విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకుని, తన నటనా చాతుర్యం తో  ప్రతి సినిమాతో నటుడిగా తనని తాను నిరూపించుకుని ఒక్కో మెట్టు ఎక్కుతున్న యువ తరం  హీరో సత్య.

హీరో పక్కన చిన్న చిన్న పాత్రలతో తన కెరీర్ ని మొదలుపెట్టి.. ఆ తర్వాత కాస్త గుర్తింపున్న (Character roles)క్యారెక్టర్ రోల్స్ చేసి.. అటు పై హీరోగా మారి మంచి అవకాశాలు అందుకుంటున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ (Back ground)లేకుండా కేవలం తన ప్రతిభతో అవకాశాలు అందుకున్న అతి కొద్దిమందిలో సత్య ఒకడు .

మంచి ప్రాజెక్టులతో బిజీగా

ప్రస్తుతం సత్యదేవ్ తిమ్మరసు, గాడ్సే, స్కైలాబ్ లాంటి మంచి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ భారీ హిందీ చిత్రంలోనూ నటిస్తున్నట్లు ఇంతకుముదు వార్తలొచ్చాయి. ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆ చిత్రమే.. రామ్ సేతు. ఇంతకుముందే ‘బుడ్డా హోగా తేరా బాప్’లో ఒక చిన్న పాత్ర చేసిన సత్యదేవ్.. ప్రస్తుతం ‘రామ్ సేతు’లో మంచి రోలే ప్లే చేస్తున్నట్లుగా వార్తలు . అయితే దీనిపై ఇప్పటిదాకా అధికారిక సమాచారం లేదు.

‘రామ్ సేతు’లో

ఐతే తాను ‘రామ్ సేతు’ (Ram Setu) లో నటిస్తున్న విషయాన్ని ఇపుడు సత్యదేవ్ స్వయంగా ధ్రువీకరించాడు.

Ramset

మొన్న ఆదివారం సత్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘రామ్ సేతు’లో తాను నటిస్తున్నానని తెలిపారు .. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌కు హాజరవబోతున్నానని కూడా అతను వెల్లడించాడు.

తమన్నాతో ‘గుర్తుందా శీతాకాలం’

తమన్నా లాంటి స్టార్ హీరోయిన్‌తో కూడా  అతను ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ.. సత్యదేవ్‌ తాజా సినిమాను సమర్పిస్తుండటం విశేషం.

GurtndaSeethakalam

అయితే తమన్నాతో చేస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ నాకు చాలా స్పెషల్. నేను నటుడిగా అరంగేట్రం చేయడానికి అంటే ముందే ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ . ఈ రోజు ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నానంటే నాకు లైఫ్ లో ఏదో సాధించాననిపిస్తోంది. ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నేను మూడు రకాల గెటప్పుల్లో కనిపిస్తాను . ఈ సినిమా షూటింగ్ ఇంకో కేవలం పది రోజులే మిగిలుంది.

మరో చిత్రం ,

గాడ్సే (Godse) అనేది టైటిల్.

Godse

దీనిలో గన్  చేతపట్టి గుబురు గడ్డంతో సత్య కాస్త రఫ్ గా రౌడీలా కనిపిస్తున్నాడు. పలాస తరహాలో ఒక  డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారనే అర్థమవుతోంది. ఎంతో ఆసక్తికరంగా ఈ మూవీ స్క్రిప్ట్ బాగా ఆకట్టుకోవడంతో కొరటాల శివ సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం లో సత్య దేవ్ విజయవాడకు చెందిన యువకుడిగా నటిస్తున్నారని  ఈ రస్టిక్ డ్రామాను విజయవాడ పరిసరాల్లో నే చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ లో కృష్ణ కొమ్మలపతి ఈ నిర్మిస్తున్నారు. సంగీతం కాల భైరవ అందిస్తుండగా.. నవీన్ నూలి ఇంకా తదితర సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు.

నా  ఈ సినిమాలన్నీ “ఈ ఏడాది వ్యవధిలో రిలీజవుతాయి” అని సత్యదేవ్ తెలిపాడు.

ఏది ఏమైనా వరుస చిత్రాల తో మన సత్యదేవ్ చాలా బిజీ అయిపోతున్నాడు ..చూద్దాం ఈ మూవీస్ లో ఏది మంచి హిట్ (Hit) ఇస్తుందో…

టాలెంట్ ,కష్టం తో వచ్చే ప్రతీ హీరో ని ప్రేక్షకులు ఎప్పుడూ ప్రోత్సహిస్తారు …  ఆల్ ది  బెస్ట్ (All the best)సత్యదేవ్ !!