ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) గురుకుల పాఠశాలల్లో 2021-22 విద్యాసంవత్సరానికి 5వ తరగతి (ఇంగ్లిష్ మీడియం- ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ సిలబస్)లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం.. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు కొంత ఎత్తివేయడంతో పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. అర్హత పరీక్షలు అన్నింటినీ జులై నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది.

ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 38 సాధారణ మరియు 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి గురుకుల సంస్థ కార్యదర్శి ఎంఆర్ ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

అర్హతలు

2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యార్థి 4వ తరగతి చదువుతుండాలి.

గురుకుల పాఠశాల ల్లో ప్రవేశాలు కోసం దరఖాస్తు (Application) చేసుకునే విద్యార్థులు ఆయా జిల్లాల్లో 2019–20, 2020–21 విద్యాసంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో 3, 4 తరగతులు చదివి ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినా ఈ  గురుకులాల్లో ప్రవేశానికి (Entry)అర్హులే.

ఓసీ, బీసీ కి చెందిన వారు మాత్రం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోనే చదవి ఉండాలి.

వయసు

సెప్టెంబర్ 1 ,2021 నాటికి జనరల్, బీసీ (General,BC)విద్యార్థులకు 9-11 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేళ్ల వయో సడలింపు ఉంటుంది. బీసీ ,ఓసీ లకు చెందిన అభ్యర్థులు సెప్టెంబర్ 1,2010  నుంచి ఆగస్టు 31,2012  మధ్య పుట్టిన వారై ఉండాలి.

ఎస్సీ, ఎస్టీకి  (SC,ST)చెందిన  విద్యార్థులు సెప్టెంబర్ 1, 2008  నుంచి ఆగస్టు 31, 2012  మధ్య పుట్టి ఉండాలి. గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం  ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల్లోని అన్ని వర్గాల విద్యార్థులు అర్హులు.

ఆదాయ పరిమితి 

2020-21 ఆర్థిక సంవత్సరంలో విద్యార్థుల తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,00,000; పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 మించరాదు. సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయ పరిమితి నిబంధన వర్తించదు.

ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం కాగా.. తొలుత జూన్‌ 30, 2021 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

తాజాగా దరఖాస్తు గడువు తేదీని పొడిగించారు. ఆసక్తిగల విద్యార్థులు జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు https://aprs.apcfss.in/ లేదా https://apgpcet.apcfss.in/ ఈ రెండు వెబ్ సైట్‌ల లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

సాధారణం గా ఈ పాఠశాలలో ప్రవేశానికి విద్యార్థి ప్రతిభ, రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత ఈ సారి ,రాత పరీక్ష విధానం కాకుండా , జిల్లాల వారీగా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేస్తారు.

విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.

గతేడాది పరీక్షలు నిర్వహించడంలో జాప్యం (late)కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఆలస్యమైంది.

ఈ సంవత్సరం మాత్రం అలాంటి జాప్యం లేకుండా వీలైనంత త్వరగా  ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేలా సొసైటీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.

ఇక ఆలస్యం చేయకుండా ఈ విషయం ని 4 వ తరగతి విద్యార్థులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి మరి..