మనం చురుకుగా, ఉత్సాహంగా పని చేయాలంటే మన మెదడుతో పాటు శరీరమంతా ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా పొట్టలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు.అందుకే మన పొట్టను రెండో మెదడుగా అభివర్ణిస్తుంటారు వైద్య నిపుణులు(Doctor Expert).

జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఏవైనా సమస్యలు వున్నవారు ఆహారం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అల్సరేటివ్ కోలిటిస్(Ulcerative colitis) కారణంగా పొత్తి కడుపు నొప్పి(Stomach Pain) వున్నపుడు ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం!

జీర్ణ వ్యవస్థ(Digestive System)లో వాపు, పుండ్లు లాంటి సమస్యలుంటే పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. ఈ తరహా వ్యాధిని అల్సరేటివ్ కోలిటిస్  అంటారు. ప్రేగ్గు(Intestine)ల్లో వాపు(Swelling), పుండల్ను(Wounds) కలిగించే ఇన్ఫలమ్మటరీ బౌల్ డిసీజెస్(IB DISEASES) లో ఇది కూడా  ఒకటి. పొత్తి కడుపులో నొప్పి రక్త విరేచనాలు, అలసట, బరువు తగ్గిపోవడం లాంటి సమస్యలు ఉంటాయి.

దీర్ఘకాలిక రక్తలేమి(Chronicle Anemia) వున్నపుడు ఐరన్ సప్లిమెంటరీ(Iron Supplementary) వాడాల్సివుంటుంది. కొవ్వులేని మాంసాహారం(Fatless Meat), సి ఫుడ్(Sea Food), ఎండు ద్రాక్ష(Raisins), తృణ ధ్యాన్యాలు(Millets), గుడ్డు(Egg) లాంటి బలవద్దకమైన ఆహారాలు తీసుకోవాలి.

ఘనాహారాలు తీసుకోలేకపోతే జావలు(Soups), పళ్ల(Fruits)తో తయారు చేసిన స్మూతీలు(Smoothies) వంటివి తాగడం మంచిది. అల్సరేటివ్ కోలిటిస్ వలన శరీరంలో నీరు తగ్గిపోతుంది(Reduce Water). కనుక మంచినీళ్లు సైతం ఎక్కువ తాగాలి.

ఈ వ్యాధిలో ఎముకలు(Bones weakness) బలహీనమవుతాయి కనుక కాల్షియమ్(Calcium), విటమిన్ ఈ(Vitamin E) లతో సంవృద్ధి పరిచిన ఆహారాలు తినడం మంచిది. అల్సరేటివ్ కోలిటిస్ వలన అజీర్తి సమస్యలను ఎదురుకుంటున్న వారు మంచి బాక్టీరియా వున్నా ఆహారాలను ముఖ్యంగా పెరుగును తినాలి. ఈ సమస్య వున్నప్పుడు పీచు వున్నా పదార్దాలు,పళ్ళు ,కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు వంటివి సరిపడకపోతే వాటిని కొంత కాలం పాటు మానేయడం మంచిది.

బ్రోకలీ(Broccoli), కాలిఫ్లవర్(Cauliflower), బీన్స్(Beans) వంటివి గ్యాస్ను కలిగిస్తాయి జీర్ణం కావడం కష్టం అయితే వీటిలో పోషకాలు ఎక్కువ కనుక బాగా ఉడికించుకునే ప్రయత్నం చేయాలి. అల్సరేటివ్  కోలిటిస్  వున్నపుడు జీర్ణ వ్యవస్థకు శ్రమ తగ్గించాలంటే తక్కువ మొత్తంలో ఎక్కువ శాతం ఆహారం తీసుకోవటం మంచిది దీని వలన నొప్పి తగ్గడం తో పాటు శరీరానికి పోషకాలు స్థిరంగా అందుతాయి.

మసాలాలు, కొవ్వుతో కూడిన ఆహారాలు, కెఫిన్(Caffeine) వున్నా పానీయాలు(Drinks) వలన సంశయాలు తలెత్తే అవకాశం వుంది. వీటిని కొద్దిగా తీసుకుంటూ ఎలాంటి ప్రభావం(Influence) చూపుతున్నాయి పరిశీలించుకోవాలి. తినడానికి ఏమి లేవు అనుకునే బదులుగా ఉన్నవాటినే ఇష్టంగా మార్చుకుని తినాలి పోషకార నిపుణుల(Nutrient Experts)ను సంప్రదిస్తే బాధితులకు లోపమున్న పోషకాలు అందేలా మంచి సలహాలు ఇవ్వగలరు. అల్సరేటివ్ కోలిటిస్  సమస్యతో బాధపడుతున్న వారు తాము తీసుకుంటున్న ఆహార విషయంలో శ్రద్ధగా ఉండాలి.

కొన్ని సందర్భాలలో వీరికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఒక ఆకుకూర తీసుకున్నపుడు తమ బాధలు పెరిగితే ఇక ఆ ఆకుకూరలే ముట్టుకోకూడదు అనిపిస్తుంది. అందుకే ఈ సమస్య పై బాధపడుతున్న వారు ఆహార విషయంలో తీసుకునే నిర్ణయాలు మరి తీవ్రంగా ఉండకుండా చూసుకోవాలి.అన్ని రకాల పోషకాల(Types Nutrients)తో సమతుల్య ఆహారం తీసుకోవాలి.