పుడే నిర్ణయించేయకండి. త్వరలోనే సాధ్యం కాబోతోంది.
Sony సంస్థ 2014 లోనే కేవలం మన రెప్ప పారు ద్వారా photoలు, వీడియోలు తీసే విధంగా ఒక కాంటాక్ట్ లెన్స్ ను తయారు చేసింది. అంతే కాదు ఈ ప్రత్యేకమైన స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ యొక్క పేటెంట్ హక్కుల కోసం 2014 లోనే అమెరికా లో పేటెంట్ అప్లై చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ పేటెంట్ పెండింగ్ లో ఉంది. Sony ఒక్కటే కాదు, Samsung, Google వంటి సంస్థలు కూడా తమ సంస్థలు రూపొందించిన ఇటువంటి ఒక కాంటాక్ట్ లెన్స్ ద్వారా ఫోటోలు వీడియోలు తీసే విధానాన్ని పేటెంట్ చేసే పనిలో ఉన్నాయి. మిగతా వాటి సంగతెలా ఉన్నా Sony కాంటాక్ట్ లెన్స్ ఎలా ఉంటుందో ఇక్కడ వీడియో లో చూడచ్చు.
కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్న కంటి రెప్పను కొద్ది సెకన్ల పాటు మూసి ఉంచితే చాలు, photo తీస్తుంది. అలాగే వీడియో రికార్డింగ్ కూడా చేస్తుంది. ఈ ప్రక్రియ ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కొంత మంది ఇటువంటి విధానాల ద్వారా వ్యక్తిగత భద్రత (privacy) దెబ్బ తింటుందని అంటున్నారు. ఏమో మరి అమెరికా దీనిని గూర్చి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.