చుండ్రు(Dandruff) చెప్పుకోవడానికి పెద్ద సమస్య కాకపోవచ్చు? కానీ కంపరం పుట్టిస్తుంది. చుండ్రుతో బాధపడుతున్నప్పుడు తలంతా ఒక్కటే జిడ్డుగా ఉండి చిరాకు(Irritation) పుడుతుంది. రోజు స్నానం చేస్తున్న, షాంపూలు వాడుతున్న చుండ్రు ఒక పట్టాన తగ్గకుండా చాలా మందిని వేధిస్తుంది.

వాస్తవానికి చుండ్రు అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్(Fungal Infection). ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గేలా ఉపశమన చర్యలు తీసుకుంటే చుండ్రు చాలా వరకు తగ్గిపోతుందని చెప్తారు నిపుణులు(Experts).

చుండ్రును వదిలించుకునే మార్గాల గురించి తెలుసుకుందాం!

ఇతరుల దువ్వెనల(Comb)ను, హెయిర్‌ బ్రష్‌ల(Hair brush)ను, తువ్వాళ్ళ(Towels)ను వాడకూడదు. తమ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు.

అంతే కాదు ప్రకటనలలో చూపించారు కదా అని గాఢమైన రసాయనాలు కలిసిన హెయిర్‌ ఆయిల్స్‌(Hair Oils) ను, షాంపూల(Shampoos)ను ఇష్టం వచ్చినట్లు వాడటం కూడా తలపై ఈస్ట్‌(Yeast) పెరిగేందుకు అవకాశం కలిగిస్తుంది. అలాగే మాసిపోయిన దుప్పట్లను, తలగడలను వాడటం, దుమ్ము, ధూళి పడే ప్రదేశంలో పని చేయడం, పోషకాహారం తీసుకోకపోవడం, మానసిక ఆందోళన(Mental STRESS), కొన్ని రకాల మందులను వాడటం చుండ్రుకు దారి తీసే కారణాలలో ప్రధానమైనవి.

చుండ్రు తగ్గడానికి కొన్ని  ఇంటి చిట్కాలు

పెరుగు(Curd)లో ప్రొబ‌యోటిక్స్(Probiotics) ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే ఇది చుండ్రు(Dandruff)ను నివారించ‌డం(Control)లో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందుకోసం చ‌క్క‌ గా త‌ల‌స్నానం చేసిన త‌ర్వాత త‌ల‌కు పెరుగు ప‌ట్టించి ప‌దిహేను నిమిషాలు అలాగే ఉంచాలి.

ఆ త‌ర్వాత క‌డుక్కొని మ‌రోసారి మైల్డ్ షాంపూతో త‌ల‌స్నానం చేస్తే స‌రిపోతుంది. కొబ్బ‌రి నూనె త‌ల‌కు మృదుత్వాన్ని అందించి చుండ్రు పెర‌గ‌డాన్ని అరిక‌డుతుంది. ఇందుకోసం త‌ల‌స్నానానికి గంట ముందు కొబ్బ‌రినూనె(Coconut Oil) పెట్టుకొని మ‌సాజ్(Massage) చేసుకోవాలి.

ఆ త‌ర్వాత త‌క్కువ గాఢ‌త ఉన్న షాంపూతో త‌ల‌స్నానం చేస్తే స‌రి. బేకింగ్ సోడా కూడా త‌ల‌కు ప‌ట్టిస్తే చుండ్రుపై మంచి ప్రభావాన్నే చూపుతుంది. దీనికోసం బేకింగ్ సోడా(Baking Soda)ని మాత్రమే త‌ల‌కు ప‌ట్టించ‌వ‌చ్చు. లేదా ఇత‌ర ప‌దార్థాల్లో క‌లిపి కూడా పెట్టుకోవ‌చ్చు.

చేయాల్సింద‌ల్లా త‌ల‌ను బాగా త‌డిపి.. దానికి బేకింగ్ సోడా ప‌ట్టించి ప‌దినిమిషాల త‌ర్వాత క‌డిగేయ‌డ‌మే. ఇలా చేయ‌గానే జుట్టు కాస్త పొడిబారిన‌ట్లుగా క‌నిపించినా.. కొన్ని రోజుల్లోనే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది. క‌ల‌బంద‌ను మ‌న చ‌ర్మ సంర‌క్షణ‌కు ఉప‌యోగించ‌డం గురించి మ‌న‌కు తెలిసిందే.

ఇందులోని యాంటీబ్యాక్టీరియ‌ల్‌(Anti-Bacterial), యాంటీఫంగ‌ల్(Anti-Fungal) గుణాలు జుట్టును చుండ్రు బారిన ప‌డ‌కుండా కాపాడతాయి. ఇందుకోసం క‌లబంద గుజ్జు(Aloevera Gel)ను మాడుకు రుద్దాలి. ఆపై పావుగంట అలాగే ఉంచి గాఢ‌త త‌క్కువ‌గా ఉన్న షాంపూతో త‌ల‌స్నానం చేస్తే స‌రి.

వెల్లుల్లి(Garlic) కూడా చుండ్రును త‌గ్గించేందుకు చాలా బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం వెల్లుల్లిని మెత్తని పేస్ట్ చేసి త‌ల‌కు ప‌ట్టించి పావుగంట పాటు అలాగే ఉంచాలి. వెల్లుల్లి వాస‌న భ‌రించ‌లేక‌పోతే అందులో కాస్త తేనె క‌లిపి పెట్టుకోవ‌చ్చు.

నిమ్మకాయ‌(Lemon)లోని ఆమ్ల(Amla) గుణాలు త‌ల‌లోని చ‌ర్మపు పీహెచ్‌(VH)ని బ్యాల‌న్స్(Balance) చేసి చుండ్రును త‌గ్గిస్తాయి. ఇందుకోసం మూడు టేబుల్ స్పూన్ల నిమ్మర‌సం తీసుకొని దాన్ని త‌ల‌కు ప‌ట్టించి మ‌సాజ్ చేసుకోవాలి. త‌ర్వాత గాఢ‌త త‌క్కువ‌గా ఉన్న షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.

త‌ల‌స్నానం త‌ర్వాత కండిష‌న‌ర్(Conditioner) మాత్రం వాడ‌కూడ‌దు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే స‌రి. చుండ్రు స‌మ‌స్య త‌గ్గిపోతుంది. మెంతు(Fenugreek seeds)ల్లో కొన్ని రకాల మిన‌రల్స్‌(Minerals), విట‌మిన్స్(Vitamins) ఉంటాయి. ఇవి చుండ్రును త‌గ్గించ‌డంలో ఎంత‌గానో తోడ్పడ‌తాయి.

ఇందుకోసం మెంతుల‌ను బాగా మిక్సీ ప‌ట్టుకొని వేడి నీళ్లలో రాత్రంతా నాన‌బెట్టుకోవాలి. ఉద‌యాన్నే దీన్ని త‌ల‌కు ప‌ట్టించి కాసేప‌య్యాక త‌ల‌స్నానం చేస్తే స‌రిపోతుంది.

ఆహారం(Food)లోని, జీవన శైలి(Life Style)తోనూ తగిన మార్పులు చేసుకోవడం అవసరం వరకు మెడికేటెడ్ షాంపూలు(Medicated Shampoos) వాడుకోవడం ద్వారా వేధించే చుండ్రు (Dandruff)బాధ నుంచి బయటపడచు.