జీర్ణ వ్యవస్థలో ఏ భాగంలో సమస్య వున్న అజీర్తి తో మొదలుపెట్టి కడుపునొప్పి, విరోచనాలు మలబద్దకం, జ్వరం లాంటి అనేక బాధలు కనుపడుతుంటాయి. ఈ సమస్యలు చూడగానే మనకు క్రొహ్న్స్ వ్యాధి (Crohn’s disease)  అని తెలుస్తుంది .

ఈ క్రొహ్న్స్ వ్యాధి గురించి పూర్తి సమాచారం మీ కోసం.

శరీరంలో ఏ భాగమైన వొరుసుకుపోయినట్లుగా ఎర్రబారి, వాపు, మంట రావడాన్ని ఇన్ఫ్లమేషన్  అంటారు. నోరు, అన్నవాహిక, జీర్ణ వ్యవస్థ మొదలుకుని మలద్వారా వరకు ఎక్కడైనా ఇలాంటి లక్షణాలతో కనిపించే అనారోగ్యాన్ని క్రొహ్న్స్ వ్యాధి  అంటారు.

పెద్ద ప్రేగులో సైతం ఈ క్రొహ్న్స్ వ్యాధి(Crohns disease) అవకాశం వుంది కాబట్టి దీన్ని ఆ ప్రాంతం లో వచ్చే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీస్(Infammatory bowel disease) లో ఒకటిగా గుర్తించారు.

అన్ని వయసులో వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం వున్న 18 నుంచి 40 వయసు వున్నా వారిలో ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది.

18 లోపు వారికి క్రొహ్న్స్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. క్రొహ్న్స్ డిసీస్ వచ్చినప్పుడు జీర్ణ నాళం పొడవునా ఎక్కడైనా పుండ్లు రావచ్చు ఒక్కొక్క సారి జీర్ణ నాళం సన్నబారిపోవచ్చు.

ఇలా సన్నబారడాన్ని స్ట్రెచర్(Strecher) అంటారు.  కడుపు నొప్పి ఎక్కువగా ఉండడం దీని ప్రధాన లక్ష్యం.

దీనితో పాటు జ్వరం, ఆకలి తగ్గటం టాయిలెట్ కు వెళ్లినప్పుడు నొప్పి రావడం, బరువు తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇదే కాక రక్త విరేచనాలు, మలద్వారాని సంబందించినసమయాలైన ఫిస్టులా(Fistuela),మలద్వారం చీరుకుపోవడం సమస్యలు కనిపిస్తాయి.

క్రొహ్న్స్ వ్యాధి వల్ల నోట్లో పొక్కులు, చర్మ సమస్యలు, కళ్లు ఎర్రబారి మండటం కూడా ఉండవచ్చు.

క్రొహ్న్స్ వ్యాధి వున్నా వారి లో 5 శాతం మందిలో కంటి సమస్యలు ఉంటాయి.కళ్ల ఇన్ఫ్లమేషన్  కారణంగా కళ్ల మంటలు, దురదలు ఉంటాయి. క్రొహ్న్స్ వ్యాధి నిర్దారణలో అప్రమత్తత అవసరం.

ఎందుకంటే క్రొహ్న్స్ వ్యాధి లక్షణాలు చాలా సందర్భాల్లో ప్రేగుల్లో వచ్చే టిబి తో పోలి ఉంటాయి. క్రొహ్న్స్ వ్యాధి వున్నప్పుడు అందరిలోనూ ఒకే రకమైన లక్షణాలు కనిపించకపోవచ్చు.  వ్యాధి దశను బట్టి అది వున్న ప్రదేశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి.

వ్యాధి తోలి దశలో విరేచనాలు, కడుపు నొప్పి ఉంటాయి. రెండో దశలో విరేచనాలు తరుచు గ అవుతుంటాయి. ఇంకా జ్వరం తీవ్ర స్థాయిలో కడుపు నొప్పి ఉంటాయి.

గుర్తించతగిన స్థాయిలో బరువు తగ్గిపోతారు వ్యాధి తీవ్ర దశకు చేరినప్పుడు జ్వరం ఎక్కువగా ఉంటుంది. వాంతులవుతుంటాయి.ప్రేగుల్లో పస చేరుకొని అవి ఇన్ఫెక్షన్(Infections) కి గురవుతాయి.

ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. కాబట్టి ౩౦ ఏళ్ళు లోపే ఈ సమస్యను  నిర్దారించుకుంటే వ్యాధి తీవ్రత కాకుండా ఉంటుంది. మొదట క్లినికల్ నిర్దారణ చేస్తారు.

తరువాత కొలోన్ స్కోపీ(Colon scopy), సిగ్మాన్దో స్కోపీ(sigmond scopy), బేరియం ఎనిమా ఎస్-రే(Bareium enema X-Ray) వంటి పరీక్షలు చేసి పూర్తిగా నిర్దారణ చేస్తారు. దీన్ని ఏ మాత్రం అశ్రద్ధ చేసిన కొలొరెక్టోల్ క్యాన్సర్(Colorectal Cancer) కి దారి తీయవచ్చు అంటున్నారు. వ్యాద్యులు. కాని జీవ శైలిలో మార్పులు అంటే డైరీ ఉత్పత్తులు తగ్గించడం, చక్కర శాతం ఎక్కువ లేకుండా చూసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, పోషకాహార లోపడం లేకుండా జాగ్రత్తపడటం, ప్రొసెస్డ్ మరియు  పచ్కగె చేసిన ఆహారపదార్దాలను పూర్తిగా తగ్గించడం అల్కోహాల్, కెఫిన్ కు స్వస్తి చెప్పడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంది ఈ సమస్య నుంచి బయటపడగలుగుతున్నారు.

 క్రొహ్న్స్ డిసీస్(Crohns disease) కి అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో వున్నాయి.

అయితే వ్యాధి సోకినా శరీర భాగాన్ని బట్టి చికిత్స చేస్తారు. క్రొహ్న్స్ వ్యాధి చాల వరకు ప్రాణానికి ముప్పనేది లేకపోయినా ఈ వ్యాధి వున్నపుడు సాధారణ జీవితం దెబ్బ తింటుంది.

కడుపు నొప్పి విరేచనాలు వంటి సమస్యల కారణంగా  పనులను  నిత్య జీవితంలో సమర్దవంతంగా చేయలేరు. గర్భణీలు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీస్ వున్నప్పుడు గర్భ స్రావానికి దారితీయవచ్చు.

అందుకే వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే వ్యాద్య పరీక్షలు చేయించుకోవాలి. సమస్య ఉందని తెలిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ల సలహా మేరకు వ్యాధిని అదుపులో ఉంచుకునే అవకాశం వుంది.

అలాగే కడుపులోని బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవచ్చు. సరైన చికిత్సతో పాటు జీవన శైలి(Life style)లో మార్పు చేసుకుంటూ ఉంటే ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు